హోమ్ అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి రాహుల్ గాంధీ ‘తడబడ్డారా’? లేదు. అది ఎడిటెడ్ వీడియో

అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి రాహుల్ గాంధీ ‘తడబడ్డారా’? లేదు. అది ఎడిటెడ్ వీడియో

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

జూలై 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి రాహుల్ గాంధీ ‘తడబడ్డారా’? లేదు. అది ఎడిటెడ్ వీడియో లోక్ సభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ రాజ్యాంగం గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ తడబడ్డారు అని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది ఎడిటెడ్ క్లిప్. భారత రాజ్యాంగం గురించి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ సభ్యులని ప్రశ్నించినప్పుడు రాహుల్ గాంధీ సభలోనే లేరు.

క్లైమ్ ఏంటి?

భారతీయ జనతా పార్టీ కి చెందిన, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ రాజ్యాంగానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తడబడ్డారు అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.

“రాజ్యాంగం లో ఎన్ని పేజీలు ఉన్నాయి? సుమారుగా అని చెప్పొద్దు. నిర్దిష్ట సంఖ్య చెప్పాలి. రోజు దానిని మోస్తున్నారు. ఎప్పుడైనా చదివారా అసలకి? లేదా ఊరికే గాల్లో ఊపుతా ఉంటారా? ఇప్పటికైనా బయటకి తీయండి,” అని ఈ వీడియోలో అనురాగ్ ఠాకూర్ హిందీలో అనటం మనం చూడవచ్చు. ఆ తరువాత ఈ క్లిప్ లో ప్రతిపక్షం బెంచీలలో నుంచుని ఉన్న రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులని చూడవచ్చు.

ఈ వీడియోని షేర్ చేసి, “ రాహుల్ గాంధీకి ఇలా దొరికి పోవడం అలవాటే.. “మీరు పట్టుకున్న రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి” అన్న అనురాగ్ ఠాకూర్ ప్రశకు రాహుల్ సమాధానం చెప్పలేకపోయాడు,” అని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఎడిటెడ్ వీడియో అని మా పరిశోధనలో తేలింది. అనురాగ్ ఠాకూర్ ఈ ప్రశ్న అడిగిన రోజు రాహుల్ గాంధీ అసలు సభలోనే లేరు.

మేము ఏమి తెలుసుకున్నాము?

సంసద్ టీవీ యూట్యూబ్ చానల్  (ఆర్కైవ్ ఇక్కడ )లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ జూలై 1, 2024 నాడు లోక్ సభ లో చేసిన ప్రసంగం మొత్తాన్ని మేము విశ్లేషించాము. 

“మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మన రాజ్యాంగం ఎన్ని పేజీల రాజ్యాంగం? రోజు దానిని మోసుకొస్తున్నారు కదా. ఇప్పటికైనా తెరిచి చదివే సమయం ఆసన్నమయ్యింది,” అని అనురాగ్ ఠాకూర్ హిందీలో అనటం మనం వినవచ్చు.

ఠాకూర్ ఈ ప్రశ్న అడిగినప్పుడు కెమెరా ప్రతిపక్ష సభ్యులా వైపు చూపించింది. అక్కడ రాహుల్ గాంధీ లేరు. 

ఠాకూర్ ప్రసంగం అప్పుడు ప్రతిపక్షం బెంచీ స్క్రీన్ షాట్ (సౌజన్యం: సంసద్ టీవీ)

సభ మొదట్లో, తన ప్రసంగం ఇవ్వటానికి ఠాకూర్ నుంచున్నప్పుడు రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. 25 సెకన్ల మార్క్ దగ్గర, రాహుల్ గాంధీ నుంచుని, రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఒక రోజుని నీట్ పరీక్ష గురించి చర్చించదానికి కేటాయించమని సభాధ్యక్షులు ఓం బిర్లా ను అడగటం మనం చూడవచ్చు.

దీని తరువాత అనురాగ్ ఠాకూర్ తన ప్రసంగం మొదలుపెట్టారు. 3:16 మార్క్ దగ్గర ప్రతిపక్ష సభ్యులు సభ నుండి బయటకి వెళ్ళిపోవడం మనం చూడవచ్చు. ఆ తరువాత, కొంత మంది సభ్యులు ప్రసంగం సమయంలోనే తిరిగి రావటం చూడవచ్చు. అయితే రాహుల్ గాంధీ తిరిగి రావటం లేదు. రాజ్యాంగం లో పేజీల గురించి అనురాగ్ ఠాకూర్ ప్రశ్న వేసినప్పుడు రాహుల్ గాంధీ సభలోనే లేరు. 

ముఖ్య ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కి సభాధ్యక్షునికి ఎడమ వైపు మొదటి వరుసలో సీట్ ఉంటుంది.  అనురాగ్ ఠాకూర్ ప్రశ్న అప్పుడు ఈ సీట్ ఖాళీగా ఉండటం మనం చూడవచ్చు.

వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ క్లిప్ ఎక్కడిది?

వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ ఉన్న భాగం కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా జూలై 1, 2024 నాడే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మరొక వీడియోకి సంబంధించినవి అని తెలుసుకున్నాము. ఈ వీడియోని సంసద్ టీవీ యూట్యూబ్ చానల్  (ఆర్కైవ్ ఇక్కడ) లో చూడవచ్చు. ఇందులో 19:03 నుండి 19:08 మధ్య మనం ఈ భాగాన్ని చూడవచ్చు.

తీర్పు 

వైరల్ వీడియో ఎడిటెడ్ వీడియో అని మా పరిశోధనలో స్పష్టం అయ్యింది. రాజ్యాంగం గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ సభలోనే లేరు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.