హోమ్ బెంగళూరు కి చెందిన వీడియోని ఆంధ్ర లో వైసిపి పక్షం వారు రోడ్డు పై మేకులు జల్లినట్టుగా షేర్ చేశారు

బెంగళూరు కి చెందిన వీడియోని ఆంధ్ర లో వైసిపి పక్షం వారు రోడ్డు పై మేకులు జల్లినట్టుగా షేర్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస

ఆగస్టు 1 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బెంగళూరు కి చెందిన వీడియోని ఆంధ్ర లో వైసిపి పక్షం వారు రోడ్డు పై మేకులు జల్లినట్టుగా షేర్ చేశారు వైఎసార్సీపి మద్దతుదారులు తమ నాయకుడు గెలవలేదని ఈ విధంగా రోడ్డు పై మేకులు జల్లారు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ వీడియోలో కనపడిన పోలీస్ అధికారి లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ఈ ఘటన లో ఆంధ్ర ప్రదేశ్ లో కాదు బెంగళూరు లో జరిగింది అని పేర్కొన్నారు.

క్లెయిమ్ ఏమిటి ? 

ఇద్దరు ట్రాఫిక్ అధికారులు రోడ్డు పై పడి ఉన్న మేకులను తొలగిస్తున్న ఒక 16 సెకెన్ల వీడియోని షేర్ చేసి,  ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తమ పార్టీ కి ఓట్లు పడలేదని రోడ్డు పై మేకులు వేసి ఓటర్లకు ఇబ్బంది కలగజేస్తున్నారు అని తెలియజేసారు.

దీనికి శీర్షిక గా, “తమ నాయకుడు ఓడిపోయాడు జనం ఓట్లు వెయ్యలేదు అని ఇలా రోడ్ల మీద మేకులు వేసి వెళ్తున్న సైకో బ్యాచ్... జాగ్రత్త.. *** ఏమీ బతుకులు రా” అంటూ షేర్ చేశారు. పైగా ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల కు సంభందించిన హాష్ ట్యాగ్ లను, #TDP, #YSRCP, #JSP, #BJP  షేర్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక్కడ సైకో అనే పదాన్ని, టిడిపి నాయకులు, వైసిపి నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాడే ఒక హీన్యమైన పదం. దీనికి బదులుగా వైసిపి వ్యక్తులు టిడిపి నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రిని ‘శాడిస్ట్’ అని పిలుస్తుంటారు.

ఈ మధ్య జరిగిన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలలో వైఎసార్సీపి ఓటమి పాలయింది. ఎన్డీయే కూటమి లో ఉన్న టిడిపి, జన సేన మరియు భారతీయ జనతా పార్టీలు అధికారాన్ని చేపట్టాయి.


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ ఈ క్లెయిమ్ తప్పు, ఎందుకంటే మా పరిశోధన ప్రకారం, ఈ వీడియో బెంగళూరు కు సంబంధించినది. 

వాస్తవం ఏమిటి ?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో బెంగళూరుకు సంభందించినది అని అర్ధమయింది. జులై 28, 2024 నాడు ఆసియానెట్ న్యూసెబుల్ అనే ఒక ప్రాంతీయ వార్త సంస్థ వైరల్ అవుతున్న వీడియోని తమ యూట్యూబ్ ఛానెల్ లో “WATCH | Bengaluru Traffic Police Cleans Road Swamped With Metal Nails.” అనే శీర్షిక తో షేర్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ).


ఆ వీడియో వివరణ ప్రకారం, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పై పడి ఉన్న మేకులను తొలగిస్తున్నారు. పబ్లిక్ టివి అనే ఒక కన్నడ మీడియా సంస్థ కుడా ఈ వీడియోని జులై 29, 2024 నాడు షేర్ చేస్తూ, కువెంపు అండర్ పాస్ వద్ద ఉన్న మేకులను వాహనదారులకు ఇబ్బంది కలగటం తో జలహల్లి  పోలీస్ స్టేషన్ వారు తొలగించారు అని తెలియజేసారు (ఆర్కైవ్ ఇక్కడ).

టైమ్స్  అఫ్ ఇండియా లో జులై 29, 2024 నాడు ప్రచురించబడిన కథనం ప్రకారం, రంగమ్మ మరియు రాహుల్ వై, అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కువెంపు సర్కిల్ వద్ద జలహల్లి పరిధి లో ఈ ఘటన జరిగింది అని పేర్కొన్నారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ జలహల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా, అక్కడి హెడ్ కానిస్టేబుల్ నర్స రాజు మాట్లాడుతూ, ఈ ఘటన తమ పరిధి లోనే జరిగింది అని తెలిపారు. రాజు మాట్లాడుతూ, తమ స్టేషన్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు పైన మేకులు పడి ఉండటం తో తొలగించారు అని తెలిపారు. గతంలో కుడా ఇలాంటి సంఘటన అదే చోట జరిగింది అని తెలిపారు.

పైగా ఇది ఏ ఆకతాయి పనో లేదా అక్కడే దగ్గర్లో ఉన్న పంక్చర్ దుకాణం వాళ్ళు చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంభందించిన విషయం కాదు అని కుడా స్పష్టం చేసారు.

వైరల్ వీడియోలలో ఉన్నప్పటి రంగమ్మ అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, ఈ సంఘటన బెంగళూరు లోనే చోటు చేసుకుంది అని తెలిపారు. జులై 27, 2024 నాడు జలహల్లి ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో వైరల్ వీడియోకి సంబంధించిన క్లిప్పులను మరియు ఫొటోలను తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు(ఆర్కైవ్ ఇక్కడ). దీనికి శీర్షిక గా తమ పోలీస్ స్టేషన్ పరిధిలో కువెంపు సర్కిల్ దగ్గర రోడ్డు పైన మేకులు పడి వాహనాలు పంక్చర్ అవ్వటం తో, ఆ మేకులను తీసి వేశారు అని రాసారు.

తీర్పు :

ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పై ఉన్న మేకుల ను తీసివేస్తున్న వీడియోని, తప్పుగా, వైసిపి వ్యక్తుల ఎన్నికలలో ఓటమి పాలయినందుకు ఈ విధంగా చేశారు అని షేర్ చేశారు. నిజానికి ఈ వీడియో, కర్ణాటక లోని బెంగళూరు కు సంబంధించింది.

(అనువాదం : రాజేశ్వరి పరసా) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.