అస్సాం గుడిలో బలికి సంబంధించి 2017 నాటి ఫొటోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: వనితా గణేష్
జూన్ 25 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అస్సాం గుడిలో బలికి సంబంధించి 2017 నాటి ఫొటోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ఇద్దరు ముస్లింలు గుడిలో పడేసిన ఆవు తలని పూజారి ఎత్తవలసి వచ్చింది అనే వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ ఫొటోలో ఉన్నది అస్సాంలో 2017 నాటి దుర్గ పూజ దృశ్యాలు. అప్పుడు ఇక్కడ జంతు బలి జరిగింది. ఇది ఈద్ అల్ అదాకి చెందినది కాదు.

క్లైమ్ ఐడి 20522f0c

గమనిక : ఇందులో ఇబ్బందికర దృశ్యాల వివరణ ఉంటుంది, గపాఠకులు మనించగలరు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక వ్యక్తి గేదె తలను పట్టుకున్న ఫొటో ఒకటి వైరల్ అవుతుంది, ఈ ఫోటోని షేర్ చేస్తూ, ముస్లిం మతానికి చెందిన వారు ఒక ఆవు తలను గుడిలో పారవేస్తే, దానిని ఆ గుడి పూజారి బయటకి తెస్తున్నారు అనే వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నారు. 

ఈ ఫొటోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ షేర్ చేస్తూ “హ్యాపీ బక్రీద్” అని రాసుకొచ్చారు. ఇది ముస్లింలు మేక పోతులను బలి ఇస్తూ జరుపుకునే పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగను జూన్ 17 నాడు జరుపుకున్నారు, దీనినే ఈద్ అల్ అధా అని కుడా అంటారు. 

ఆ క్లెయిమ్ లో పైగా, “నరికేసిన ఆవు తలను ఇద్దరు ముస్లింలు గుడిలో పడేస్తే, పూజారి ఆ గుడి పవిత్రతను కాపాడడానికి ఆలా చెయ్యాల్సి వచ్చింది, కానీ దానిని చూసి ఈ ముస్లింలు ఎలా హేళన చేస్తున్నారో చూడండి. ‘బ్లడీ సెక్యులరిజం’” అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు దాదాపుగా 1,600 వ్యూస్ వచ్చాయి. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

మధ్య ప్రదేశ్ లోని జయరా గ్రామంలో ఒక గుడిలో ఒక ఆవు తలకాయను పడేసిన కారణంగా నలుగురి వ్యక్తులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవయింది. ఈ ఘటన వల్ల అశాంతి నెలకొంది.  

అయితే, ఈ ఫొటో ఆ సంఘటనకు సంబందించినది కాదు, ఇది 2017 లో అస్సాం లోని బిల్లేశ్వరి మందిరం లో ఒక జంతు బలికి సంబంధించిన ఫొటో 

మేము ఏమి కనుగొన్నాము? 

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రకారం, ఈ వైరల్ ఫొటో ని గెట్టి ఇమేజెస్ (ఆర్కైవ్ ఇక్కడ) లో అక్టోబర్ 7, 2017 నాడు అప్లోడ్ చేశారు. ఆ ఫొటో శీర్షిక ప్రకారం, ఇది అస్సాం లోని బిల్లేశ్వర దేవాలయం లోనిది. ఇక్కడ నవమి నాడు జరిగే దుర్గా పూజలో జంతు బలి ఇస్తున్న దృశ్యాలు.  ఈ ఫొటోని డేవిడ్ తాలూక్దార్ తీసినట్టుగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా గేదెను బలి ఇస్తున్నట్టుగా ఉంది, ఆవు కాదు, మరియు ఇక్కడ జరిగేది ఒక హిందూ పండుగ - ఈద్ అల్ అదా కాదు.

గెట్టి ఇమేజెస్ లోని ఒరిజినల్ ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: గెట్టి: ఇబ్బందికర దృశ్యాలను మసకబార్చటం జరిగింది)  

అస్సాం లోని శివుడి గుడి అయిన బిల్లేశ్వరి దేవాలయంలో దుర్గ పూజ సమయంలో గేదెలను బాలి ఇవ్వటం ఇక్కడ ఆనవాయితీ. 2020 నాటి టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, ఆనవాయితీగా 50 గేదెలను బలి ఇస్తారు. ఆ సంవత్సరం మాత్రం ఒక్కటే ఇచ్చారు. అదే గుడిలో మేకలను, పావురాలను, మరియు బాతులను కుడా మహా నవమి నాడు బలి ఇస్తారు.

పైగా అక్టోబర్ 5, 2011 నాటి ఇండియా టుడే కథనం ప్రకారం (పాఠకుల గమనిక : కదిలించే దృశ్యాలు), ఇది బెల్శోర్ లోని బిల్లేశ్వర్ దేవాలయంలో ఒక గేదెను బలి ఇస్తున్న సందర్భం లోనిది.  

అస్సాం లో మహా నవమి పండుగ నాడు, కామాఖ్య మరియు ఉగ్ర తార మందిరాలలో ఈ విధంగా జంతు బలి నిర్వహిస్తారు

తీర్పు : 

అస్సాం లో జంతు బలి జరుగుతున్న 2017 నాటి ఫొటో ని ఈమధ్య కాలం ఫొటో అని చెబుతూ మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.