హోమ్ ప్రియాంక గాంధీ సిలువ వేసుకున్నట్టు వైరల్ అయిన ఫొటో ఎడిట్ చేసినది

ప్రియాంక గాంధీ సిలువ వేసుకున్నట్టు వైరల్ అయిన ఫొటో ఎడిట్ చేసినది

ద్వారా: తాహిల్ అలీ

నవంబర్ 15 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్రియాంక గాంధీ సిలువ వేసుకుంది అంటూ వైరల్ అయిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ప్రియాంక గాంధీ సిలువ వేసుకుంది అంటూ వైరల్ అయిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

వైరల్ అవుతున్న ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేసినది. ఈ వీడియోకి ఒరిజినల్ ఫొటో లో ప్రియాంక గాంధీ, అండాకారం లో ఉన్న లాకెట్ వేసుకున్నారు, సిలువ కాదు.

క్లెయిమ్ ఏమిటి? 

భారతీయ నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ప్రియాంక గాంధీ క్రైస్తవుల క్రాస్ వేసుకున్నట్టుగా రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి, ఓటర్లను మెప్పించడానికి కావాలనే ఈ విధంగా వేసుకున్నట్టు వ్యాఖ్యానిస్తూ షేర్ చేసారు. 

ఈసారి కేరళ లోని వాయనాడ్ లో నవంబర్ 13, 2024 న జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలో తొలిసారిగా ప్రియాంక గాంధీ నిలబడనున్నారు. ఈ నేపధ్యం లో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఒక ఎక్స్ యూజర్ ఈ ఫొటోలను షేర్ చేసి, “హిందువులను ఎలా ఫూల్స్ చెయ్యాలో ఇక్కడ చూడండి.” ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 196,000 వ్యూస్ ఉన్నాయి పైగా 15,000 లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)



ప్రియాంక గాంధీ సిలువ వేసుకున్న ఫొటో ఎక్కడిది? 

సిలువ ఉన్న వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఎన్డీటీవీ లో ఫిబ్రవరి 18, 2017 నాడు అప్లోడ్ చేసిన ఫొటో ఒకటి లభించింది. ఈ ఫొటోకి శీర్షిక ద్వారా, ఇది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయం లో ప్రియాంక గాంధీ రాయబరేలి లో తీసిన ఫొటో అని అర్ధమవుతుంది. ఈ ఫొటోలో, గాంధీ ఒక అండాకారం లో ఉన్న వెండి లాకెట్ ను ధరించారు, ఇది సిలువ కాదు. ఇందులో, వెనుకాల ఉన్న కొంతమంది మనుషుల్ని కూడా వైరల్ ఫొటోలో తీసేసారు.

వైరల్ ఫొటోకి మరియు 2017 ఫొటో కి మధ్య పోలిక (సౌజన్యం : ఎన్డీటీవీ/ఎక్స్)


గెట్టి ఇమేజెస్ కూడా ఈ ఫొటోని ప్రచురించి సంజయ్ కనోజియా/ఏఎపి కి ఆపాదించారు. ఇది రాయిబరేలి లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ర్యాలీ లో భాగంగా  ఫిబ్రవరి 17, 2017 నాడు తీసినట్టుగా తెలుస్తుంది. బిబిసి తమిళ్,నేషనల్ హెరాల్డ్,ది నేషనల్ మరియు ది ఎకనామిక్ టైమ్స్ లాంటి ఇతర వార్తా కథనాలను కూడా ఇదే ఫొటోను ప్రచురించాయి.

రుద్రాక్ష ఫొటో 

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఉన్న అనేక వీడియోలు మాకు లభించాయి, అందులో మార్చ్ 20, 2019 నాడు షేర్ చేసిన ఏబిపి న్యూస్ (ఆర్కైవ్ ఇక్కడ) ఒకటి. ఈ రుద్రాక్ష మాల వేసుకుని ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి లో జరిగిన ప్రసంగం లో కూడా మాట్లాడారు.

ఏబీపీ షేర్ చేసిన వీడియోలో 0:38 మరియు 1:25 వద్ద, ప్రియాంక గాంధీ మనకు కనిపిస్తుంది. పైగా, గెట్టి ఇమేజెస్ కూడా గాంధీ రుద్రాక్షలు వేసుకున్న ఫొటోని మార్చ్ 2019 లో వారణాసి లో తీసినట్టుగా తెలుస్తుంది. 

తీర్పు 

ప్రియాంక గాంధీ సిలువ వేసుకుని ఉన్న ఫొటో ఎడిట్ చేసినది. ఒరిజినల్ ఫొటో 2017 రాయిబరేలి లోని ఉత్తర్ ప్రదేశ్ లో తీశారు. రుద్రాక్షల తో కూడిన ఫొటో ఒరిజినల్ ఫొటోనే, దీనిని 2019 లో వారణాసి లో తీశారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

Read this fact check in English here



ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.