ద్వారా: ఇషిత గోయల్ జె
నవంబర్ 8 2024
ట్రంప్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr. గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ ప్రజలు 'బాబీ బాబీ' అని నినాదం చేశారు, అది ఆయనకు ముద్దు పేరు.
క్లెయిమ్ ఏమిటి?
ట్రంప్ ప్రజలును ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగం వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. కొంత మంది ఈ వీడియో క్లిప్ ను షేర్ చేసి, అక్కడ ప్రజలు 'మోదీ మోదీ' అని నినాదాలు చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. మోదీ అంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు.
ఈ వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ, “మేక్ అమెరికా హెల్తీ అగైన్” అని అనటం మనం వినవచ్చు. దానికి స్పందనగా, ప్రజలు, ‘బాబీ బాబీ’ అని నినాదాలు చేయటం మనకి వినిపిస్తుంది. దీనికి బదులుగా, “అతడు గొప్ప వ్యక్తి, తనకి కొన్ని పనులు చెయ్యాలి అని ఉంది, మనం వాటిని చెయ్యనిద్దాం.” అని అన్నారు.
ఈ వీడియోని షేర్ చేసి, అక్కడి అమెరికా ప్రజలు ‘మోదీ మోదీ’ అని అన్నారు అంటూ రాసుకొచ్చారు. ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “మోడీ మోడీ మోడీ నినాదాలతో హోరెత్తిన సభ వేదిక.. ట్రాంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ బావుటా సుగమం అయిన వేళా ఆయన అమెరికన్లు ఉద్దేశించి ప్రసంగించారు.. ఆ సమయంలోనే మోడీ మోడీ మోడీ నినాదాలతో మార్మోగింది.. ట్రంప్ కూడా మోడీ గ్రేట్ గాయ్ అన్నారు.. ఆయన కూడా ఏదో మంచి చేయాలనే ముందుకు వెళుతున్నాడు అనీ ట్రంప్ వ్యాఖ్యానించారు,” అంటూ రాసుకొచ్చారు.
అలాంటి మరిన్ని పోస్టులు, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కొంత మంది బీజేపీ పార్టీ నేతలు అయిన బాగబాన్ దాస్, జీతూ జిరాటి మరియు వివిన్ భాస్కరన్ కూడా ఈ వీడియోని షేర్ చేసారు, వారి పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/యూట్యూబ్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ట్రంప్ మరియు మోదీల మధ్య ఉన్న సత్ సంభంధాల గురించి అనేక వార్తా కథనాలు ప్రచురించాయి, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం ‘నమస్తే ట్రంప్’ మరియు ‘హౌడీ మోదీ’ లాంటి కార్యక్రమాలలో కూడా తెలుస్తుంది.
కానీ మా పరిశోధన ప్రకారం, ఇక్కడ ప్రజలు పలుకుతుంది 'మోదీ మోదీ' నినాదాలు కాదు, 'బాబీ బాబీ' అని పలకటం జరిగింది.
వాస్తవాలు ఏమిటి?
కొన్ని పోస్టులలో పిబిఎస్ న్యూస్ లోగో మాకు కనిపించింది, దీని ద్వారా మరింత నిడివి ఉన్న వీడియోను మేము కనిపెట్టాము (ఆర్కైవ్ ఇక్కడ) దీనిని యూట్యూబ్ లోని పిబిఎస్ న్యూస్ హౌర్ షో లో నవంబర్ 6, 2024 నాడు “Trump hosts election night watch party in West Palm Beach, Florida” అనే శీర్షికతో అప్లోడ్ చేసారు. ఇందులో, 7:52:14 టైం స్టామ్ప్ వద్ద వైరల్ క్లిప్ మాదిరి వీడియో మనం చూడవచ్చు.
ఇందులో, ట్రంప్ తన ప్రసంగంలో కెన్నెడీ గురించి ప్రస్తావించారు, “ఇంత గొప్ప ప్రజలలో, కొంత మంది కష్టపడే ప్రజలు ఉన్నారు, కొంత మంది అద్భుతమైన వారు ఉన్నారు, అందులో కొంత మంది రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr లాగా, అయన మరల అమెరికాను ఆరోగ్యాంగా చేయడానికి తోడ్పడతాడు.”
దీని వెంటనే, అక్కడి ప్రజలు ‘బాబీ బాబీ’ అని నినాదం చేయటం మనం చూడవచ్చు. తరువాత, ట్రంప్ మాట్లాడుతూ “అతడు గొప్ప వ్యక్తి, తనకి కొన్ని పనులు చెయ్యాలి అని ఉంది, మనం వాటిని చెయ్యనిద్దాం. నేను అన్నాను, బాబీ, చమురు సంగతి నాకు వదిలెయ్యి, మన దగ్గర లిక్విడ్ గోల్డ్ ఆయిల్ మరియు గ్యాస్ ఉన్నాయి, సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉన్నాయి.”
ది వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ), ఇందులో కూడా 19:33 మార్క్ వద్ద వైరల్ వీడియో మాదిరి వీడియో మనకు కనిపిస్తుంది. గార్డియన్ మరియు టైం వంటి అనేక వార్తా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి, వీటిలో ట్రంప్ కెన్నెడీ గురించి ప్రస్తావించినప్పుడు, ప్రజలు ‘బాబీ బాబీ’ అని అన్నట్టుగా రాసుకొచ్చారు.
దీని బట్టి, అక్కడ ‘బాబీ’ అంటూ కెన్నెడీ గురించి నినాదం చేసినట్టు తెలుస్తుంది. కెన్నెడీ ఒక అమెరికాలోని రాజకీయ వేత్త మరియు న్యాయవాది. ఈయనకు వాక్సిన్ మరియు ఆరోగ్య విషయం లో వివాదాస్పద అభిప్రాయం ఉంది.
తీర్పు
ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగం లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr. గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ ప్రజలు ‘బాబీ బాబీ’ అని నినాదం చేశారు, అది ఆయనకు ముద్దు పేరు. సామాజిక మాధ్యమాలలో వీడియో ని తప్పుగా అర్ధం చేసుకుని ‘మోదీ మోదీ’ అంటున్నట్టుగా షేర్ చేసారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా )
Read this fact check in English here.