హోమ్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'IC 814' లో ఉద్దేశపూర్వకంగా హైజాకర్లకు హిందూ పేర్లను వాడలేదు

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'IC 814' లో ఉద్దేశపూర్వకంగా హైజాకర్లకు హిందూ పేర్లను వాడలేదు

ద్వారా: ప్రభాను దాస్

సెప్టెంబర్ 3 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నెట్‌ఫ్లిక్స్ లోని ఖాందహార్ హైజాకింగ్ కి సంభంధించిన షో లో టెర్రరిస్టుల పేర్లు మార్చారు అనే పోస్టు స్క్రీన్ షాట్ నెట్‌ఫ్లిక్స్ లోని ఖాందహార్ హైజాకింగ్ కి సంభంధించిన షో లో టెర్రరిస్టుల పేర్లు మార్చారు అనే పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

సంఘటన సమయంలో కుడా హైజాకర్లు వాళ్ళ అసలు పేర్లు వాడలేదు, నెట్ఫ్లిక్ షో లో చూపించినవి ఆ కోడ్ పదాలే వాడారు.

క్లెయిమ్ ఏమిటి?

నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల విడుదల అయిన ‘IC 814: The Kandahar Hijack’ అనే షో ని విమర్శిస్తూ అనేక పోస్టులు సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. ఈ పోస్టులలో యూజర్లు, కావాలనే హైజాకర్లకు ముస్లిం మతేతర పేర్లను పెట్టినట్టు వాదించారు. ఆ పోస్టులలో 1999 హైజాకింగ్ లో ఉన్న టెర్రరిస్టుల పేర్లు ఇబ్రహీం అఖ్తర్, షాహిద్ అఖ్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్టరీ మరియు షకీర్ అని పేర్కొన్నారు. కానీ ఈ షో లో ఆ పేర్లను మర్చి ‘హిందూ’ పేర్లయిన “భోళా, శంకర్, బర్గర్ మరియు డాక్టర్’ వంటి పేర్లను వాడారు అని పేర్కొన్నారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


నెట్‌ఫ్లిక్స్ కావాలనే IC 814 హైజాకర్ల పేర్లు మార్చింది అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


ఈ నెట్‌ఫ్లిక్స్ షో లో 1999లో డిసెంబర్ 24 నాడు భారతీయ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 లో జరిగిన హైజాకింగ్ గురించి ఉంది. ఈ ఫ్లైటు కాట్మండు నుండి ఢిల్లీ వెళ్తుండగా, హర్కత్- యుఐ- ముజాహిదీన్ అనే ఒక పాకిస్థాన్ కి చెందిన అయిదుగురు టెర్రరిస్ట్ ముఠా హైజాక్ చేసింది. అనేక చోట్ల ఆపిన తర్వాత ఆ ఫ్లైటును ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు మరలించారు, ఈ ప్రదేశం అప్పట్లో తాలిబన్ ఆదీనం లో ఉండేది. ఈ టెర్రరిస్టుల ప్రధమ డిమాండు పాకిస్థానీ టెర్రరిష్టులైన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజర్ మరియు ముష్తాఖ్ అహ్మద్ జర్గర్ ను విడుదల చెయ్యటం. ఈ మూగ్గురిని ఏడు రోజులు బందీగా ఉంచిన అనంతరం విడుదల చేశారు.

మా పరిశోధన ప్రకారం, వైరల్ పోస్టులో హైజాకర్లు వాడింది కోడ్ పేర్లని తేలింది. నెట్‌ఫ్లిక్స్ షో పేర్లను మార్చలేదు, ఇవే పేర్లతో అక్కడ సంభోదించుకున్నట్టు తేలింది. 

మేము ఏమి కనుగొన్నము?

ఈ  విషయం గురించి కీ వర్డ్ సెర్చ్ చేయగా, అప్పటి హోమ్ శాఖ మంత్రి ఎల్ కే అద్వానీ ఇచ్చిన ప్రకటన ఒకటి విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్సైటు లో లభించింది.   

ఈ ప్రకటన లో హైజాకర్ల పేర్లు,“ఇబ్రహీం అత్తర్, షాహిద్ అఖ్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజి, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం మరియు షాకీర్” అని పేర్కొంది. ఈ ప్రకటనలో ప్రయాణికులకు కుడా హైజాకర్ల కు కోడ్ పేర్లు ఉండేవి అని తెలిపారు, అవి “ చీఫ్, డాక్టర్, బర్గర్, భోళా మరియు శంకర్” అనే పేర్లతో హైజాకర్లు ఒకరిని ఒకరి సంభోదించుకునే వారు అని ఉంది.


