ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి చంద్రబాబు నాయుడు వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఆంధ్ర ఎన్నికలలో “గెలిచే బృందం” అన్నారని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
మార్చి 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి చంద్రబాబు నాయుడు వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఆంధ్ర ఎన్నికలలో “గెలిచే బృందం” అన్నారని క్లైమ్ చేశారు

రాబోయే అన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ "గెలిచే బృందం" అని చంద్రబాబు అన్నారని క్లైమ్ చేస్తున్న సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో చంద్రబాబు తెలుగుదేశం- జనసేన కూటమిని “గెలిచే బృందం” గా, వై ఎస్ ఆర్ సి పి ని “మోసపూరిత బృందం” గా అభివర్ణించారు.

క్లైమ్ ఐడి 6454fa15

క్లైమ్ ఏంటి?

త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం- జనసేన కూటమి, వై ఎస్ ఆర్ సి పి తలపడనున్నాయి. కూటమి తన ఉమ్మడి ప్రచార కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28 నాడు జరిగిన ‘జెండా’ బహిరంగ సభతో ఆరంభించింది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన 27 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి వైరల్ అయ్యింది. అందులో చంద్రబాబు వై ఎస్ ఆర్ సి పి ని “గెలిచే బృందం” అని, తెలుగుదేశం- జనసేన కూటమిని “మోసపూరిత బృందం” అని అంటున్నట్టు ఉంది. ఈ వీడియోని  ‘YSJAGANAGAIN’, ‘TDPJSPCOLLAPSE’ లాంటి హ్యాష్ ట్యాగ్ లు వాడి వై ఎస్ ఆర్ సి పి అనుబంధ హ్యాండిల్స్ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నాయి.అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఎడిట్ చేసిన వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఆడియో, వీడియో మధ్య పొంతన లేకుండా ఉంది. ముఖ్యంగా 0:07, 0:23 టైమ్ స్టాంప్ దగ్గర. ఇక్కడ నాయుడు పెదాల కదలిక “విన్నింగ్” అనే పదానికి అనుగుణంగా లేదు. దీనిబట్టి ఇది ఎడిట్ చేసిన వీడియో అని అర్థం అవుతుంది.

ఈ వీడియో తెలుగుదేశం- జనసేన తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28 నాడు నిర్వహించిన ‘జెండా’ బహిరంగ సభకి చెందినదిగా మేము గుర్తించాము. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ లాంటి చానళ్ళు ఈ బహిరంగ సభని లైవ్ టెలీకాస్ట్ చేశాయి.

వైరల్ వీడియోలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని మనం ఏబీఎన్ లైవ్ టెలీకాస్ట్ లో 2:20:15- 2:20:25 మధ్య చూడవచ్చు. “కాబట్టి, తెలుగుదేశం- జనసేన విన్నింగ్ టీం. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం. అవునా కాదా?”  అని చంద్రబాబు అనటం మనం వినవచ్చు. ఇదే భాగాన్ని టీవీ 5 న్యూస్ లైవ్ టెలీ కాస్ట్ లో 3:59:22- 3:59:32 మధ్య మనం చూడవచ్చు. 

“విన్నింగ్ టీం”, “చీటింగ్ టీం” అనే పదాలని ఒకదానితో ఒకదానిని మార్చి, వై ఎస్ ఆర్ సి పి “విన్నింగ్ టీం” అని చంద్రబాబు అంటున్నట్టు ఎడిట్ చేశారు.

రెండో భాగాన్ని ఏబీఎన్ లైవ్ టెలీ కాస్ట్ లో 2:20:26- 2:20:38 మధ్య చూడవచ్చు. “గట్టిగా చెప్పండి. తెలుగుదేశం- జనసేన విన్నింగ్ టీం. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం,” అని చంద్రబాబు అనటం మనం వినవచ్చు. ఇదే భాగాన్ని టీవీ 5 న్యూస్ లైవ్ టెలీ కాస్ట్ లో 3:59:23- 3:59:35 మధ్య మనం చూడవచ్చు.

దీనిబట్టి, చంద్రబాబు వై ఎస్ ఆర్ సి పి ని “విన్నింగ్ టీం” అంటున్నట్టుగా వీడియోని ఎడిట్ చేశారని మనకి అర్థం అవుతుంది.

తీర్పు

ఎడిట్ చేసిన వీడియో క్లిప్ షేర్ చేసి రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ “విన్నింగ్ టీం” అని చంద్రబాబు అన్నారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.