హోమ్ గ్వాటెమాలా వీడియోని తప్పుగా భారతదేశం లోని పాడైన రోడ్డులా షేర్ చేసారు

గ్వాటెమాలా వీడియోని తప్పుగా భారతదేశం లోని పాడైన రోడ్డులా షేర్ చేసారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

సెప్టెంబర్ 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇది భారతదేశంలో పాడైన రోడ్డు అంటూ కొంత మంది సామాజిక మాధ్యమాలలో యూజర్లు గ్వాటెమాలా లోని రోడ్డును షేర్ చేసారు గ్వాటెమాలా లోని రోడ్డును షేర్ చేసి, ఇది భారతదేశంలో పాడైన రోడ్డు అంటూ కొంత మంది సామాజిక మాధ్యమాలలో యూజర్లు షేర్ చేసిన పోస్ట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది భారతదేశానికి చెందిన వీడియో కాదు, గ్వాటెమాలా లోని జాతీయ రహదారి సి ఏ - 9 లో పాడైన రోడ్డు వీడియో.

క్లెయిమ్ ఏమిటి?

ఒక పాడైన రోడ్డు నుండి నీరు పైకి చిమ్ముతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. దీనిని షేర్ చేసి, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ కొందరు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు.

కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర సింగ్ రాజ్ పుత్ , ఈ వీడియోని షేర్ చేసి హిందీలో వ్యంగ్యంగా శీర్షిక పెట్టి “ఈ విధంగా ‘రోడ్-బ్రేకింగ్’ అభివృద్ధి చేసినందుకు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్,” అని రాసుకొచ్చారు. ఈ క్లెయిమ్ ను సెప్టెంబర్ 17 నాడు, మోదీ పుట్టినరోజు సందర్బంగా షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


కానీ ఈ వీడియో గ్వాటెమాలా కి చెందినది, భారతదేశానికి చెందినది కాదు. 

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, గ్వాటెమాలాకి సంబంధించిన ఒక వార్త సంస్థ ప్రేన్సా లిబ్రే ప్రచురించిన ఒక కథనం లభించింది. సెప్టెంబర్ 12, 2024 లో ప్రచురితమైన ఈ కథనం ప్రకారం,  గ్వాటెమాలా లోని విల్లా నుఎవ గ్రామం లోని సి ఏ 9 జాతీయ రహదారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది అని ఉంది. ఈ కథనంలో వైరల్ వీడియోకి సంబంధించిన ఫొటోలు కుడా ఉన్నాయి. కథనం ప్రకారం, భారీ వర్షాల అనంతరం, రోడ్డుకు గొంత పడింది. లా హోరా లో ప్రచురితమైన మరో వార్త కథనం ప్రకారం, సెప్టెంబర్ 12 నాడు వర్షాలు కురవడంతో అదే రోజు సాయంత్రం, ఈ విధంగా జరిగింది అని రాసి ఉంది.

గూగుల్ మ్యాప్స్ ద్వారా జియోలొకేషన్ ను పరిశీలించగా, ఇది గ్వాటెమాలా లోని విల్లా నుఎవ గ్రామం లోని సి ఏ 9 దారి అని నిర్ధారణ అయింది. ఇది భారతదేశానికి చెందినది కాదు.  

తీర్పు

గ్వాటెమాలా లో ఒక పాడైపోయిన రోడ్డు నుండి నీరు చిమ్ముతున్న వీడియోని, తప్పుగా ఇది భారతదేశానికి చెందినట్టుగా, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ షేర్ చేసారు.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.