హోమ్ 2019 నాటి సిఏఏ విరుద్ధ నిరసన వీడియోను సంభాల్ హింసకు చెందినట్టుగా షేర్ చేస్తున్నారు

2019 నాటి సిఏఏ విరుద్ధ నిరసన వీడియోను సంభాల్ హింసకు చెందినట్టుగా షేర్ చేస్తున్నారు

ద్వారా: తాహిల్ అలీ

నవంబర్ 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
గోరఖ్పూర్ కి చెందిన వీడియోను ఈ మధ్య కాలంలో సంభాల్ హింసకు చెందినట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో గోరఖ్పూర్ కి చెందిన వీడియోను ఈ మధ్య కాలంలో సంభాల్ హింసకు చెందినట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది 2019 ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్లో జరిగిన సిఏఏ విరుద్ధ నిరసనల వీడియో.

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో ఒక పెద్ద గుంపు పై పోలీసులు  లాఠీ ఛార్జ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది, దీనిని షేర్ చేసి, ఇది ఈమధ్య ఉత్తర్ ప్రదేశ్ లోని సంబల్ లో జరిగింది అన్నట్టుగా షేర్ చేస్తున్నారు.

ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “సంభాల్ హింస కు పాల్పడిన వ్యక్తులపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మీరు పోలీసులు చేసిన పనిని సమర్ధించినట్టయితే రీపోస్టు చేయండి,” అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే అనేక మంది యూజర్లు తమ పోస్టులను షేర్ చేసారు, వాటి ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ సవరణ)


సంభాల్ లో జరిగిన హింస నేపధ్యం లో పై వీడియో వైరల్ అయింది. నవంబర్ 24 నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో కోర్ట్ చారిత్రాత్మక మొఘలుల నాటి షాహీ జామ మస్జీద్ ను సర్వే చేయమని కోరింది, దీని వలన నిరసనలు చెలరేగాయి. ఈ సమయం లో అధికారులకి మరియు నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు, మరో 20 పోలీసులకు గాయాలు అయ్యాయి. 

కానీ మా పరిశోధన ప్రకారం, ఈ వీడియో 2019 నాటి ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో జరిగిన సిఏఏ విరుద్ధ నిరసనలకు సంబంధించిన వీడియో. 

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న వీడియో 2019 నాటిది అని తేలింది. ఎక్స్ లో ‘@imMAK02' అనే ఒక యూజర్, డిసెంబర్ 31, 2019 నాడు వీడియోని షేర్ చేసిన పోస్ట్ లో, “ఈ వీడియో గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించినది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సిఏఏ విరుద్ధ నిరసనకారులపై చర్యలు తీసుకున్నారు.” అంటూ రాసుకొచ్చారు. ఇందులో పోలీసులు కొంత మంది వ్యక్తులను కొట్టడం మనం చూడవచ్చు, ఇక్కడ వైరల్ వీడియోలో కనిపిస్తున్న రోడ్డ్ మనకు కనిపిస్తుంది. (ఆర్కైవ్ ఇక్కడ)

ఎక్స్ లో యూసర్ షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/@imMAK02/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

జనవరి 25, 2020 నాడు షేర్ చేసిన జడ్జి అడ్వొకేట్స్ పీడిత సంస్థ (JAPO) ఫేస్బుక్ వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) ద్వారా కూడా ఇది సిఏఏ విరుద్ధ నిరసనల వీడియో అని అర్ధమవుతుంది. 

పైగా, ఈటీవి భారత్, ఉత్తర్ ప్రదేశ్ తక్, లో ప్రచురించిన వీడియోలలో కూడా ఇదే విధమైన సన్నివేశాలు మనకు వేరే కోణం నుండి కనిపిస్తాయి (ఆర్కైవ్ ఇక్కడ). మరియు లైవ్ హిందుస్థాన్ ప్రచురించిన వీడియో (ఆర్కైవ్ ఇక్కడ) ఇలాంటి వీడియోనే ఉంది. దీనికి శీర్షికగా, గోరఖ్పూర్ : సిఏఏ విరుద్ధ నిరాశా కార్యక్రమం లో ఇద్దరికీ గాయాలు. ఇందులో ఒక నీలం రంగు షట్టర్ ఉన్న షాప్ మరియు ఎరుపు రంగు బ్యానర్ కనిపిస్తుంది.

2019 మరియు వైరల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ లైవ్ హిందుస్థాన్/ ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ సవరణ) 

గోరఖ్పూర్ లోని నఖాస్ రోడ్డు ను జియోలొకేషన్ ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లో కనుగొన్నము. ఇందులో కనిపించే కొన్ని షాప్ గుర్తులు, దగ్గర్లో ఉన్న భవనాలు, కరెంటు పోల్స్ వంటివి మనం రెండింటిలోనూ గుర్తించవచ్చు.

తీర్పు

వైరల్ అవుతున్న వీడియో గోరఖ్పూర్ లోని ఉత్తర్ ప్రదేశ్ లో డిసెంబర్ 2019 లో జరిగిన సిఏఏ విరుద్ధ నిరసనల వీడియో. సంభాల్ లోని హింస కు సంబంధించినది కాదు.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.