ఎం ఈ ఏ ఇచ్చిన ప్రకటనలో హైజాకర్లు కోడ్ పేర్లను వాడారు అని చెప్పిన స్క్రీన్ షాట్ (సౌజన్యం : విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ)


దేవి శరన్ రాసిన ‘Flight into Fear: The Captain's Story’ అనే పుస్తకం లో మరింత రుజువు లభించింది. ఈ పుస్తకాన్ని, హైజాక్ చేయబడిన IC 814 ఫ్లైట్ పైలట్ రచించారు. మేము ఈ పుస్తకం కి సంభంధించిన ఈ-బుక్ చూసినపుడు, అందులో హైజాకర్లు, కోడ్ పేర్లను వాడి సంభోదించుకున్నట్టు తెలుస్తుంది. శరన్ ఈ బుక్ లో శంకర్ అనే వ్యక్తి షాకీర్ అని, భోళా అనే వ్యక్తి ఇబ్రహీం అని, బర్గర్ అనే వ్యక్తి ఖాజి అని మరియు డాక్టర్ సయ్యద్ అని రాసారు.

"Flight Into Fear: The Captain's Story" ఈ బుక్ లో హైజాకర్ల కోడ్ పేర్ల ప్రస్తావన వచ్చిన సందర్భం స్క్రీన్ షాట్ (సౌజన్యం : ‘Flight Into Fear: The Captain's Story"/archive.org)

‘173 Hours in Captivity: The Hijacking of IC 814’ పుస్తకం రాసిన నీలేష్ మిశ్ర కుడా తమ ఎక్స్ అకౌంట్ లో దీని గురించి వివరణ ఇచ్చారు (ఆర్కైవ్ ఇక్కడ). ఆయన హైజాకర్లు కుడా తప్పుడు పేర్లను వాడి ఒకరిని ఒకరు సంభోదించుకునే వారని రాసారు. ఆ పేర్లు శంకర్, భోళా, బర్గర్, డాక్టర్ మరియు చీఫ్ అని కుడా నిర్ధారించి ఉంది.

ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రచురితమైన వార్త కథనాల ప్రకారం, హైజాకర్లు ప్రత్యేకమైన కోడ్ పేర్లతో సంబోధించుకున్నారు. జనవరి 2, 2000 నాటి ఒక లాస్ ఏంజెల్స్ టైమ్స్ కథనం ప్రకారం, ఆ హైజాకర్లు శంకర్, భోళా, బర్గర్, డాక్టర్ మరియు చీఫ్ అనే పేర్ల తో సంభోదించుకున్నట్టు, ఒక సాక్షి  పేర్కొన్నాడు.  పైగా భారతీయ ప్రభుత్వం ఆగష్టు 2003 లో విడుదల చేసిన రిపోర్ట్ ఆధారితంగా హిందుస్థాన్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురించారు, దీని ద్వారా, ఇక్కడ చీఫ్ అంటే ఇబ్రహీం అత్తర్, బర్గర్ అంటే సన్నీ అహ్మద్ ఖాజి, డాక్టర్ అంటే షాహిద్ అఖ్తర్ సయ్యద్, భోళా అంటే మిస్టరీ జహూర్ ఇబ్రహీం మరియు శంకర్ అంటే షాకీర్.

ఈ ఆధారాల ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ షో హైజాకర్ల మతాన్ని కావాలని మార్చలేదు, అది 1999 లో జరిగిన హైజాకింగ్ సంఘటన లో వాడిన కోడ్ పేర్లు అని తెలుస్తుంది.

ఆ షో కి సంభంధించిన వివాదం ఏమిటి?

ఆగష్టు 29 నాడు నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన షో లో, అందులో ఉండే టెర్రరిస్టుల పేర్లకు సంభంధించి వివాదం చెలరేగింది. దాని అనంతరం, #BoycottNetflix మరియు #BoycottBollywood అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతూ, కావాలనే ఈ విధంగా చేస్తున్నారంటూ ఆరోపించారు. వార్తా కథనాల ప్రకారం, భారతీయ సమాచార మరియు బ్రాడ్కాస్టింగ మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్ భారత దేశ కంటెంట్ హెడ్ అయిన మోనికా  షెర్గిల్ ను ఈ విషయమై పిలిపించినట్టు సమాచారం.

తీర్పు

హైజాకర్ల మతం మార్చినట్టుగా చూపడానికి హిందూ పేర్లు ఆ షో లో మార్చలేదు, ఆ పేర్లను 1999 లో జరిగిన ఘటనలో హైజాకర్లు కావాలనే ఆ విధంగా కోడ్ లాగా మారుపేరు పెట్టుకున్నారు.

(అనువాదం :  రాజేశ్వరి పరసా)


ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.