హోమ్ 2023 కి చెందిన వీడియోని ఈ మధ్య బంగ్లాదేశ్ లో హిందువుల నిరసనగా షేర్ చేస్తున్నారు

2023 కి చెందిన వీడియోని ఈ మధ్య బంగ్లాదేశ్ లో హిందువుల నిరసనగా షేర్ చేస్తున్నారు

ద్వారా: వనితా గణేష్

ఆగస్టు 13 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2023 కి చెందిన వీడియోని ఈ మధ్య బంగ్లాదేశ్ లో హిందువుల నిరసనగా షేర్ చేస్తున్నారు 2023 వీడియోని బంగ్లాదేశ్ లో హిందువుల నిరసనగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్ / లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న వీడియో 2023 లో అవామీ లీగ్ కి చెందిన ఛాత్ర లీగ్ అనే విద్యార్థులు విభాగం వారు చేసిన ర్యాలీ.

క్లెయిమ్ ఏమిటి?

కాషాయ రంగు దుస్తులు ధరించి ఒక ర్యాలీగా జనం వెళ్తున్న ఒక 39 సెకెన్ల నిడివి ఉన్న వీడియోని షేర్ చేసి, ఇది బంగ్లాదేశ్ లో అల్లర్ల అనంతరం అక్కడి హిందువులు చేస్తున్న ర్యాలీ అని పేర్కొన్నారు. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ హిందీలో ఇలా రాసారు. “ఢాకా వీధులలో కాషాయ వరద.  బాంగ్లాదేశ్ హిందువులు, అక్కడి హిందువుల మీద జరుగుతున్న అల్లర్లకు నిరసనగా వీధుల్లోకివచ్చారు” (అనువాదం). ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టును 3,000 పైగా వ్యక్తులు షేర్ చేసారు మరియు 116,000 మంది చూసారు.

ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ, వైరల్ అవుతున్న వీడియో 2023 కి చెందినది. బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ కి చెందిన విద్యార్థులు చేసిన ర్యాలీ వీడియో ఇది. ఛాత్ర లీగ్ అనేది అవామీ లీగ్ పార్టీ, అంటే ఇంతకుమునుపు అధికారం లో ఉన్న షేక్ హసీనా ఉన్న పార్టీ, అనుబంధ విద్యార్ధి సంఘం.

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ వీడియోలో పోస్టర్ లో కనపడుతున్న బంగ్లా నినాదాన్ని అనువదిస్తే “విద్యార్ధి ఉద్యామాలు వర్ధిల్లాలి” అని ఉన్నట్టుగా అర్ధమవుతుంది. పైగా కీ వర్డ్స్ మరియు రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, ఛానల్ 24 అనే బంగ్లాదేశీ వార్త వెబ్సైటు సెప్టెంబర్ 1, 2023 నాడు షేర్ చేసిన ఒక వీడియో  (ఆర్కైవ్ ఇక్కడ). దీనికి శీర్షిక గా, “Leaders and activists in the BCL rally with a huge procession” అని ఉంది. ఇందులో వైరల్ వీడియో మాదిరి సన్నివేశాలు కనిపించాయి. 

ర్యాలీ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఛానల్ 24) 

బిసిఎల్ ర్యాలీ కి సంబంధించి గూగుల్ సెర్చ్ చేయగా, మాకు బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ ఫేస్బుక్ పేజీ లో షేర్ చేసిన ఒక పోస్ట్  (ఆర్కైవ్ ఇక్కడ). ఇందులో వైరల్ వీడియోని పోలిన ఫొటోలు కనిపించాయి. 

ఆ పోస్టుకు బంగ్లా లో శీర్షిక రాసి ఇలా తెలియజేశారు, గఫార్గావ్ ఉపజిల ఛాత్ర  లీగ్ మరియు మునిసిపల్ ఛాత్ర లీగ్ కి చెందిన వారు ‘జాతి పిత’ షేక్ ముజిబూర్ రెహమాన్ మరియు బంగామాత షేక్ ఫజిలతున్ నేచ్ ముజీబ్ ల జ్ఞాపకార్థం చేసిన ర్యాలీ అని ఉంది.

సెప్టెంబర్ 2023 లో ఫాహ్మి గులాండాస్ బాబెల్ షేర్ చేసిన మరో ఫేస్బుక్ పోస్ట్  లో (ఆర్కైవ్ ఇక్కడ) లో కుడా ఫొటోలు అదే మాదిరి శీర్షికతో ఉన్నాయి. బాబెల్ ప్రొఫైల్ లో ఉన్న బయో ప్రకారం ఆయన బంగ్లాదేశ్ పార్లమెంట్ లో సభ్యుడు.

ఢాకా ట్రిబ్యూన్ లో సెప్టెంబర్ 1, 2023 నాడు ప్రచురితమైన మరో కథనం ప్రకారం, ఢాకా లోని సుహ్రవార్డి ఉదయన్ వద్ద జరిగిన ర్యాలీ లో మాజీ ప్రధాన మంత్రి హసీనా ప్రసంగించారు. ‘జాతి పిత’ బంగబంధు షేక్ ముజిబూర్ రెహమాన్ మరియు బంగామాత షేక్ ఫజిలతున్ నేచ్  ముజీబ్ ల జ్ఞాపకార్థం చేసిన ర్యాలీ ఇది. 

ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, న్యూ ఏజ్, బిఎస్ఎస్  తో సహా ఈ సంఘటనను అనేక వార్త పత్రికలు ప్రచురించాయి. 

గూగుల్ స్ట్రీట్ వ్యూ ని వాడి ఈ ర్యాలీ ఖాజీ నజ్రుల్ ఇస్లాం ఎవెన్యూ మీదగా వెళ్ళింది అని కనుగొన్నాము. ఇక్కడ కనపడే భవనాలు వైరల్ వీడియోలో కుడా ఉన్నాయి. 

గూగుల్ స్ట్రీట్ వ్యూ లో కనపడే భవనాలు మరియు వైరల్ వీడియోలో కనపడే భవనాల మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ గూగుల్  మ్యాప్స్)

బంగ్లాదేశ్ లో ప్రస్తుత అల్లర్లు

బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగిన అనంతరం నోబెల్  పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగష్టు 8, 2024 నాడు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  మాజీ ప్రధాని షేక్ హసీనా, బంగ్లాదేశ్ లో రేజర్వేషన్ల పై జరిగిన అల్లర్ల అనంతరం ప్రధాని పదవికి ఆగష్టు 5 న రాజీనామా చేసి పారిపోయారు. ఈ సంఘటనలో దాదాపుగా 440 కు పైచీలకు వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు.

తీర్పు

వైరల్ అవుతున్న వీడియో 2023 కి చెందినది, బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు సంబంధం లేదు. ఇది ఛాత్ర  లీగ్ కి చెందిన విద్యార్థులు షేక్ ముజిబూర్ రెహమాన్ మరియు బంగామాత షేక్ ఫజిలతున్ నేచ్  ముజీబ్ ల జ్ఞాపకార్థం చేసిన ర్యాలీ వీడియో.

(అనువాదం - రాజేశ్వరి పరసా) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.