హోమ్ రాజస్థాన్ కి చెందిన వీడియోని అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలుగా షేర్ చేశారు

రాజస్థాన్ కి చెందిన వీడియోని అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలుగా షేర్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస

జనవరి 31 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాజస్థాన్ కి చెందిన వీడియోని అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలుగా షేర్ చేశారు ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో రాజస్థాన్ కి చెందిన సన్వాలియా గుడికి చెందినది. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టకి కొద్ది రోజుల ముందు వీడియో ఇది.

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోని షేర్ చేసి జనవరి 22, 2024 నాడు అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట తరువాత ఆ గుడికి వచ్చిన విరాళాల వీడియో అని క్లైమ్ చేశారు. ఈ 20 సెకన్ల వీడియోలో కొంత మంది వ్యక్తులు ఒక ట్రంకు పెట్టె నుండి బాక్సులలోకి డబ్బుని మార్చటం మనం చూడవచ్చు.

“‘అయోధ్య ధామ్’ లో మొదటి రోజు మొదటి పూటకే వచ్చిన విరాళాలతో హుండీ నిండిపోయింది. ఈ రోజు వచ్చిన విరాళాలు 3.17 కోట్లు. దీనినే ‘గుడి ఆర్థిక వ్యవస్థ’ అంటారు. ఈ డబ్బుతో ఎన్ని బడులు, ఆసుపత్రులు కట్టొచ్చు?,” అనే శీర్షికతో ఒక యూజర్ ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేశారు.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది రాజస్థాన్ కి చెందిన వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇదే వీడియోని యూట్యూబ్ లో షార్ట్ వీడియోగా గతంలో అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. జనవరి 19, 2024 నాడు ఈ వీడియోని అప్లోడ్ చేసి “రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లో ఉన్న సవారియా సేథ్ గుడి అన్నిటికన్నా ధనిక గుడి,” అనే శీర్షికని హిందీలో పెట్టారు. ఈ యూట్యూబ్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘@Sanwaliya_seth_1007’ వాటర్ మార్క్ కూడా ఉంది.

ఈ అకౌంట్ నితిన్ వైష్ణవ్ అనే వ్యక్తికి చెందినది. తన బయోలో తాను రాజస్థాన్ లోని సన్వాలియా గుడి పూజారి అని ఉంది. తాను ఈ వీడియోని తన అకౌంట్ లో జనవరి 16, 2024 నాడు అప్లోడ్ చేశారు. ఈ వీడియోకి శీర్షికగా “గుడిలో రికార్డ్ స్థాయిలో విరాళాలు వచ్చాయి. 12.69 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి” పెట్టారు. ఈ గుడి రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ జిల్లాలో ఉంది. కృష్ణుడు ఇక్కడి దేవుడు. 

సన్వాలియా గుడి పరిపాలనాధికారి నందకిషోర్ టైలర్ ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. ఈ వీడియో తమ గుడికి చెందినదేనని ఆయన మాకు ధ్రువీకరించారు. “జనవరి 10, 2024 నాటి వీడియో ఇది. ప్రతి నెల అమావాస్యకి ఒక రోజు ముందు హుండీ తెరిచి అప్పటివరకు వచ్చిన విరాళాలని లెక్కించటం ఇక్కడి సాంప్రదాయం. జనవరి 10 నాడు కూడా అలాగే లెక్కించాము,” అని తాను మాకు తెలిపారు.

ఈ గుడి భారీ విరాళాలకి ప్రసిద్ధి చెందినదని మేము తెలుసుకున్నాము. డిఎన్ఏ పత్రికలో ఒక కథనం ప్రకారం ఈ గుడికి తరుచుగా భారీ విరాళాలు వస్తుంటాయి.

తీర్పు

రాజస్థాన్ లోని సన్వాలియా గుడికి వచ్చిన విరాళాల వీడియోని అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలుగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.