హోమ్ విద్యార్ధుల నిరసనకి సంబంధించిన పాత వీడియోని బంగ్లాదేశ్ లో ‘హిందు యువతులని కట్టేశారు’ అని షేర్ చేశారు

విద్యార్ధుల నిరసనకి సంబంధించిన పాత వీడియోని బంగ్లాదేశ్ లో ‘హిందు యువతులని కట్టేశారు’ అని షేర్ చేశారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

ఆగస్టు 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
విద్యార్ధుల నిరసనకి సంబంధించిన పాత వీడియోని బంగ్లాదేశ్ లో ‘హిందు యువతులని కట్టేశారు’ అని షేర్ చేశారు బంగ్లాదేశ్ లో 'హిందు యువతుల పరిస్థితి' ఇది అంటూ క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఇది మార్చ్ 2024 నాటి వీడియో. ఢాకా లోని జగన్నాథ్ విశ్వవిద్యాలయం లో ఒక విద్యార్ధి ఆత్మహత్యకి నిరసనగా ప్రదర్శించిన వీధి నాటకం వీడియో ఇది.

(గమనిక - ఈ కథనంలో ఆత్మహత్య, లైంగిక దాడికి సంబంధించిన వివరణ ఉంది. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏంటి?

నోటిని, చేతులని టేపుతో కట్టేసిబడి, పచ్చ రంగు బట్టలు ధరించి కింద కూర్చుని ఉన్న ఒక యువతి 30- సెకన్ల వీడియోని షేర్ చేసి, బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ‘హిందు యువతుల’ పరిస్థితి అని క్లైమ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ లకి వ్యతిరేకంగా మొదలయ్యిన ఉద్యమం హింసాత్మక రూపం సంతరించుకుంది.

“బంగ్లాదేశ్ లో హిందు మహిళలు పరిస్థితి! వాళ్ళని రేప్ చేస్తునారు, చంపేస్తునారు. బంగ్లాదేశ్ లో హిందువులు జెనోసైడ్ అవుతున్న పరిస్థితి. ఈ వీడియోలు, ఫొటోలు నిస్సహాయులని చేస్తున్నాయి,” అనే శీర్షికతో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. “బంగ్లాదేశ్ కి స్వాగతం. ఇక్కడ హిందు యువతులని రోడ్డు మీద కట్టేస్తారు. పాశ్చాత్య మీడియా నోరు మెదపటం లేదు,” అని ఇంకొక శీర్షిక ఉంది. వీటిని #HinduGenocideInBangladesh నే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేస్తున్నారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ ఎక్స్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది మార్చ్ 2024 నాటి వీడియో. ఢాకా లోని జగన్నాథ్ విశ్వవిద్యాలయం లో ఒక విద్యార్ధిని ఆత్మహత్యకి పురిగొల్పిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదే విశ్వవిద్యాలయం లో విద్యార్ధులు నిరసన తెలిపిన వీడియో ఇది.

వాస్తవాలు ఏమిటి?

ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఇదే వీడియోని జులై 26, 2024 నాడు JnU Short Stories (ఆర్కైవ్ ఇక్కడ ) అనే ఫేస్బుక్ అకౌంట్ పోస్ట్ చేసిందని తెలుసుకున్నాము. 

ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్)

ఈ వీడియోలో ఉన్న యువతి జగన్నాథ్ విశ్వవిద్యాలయం లో 2021-22 బ్యాచ్ విద్యార్ధి అని, అవంతిక అనే మరో విద్యార్ధి ఆత్మహతకి నిరసనగా చేసిన వీధి నాటకం వీడియో ఇది అని బంగ్లా లో రాసి ఉంది.

ఈ వీడియో గురించి చెబుతూ, ఈ వీడియో బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలకి సంబంధించిన వీడియో అని, ఈ యువతి అవామీ లీగ్ పార్టీ విద్యార్ధి విభాగం అయిన ఛాత్ర లీగ్ కార్యకర్త అని కొంత మంది అనుకుంటున్నారు అని వివరణ ఇచ్చారు. ఇటువంటి పోస్ట్స్ తనని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా తెలిపారు. తనకి మద్దతు ఇచ్చి, ఈ క్లైమ్ తో ఈ వీడియో ని షేర్ చేసినవారి పోస్ట్స్ ని రిపోర్ట్ కొట్టమని కూడా పేర్కొన్నారు.

అలాగే, జగన్నాధ్ విశ్వవిద్యాలయంకి చెందిన ఫైరూజ్ సదఫ్ అవంతిక అనే విద్యార్ధి మార్చ్ 15, 2024 నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని మేము తెలుసుకున్నాము. తను మృతికి సహ విద్యార్ధి అమ్మన్, విశ్వవిద్యాలయం సహాయ ప్రొక్టర్ దిన్ అస్లాం కారణం అని, అమ్మన్ తనని లైంగికంగా వేధించగా, దిన్ తనకి మద్దతుగా ఉన్నారని అని అవంతిక చనిపోయే ముందు తెలిపారు. వీరిద్దరిని పోలీసులు తరువాత అరెస్ట్ చేశారు.

అవంతిక ఆత్మహత్య విశ్వవిద్యాలయం లో నిరసనలకి దారి తీసింది. విద్యార్ధులు కాగడా మార్చ్ లు, కొవ్వొత్తుల ప్రదర్శన, వీధి నాటకాల ద్వారా తమన్ నిరసనని తెలియచేశారు. అటువంటి ఒక వీధి నాటకమే ఈ వీడియో.

వీడియో జియో లొకేషన్

మేము గూగుల్ మ్యాప్స్ వెతుకగా, వైరల్ ఫొటో లో ఉన్నట్టే ఉన్న విశ్వవిద్యాలయం ఫొటోలు లభించాయి. వైరల్ వీడియోలో ఉన్న బూడిద రంగు దారి సూచీ ఇందులో కూడా ఉంది. 

వైరల్ వీడియో, గూగుల్ మ్యాప్స్ ఫొటో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/గూగుల్ మ్యాప్స్)

అలాగే, ఈ నిరసన తాలూకా మరొక వీడియో మాకు బంగ్లాదేశ్ మీడియా సంస్థ అయిన సమయ్ నేషనల్ వారి యూట్యూబ్  ఛానల్ (ఆర్కైవ్ ఇక్కడ) లో లభించింది. ఈ వీడియోని మార్చ్ 18 నాడు అప్లోడ్ చేశారు. ఈ వీడియో వివరాల ప్రకారం అవంతిక ఆత్మహత్యకి నిరసనగా చేసిన వీధి నాటకం వీడియో ఇది.

ఈ వీడియోలో 1:31 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ వీడియో లో ఉన్న యువతి పక్కన నోటికి టేపు కట్టుకుని నిరసన తెలియచేస్తున్న ఇతరులని మనం చూడవచ్చు. 

యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్)

తీర్పు

మార్చ్ నెలలో బంగ్లాదేశ్ లో జరిగిన ఒక నిరసన వీడియోని, అక్కడ నేడు ‘హిందు యువతుల పరిస్థితి’ అంటూ తప్పుగా క్లైమ్ చేశారు.

(మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ సహాయం కావాలంటే ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్  లని సంప్రదించండి.)

(అనువాదం - గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.