హోమ్ కాంగో లో పడవ తిరగబడిన వీడియోని గోవాకి చెందిన వీడియోలా షేర్ చేసారు

కాంగో లో పడవ తిరగబడిన వీడియోని గోవాకి చెందిన వీడియోలా షేర్ చేసారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

అక్టోబర్ 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
గోవాలో పడవ తిరగబడింది అంటూ సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో గోవాలో పడవ తిరగబడింది అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

పడవ తిరగబడింది అంటూ వైరల్ అవుతున్న వీడియో కాంగో లోని కీవు చెరువులో జరిగిన సంఘటనకు సంభందించిన వీడియో, గోవా లోనిది కాదు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో పడవ మునిగిపోతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది, దీనిని షేర్ చేస్తూ ఇది భారతదేశం లోని గోవాలో జరిగిన ఘటన అంటూ షేర్ చేసారు. ఈ 53 సెకెన్ల వీడియో, మరొక పడవ నుండి తీసినట్టుగా కనపడుతుంది, ఈ వీడియోలో ఒక నీలం మరియు తెల్ల రంగు పడవ ప్రయాణికులతో వస్తుండగా, కాసేపటికే అది ప్రయాణికులతో సహా నీటిలో మునిగి పోయింది. మరో పడవ వరకు ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తుండటం మనం గమనించవచ్చు.

ఈ వీడియోని ఎక్స్ లో షేర్ చేసి, “ఈరోజు జరిగిన గోవా ఆక్సిడెంట్: 23 శవాలు బయటపడ్డాయి, 40 మందిని కాపాడారు, ఇంకా 64 మంది కనపడుటలేదు. పడవ యజమాని కక్కుర్తి వలన ఎక్కువ మందిని ఎక్కించటం, పైగా ప్రయాణికుల ఆశ్రద్దే దీనికి కారణం అయింది. చాలా బాధాకరం.”ఇలాంటి క్లెయిమ్స్ ఫేస్బుక్ లో కుడా చక్కర్లు కొట్టాయి. ఆర్కైవ్ చేసిన లాంటి మరిన్ని పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో గోవా కి చెందినది కాదు, ఈ ఘటన అక్టోబర్ 3, 2024 నాడు మధ్య ఆఫ్రికా లోని కాంగో లో చోటు చేసుకుంది.

వాస్తవం ఏమిటి? 

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగో లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అనేక వార్త కథనాలు మాకు లభించాయి. వాటిలో అక్టోబర్ 4, 2024 నాడు సి జి టి ఎన్ ఆఫ్రికా సంస్థ రచించిన కథనంలో (ఆర్కైవ్ ఇక్కడ) వైరల్ వీడియో మాదిరి వీడియోనే అందులో 23 సెకెన్ల నుండి 42 సెకెన్ల వ్యవధి మధ్య ఉంది. దీని ప్రకారం దద్దపుగా 78 మంది కాంగో లోని కీవు చెరువులో పడవ మునిగిపోవటం వలన మరణించారు అని ఉంది. 

ఈ కథనం ప్రకారం, అక్టోబర్ 3 నాడు, ఆ పడవ 250 మందిని ఎక్కించుకుంది, ఇందులో దాదాపుగా 78 మంది చనిపోయారు, అందులో అనేక మంది గల్లంతు అయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ప్రకారం, కొంత మంది ప్రయాణికులు పడవ లో నుండి భయం తో పడవ నుండి దూకేశారు. 

ప్రాణాలతో బయట పడిన వారిని అక్కడే ఉన్న డి కేశెరో ఆసుపత్రికి తరలించారు. ఈ కథనం లో అప్పట్లో మధ్య ఆఫ్రికా లో పడవలలో ఎక్కువ మందిని ఎక్కించుకోవటం సమస్య గురించి దర్యాప్తు కొనసాగుతుంది అని రాసుకొచ్చారు.

పైగా అక్టోబర్ 3 నాడు ప్రచురితమైన అల్ జజీరా వీడియో కథనం (ఆర్కైవ్) మరియు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఈ సంఘటన తూర్పు కాంగో లోని కీవు చెరువులో చోటు చేసుకుంది. ది గార్డియన్ ప్రకారం, ఎం వి మెరిడి అనే పడవ, కిటుకు పోర్ట్ కు సమీపిస్తుండగా గోమా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. గార్డియన్ మాట్లాడిన కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నిబంధనల ప్రకారం, ఈ పడవ 80 మందిని ఎక్కించుకోవాల్సి ఉండగా, ఆ రోజున 278 మంది ఎక్కినట్టు తెలిపారు.

గోవా పోలీసులు కుడా తమ ఎక్స్ అకౌంట్, ఈ వీడియో గోవా కి చెందినది కాదు అని కాంగో కి చెందినది అని తెలియజేసారు. అక్టోబర్ 5 నాడు, ‘గోవా లో అధిక ప్రయాణికుల వలన పడవ బోల్తా’ అని షేర్ చేసిన ఒక ఎక్స్ పోస్టును షేర్ చేసి గోవా పోలీసులు ఈ సంఘటన ఆఫ్రికా లోని కాంగో లో గోమా అనే ప్రాంతం లో జరిగింది అని తెలియజేసారు. పైగా రుజువులు లేని వార్తలను షేర్ చేయకూడదు అని ప్రజలను హెచ్చరించారు (ఆర్కైవ్ ఇక్కడ).

గోవా పోలీసులు వైరల్ వీడియో గోవాకి చెందినది కాదు అని స్పష్టం చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్) 

గోవా కి చెందిన ఒక వార్త పత్రిక ఓ హెరాల్డో గోవా కథనం ప్రకారం (ఆర్కైవ్ ఇక్కడ), కోస్ట్ గార్డులు మరియు గోవా పోలీసులు ఈ వీడియో ఫేక్ అని నిర్ధారించారు. అక్టోబర్ 2024 నాటికి, గోవా లో పడవ బోల్తా పడినట్టు ఎటువంటి సంఘటన చోటుచేసుకోలేదు. 

తీర్పు 

వైరల్ వీడియోని తప్పుగా గోవాలో పడవ మునిగిపోయిన వీడియో లా షేర్ చేసారు, కానీ ఈ సంఘటన కాంగో లో చోటు చేసుకుంది. ఈ సంఘటన లో 78 మంది కీవు చెరువు లో పడవ బోల్తా పడటం వలన ప్రాణాలు కోల్పోయారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.