ద్వారా: రజిని కె జి
సెప్టెంబర్ 10 2024
ఈ ఫొటోని 2018 లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇంకా నిర్మాణ దశలో ఉన్నప్పుడే తీసినది.
క్లెయిమ్ ఏమిటి?
భారత దేశం లోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న స్టాట్యూ అఫ్ యూనిటీ విగ్రహ నిర్మాణ సమయం ఫొటోని షేర్ చేసి, విగ్రహానికి పగుళ్లు వచ్చినట్టుగా, అది ఏ తరుణం లోనైనా పడిపోతుంది అనే విధంగా క్లెయిమ్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. స్టాట్యూ అఫ్ యూనిటీ విగ్రహం అనేది నర్మదా నది పై ఉన్న 183 మీటర్ల ఎత్తు గల సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిమ, ఈయన భారత స్వతంత్ర సమరయోధుడు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ లో ఈ విగ్రహాన్ని ప్రారంభించారు.
ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూసర్ ఈ ఫొటోని షేర్ చేసి, “ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు, పగుళ్లు మొదలయ్యాయి” (హిందీ అనువాదం). ఈ పోస్టులో విగ్రహానికి సంబంధించిన రెండు ఫొటోలు ఉన్నాయి, ఒకటి విగ్రహానికి సంభందించి పైనుంచి తీసిన ఫొటో మరియు ఇంకోటి నిర్మాణ సమయంలో విగ్రహం పాదాల వద్ద తీసిన ఫొటో. ఈ పోస్టుకు కథనం రాసే సమయానికి 8,400 లైక్స్ మరియు 2,100 రీపోస్టులు ఉన్నాయి.
ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ క్లెయిమ్ అబద్ధం. వైరల్ అవుతున్న ఫొటో విగ్రహ ఆవిష్కరణ సమయం లోనిది, అప్పట్లో నిర్మాణ పనులు ఇంకా పూర్తవ్వలేదు.
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, న్యూ యార్క్ టైమ్స్ కథనం అక్టోబర్ 31 నాడు 2018 లో ప్రచురించిన వైరల్ ఫొటో మాదిరి ఫొటో ఒకటి లభించింది. ఈ ఫొటోకి శీర్షికగా, “నిర్మాణ కార్మికులు అక్టోబర్ 18 నాడు విగ్రహానికి ఆఖరి మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఫోటోని యురొపియన్ ప్రెస్ ఫొటో ఏజెన్సీ కి ఆపాదిస్తూ, దివ్యకాంత్ సోలంకి అనే వ్యక్తి తీసినట్టుగా తెలియజేసారు.
ఈ పి ఏ ఫొటో వెబ్సైటులో కుడా సోలంకి తీసిన ఫొటోని మేము కనుగొన్నము, ఇది అక్టోబర్ 18, 2018 నాడు ప్రచురించబడింది. దీనికి వివరణ గా, “అహ్మదాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో కెవాడియా వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద భారత నిర్మాణ కార్మికులు,” అని ఉంది.
స్టాట్యూ అఫ్ యూనిటీ ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఈపిఏ)
ఎల్ ఏ టైమ్స్ మరియు బిబిసి న్యూస్ హిందీ కుడా ఇదే ఫొటోని షేర్ చేసి ఈపిఏ కి ఆపాదించారు.
వైరల్ ఫొటో లో కార్మికులు విగ్రహా ఆవిష్కరణకి ముందు ఆఖరి మెరుగులు దిద్దుతున్నట్టు ఉంది. పైగా, ఇండియా టుడే వీడియో ప్రకారం, 2018 లో విగ్రహ ఆవిష్కరణ సమయంలో పాదాల వద్ద ఎటువంటి పగుళ్లు లేవు. పైగా, ఈ మధ్య కాలం స్టాట్యూ అఫ్ యూనిటీ వారి అధికారిక ఫేస్బుక్ పేజీ లో పెట్టిన ఫొటోలో కుడా ఎలాంటి పగుళ్లు లేవు.
ఆగష్టు 26 నాడు అధిక వర్షాల తరువాత సింధుదుర్గ్ లోని రాజకోట ఫోర్ట్ వద్ద ఉన్న మరాఠా రాజు చ్ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన అనంతరం ఈ క్లెయిమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 4, 2023 నాడు 35 అడుగుల విగ్రాన్ని ఆవిష్కరించారు. ఈ విషయం గురించి భారతీయ నావికా దళం మరియు నిపుణుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ది హిందూ కథనం ప్రకారం జైదీప్ ఆప్టే అనే శిల్పి మరియు కాంట్రాక్టర్ ని కుడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
తీర్పు
2018 నాటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయం ఫొటోని, ఈ మధ్య కాలంలో విగ్రహానికి పగుళ్లు వచ్చినట్టుగా షేర్ చేసారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)