హోమ్ పుష్పా 2 కార్యక్రమాన్ని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ర్యాలీ అంటూ షేర్ చేసారు

పుష్పా 2 కార్యక్రమాన్ని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ర్యాలీ అంటూ షేర్ చేసారు

ద్వారా: తాహిల్ అలీ

నవంబర్ 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇది మహారాష్ట్రలోని ఎంవిఏ మీటింగ్ అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఇది మహారాష్ట్రలోని ఎంవిఏ మీటింగ్ అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ మార్పు)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న వీడియో బీహార్ లో జరిగిన పుష్పా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లోనిది.

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో ఒక 45 సెకెన్ల వీడియో వైరల్ అవుతుంది, ఇందులో అధిక సంఖ్య లో హాజరైన జనాలను మనం చూడవచ్చు, ఇక్కడ స్టేజి పైన ఒక పెద్ద స్క్రీన్ కూడా ఉంది. ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక టవర్ లాంటి కట్టడం పైకి ఎక్కడం కూడా మనం గమనించవచ్చు. ఈ వీడియోని షేర్ చేసి ఇది మహా వికాస్ అఘాడి ర్యాలీ అంటూ షేర్ చేసారు.  మహా వికాస్ అఘాడి అనేది మహారాష్ట్ర లో 2019 ఎన్నికల తరువాత రూపొందిన కూటమి.

ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, మరాఠీ లో, “బికెసి లో మహా వికాస్ అఘాడి ర్యాలీకి వచ్చిన లక్షలాది జనాలను చుడండి. ప్రజలు తమ నమ్మకాన్ని చూపిస్తున్నారు, ఏకమవుతున్నారు, మహారాష్ట్ర భవిషత్తు కోసం ముందడుగు తీసుకుంటున్నారు,” అంటూ  రాసుకొచ్చారు. (తెలుగు అనువాదం)

అనేక మంది యూజర్లు ఇదే విధమైన వ్యాఖ్యలతో షేర్ చేసారు, మరొక యూజర్ ఈ వీడియో షేర్ చేసి ఇది ముంబై లోని ఎంవిఏ ర్యాలీ డ్రోన్ వీడియో అంటూ రాసుకొచ్చారు. మరిన్ని పోస్టుల ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ మార్పులు) 


ఈ క్లెయిమ్ మహారాష్ట్ర ఎన్నికల నేపధ్యం లో వైరల్ అవుతుంది, అక్కడ నవంబర్ 20న ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది.

కానీ, వైరల్ వీడియోలో ఉన్నది, రాబోయే ‘పుష్పా 2: ది రూల్’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం వీడియో, ఇది బీహార్ లోని పాట్నా లో గాంధీ మైదాన్ లో నిర్వహించారు.

వాస్తవం ఏమిటి? 

వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అనేక వార్త కథనాలు మాకు లభించాయి, వాటి ద్వారా, ఈ వీడియో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా 2: ది రూల్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించినదే అని నిర్ధారణ అవుతుంది.

ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన యు వి మీడియా తమ యూట్యూబ్ ఛానెల్ లో నవంబర్ 17, 2024 నాడు లైవ్ స్ట్రీమ్ చేసారు, దీనికి శీర్షిక గా, “Pushpa 2 - The Rule Massive Trailer Launch Event LIVE,” అని రాసి ఉంది. ఇందులో కూడా, వైరల్ వీడియో మాదిరి సన్నివేశాలు మనం చూడవచ్చు, అవి 5:25 నుండి 5:33 టైం స్టాంప్ మధ్య కనిపిస్తాయి. ఇక్కడ కూడా కొంత మంది వ్యక్తులు ఒక టవర్ లాంటి కట్టడాలను ఎక్కడం మనం చూడవచ్చు (ఆర్కైవ్).

వైరల్ వీడియో మరియు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మధ్య పోలిక (సౌజన్యం : యూట్యూబ్/యువి మీడియా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ మార్పులు)


పైగా, వైరల్ వీడియోలో 9 నుండి 23 సెకెన్ల మధ్య స్క్రీన్ మీద “India’s No. 1” అని కనపడే సన్నివేశం మనకు లైవ్ స్ట్రీమ్ లో కూడా 6:44 నుండి 6:54 మధ్య కనిపిస్తుంది.

లైవ్ స్ట్రీమ్ వీడియో మరియు వైరల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం : యూట్యూబ్/యువిమీడియా/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ మార్పులు)


పైగా, వైరల్ వీడియోలో 23 సెకెన్ల వద్ద కనిపించే సన్నివేశాలు, యుట్యూబ్ వీడియోలో కూడా 7:46-7:52 మరియు 8:17-8:30 వద్ద కనిపిస్తాయి, వీటిలో కార్యక్రమ ప్రదేశానికి సంబందించిన ఏరియల్ వీడియో చూడొచ్చు, వీటిలో టవర్ పైన కొంత మంది వ్యక్తులు ఎక్కి ఉండటం కూడా మనం గమనించవచ్చు.

పైగా, యువి మీడియా షేర్ చేసిన వీడియో మొదట్లో యాంకర్ మాట్లాడుతూ, “పుష్పా ఈరోజు పాట్నా లో” అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో పుష్పా 2 స్టికర్ మరియు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా రాసి ఉంది.

వీటన్నిటి ద్వారా ఇది మహారాష్ట్ర లోని రాజకీయ ర్యాలీ కాదు అని మనం నిర్ధారించవచ్చు. 

పైగా, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇండియా టుడే (ఆర్కైవ్ ఇక్కడ) వంటి అనేక వార్తా కథనాలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తాయి. ఈ కథనాల ప్రకారం, ఈ కార్యక్రమం పాట్నా లోని గాంధీ మైదాన్ లో జరిగింది.

తీర్పు 

వైరల్ అవుతున్న వీడియో అల్లు అర్జున్ రష్మిక మందన్న నటించిన ‘పుష్పా 2: ది రూల్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చెందిన వీడియో. ఈ కార్యక్రమం బీహార్ లో జరిగింది, మహారాష్ట్ర లో జరిగిన రాజకీయ ర్యాలీకి సంబంధం లేదు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

Read this fact check in English here

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.