హోమ్ విరాట్ కోహ్లీ సీజీఐ ప్రకటనని అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ దగ్గర తన విగ్రహంగా మీడియా పొరబడింది

విరాట్ కోహ్లీ సీజీఐ ప్రకటనని అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ దగ్గర తన విగ్రహంగా మీడియా పొరబడింది

ద్వారా: అంకిత కులకర్ణి

జూన్ 28 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
విరాట్ కోహ్లీ సీజీఐ ప్రకటనని అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ దగ్గర తన విగ్రహంగా మీడియా పొరబడింది న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర విరాట్ కోహ్లీ విగ్రహం పెట్టారు అని క్లైమ్ చేసిన మీడియా, సామాజిక మీడియా పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/న్యూస్ 18/హిందుస్థాన్ టైమ్స్/ది ఎకనామిక్ టైమ్స్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ డ్యూరోఫ్లెక్స్ ప్రతినిధి ఇది తమ పరుపుల ప్రకటన కోసం సీజీఐ తో చేసిన వీడియో అని తెలిపారు.

క్లైమ్ ఏంటి?

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర విరాట్ కోహ్లీ బంగారు విగ్రహం అని, ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం అని సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో షేర్ చేస్తున్నారు. వీడియో నుండి ఒక స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి “టైమ్స్ స్క్వేర్ దగ్గర విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ప్రపంచ ఎనిమిదవ వింతగా ప్రకటించాలి,” అని ఒక యూజర్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో రాసుకొచ్చారు (ఆర్కైవ్ ఇక్కడ). ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

న్యూస్ 18, హిందుస్థాన్ టైమ్స్, ఇండియా టీవీ, ఎకనామిక్ టైమ్స్ లాంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా ఇది విరాట్ కోహ్లీ విగ్రహం అని, “ఈ మధ్యనే ప్రారంభోత్సవం” చేశారని రిపోర్ట్ చేశాయి. 

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది విగ్రహం కాదని, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (సీజీఐ) ద్వారా పరుపుల సంస్థ అయిన డ్యూరోఫ్లెక్స్ తమ పరుపుల ప్రకటనగా రూపొందించిన వీడియో అని మా పరిశోధనలో తేలింది.  

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే డ్యూరోఫ్లెక్స్ సంస్థ తమ అధికారిక ఎక్స్  (ఆర్కైవ్ ఇక్కడఅకౌంట్ లో జూన్ 23, 2024 నాడు ఈ వీడియోని అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. “ఇప్పుడే ప్రారంభోత్సవం: టైమ్స్ స్క్వేర్ దగ్గర విరాట్ కోహ్లీ నిలువెత్తు విగ్రహం. మనం ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తున్నాము. విరాట్ కోహ్లీ కి మంచి నిద్ర, మంచి ఆరోగ్యం మేము అందచేస్తున్నాము. #GreatSleepGreatHealth #ViratKohli #worldcup #cricket #CGI,” అని ఈ పోస్ట్ కి శీర్షికగా పెట్టారు.

‘CGI’ అనే హ్యాష్ టాగ్ ద్వారా ఈ వీడియోని కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ వాడి చేశారు అని అర్థమవుతుంది. సీజీఐ లో గ్రాఫిక్స్ వాడి ఫొటోలు, వీడియోల స్థాయిని బాగా పెంచవచ్చు. 

ఇదే వీడియోని వారి ఇన్స్టాగ్రామ్  అకౌంట్ లో (ఆర్కైవ్ ఇక్కడ), యూట్యూబ్  చానల్ లో (ఆర్కైవ్ ఇక్కడ) కూడా షేర్ చేశారు. వీటిల్లో ఇది సీజీఐ అని స్పష్టంగా పేర్కొన్నారు. 

ఈ వీడియో సీజీఐ వాడి చేశారు అని చెప్పిన డ్యూరోఫ్లెక్స్ వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్రీన్ షాట్  (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/డ్యూరోఫ్లెక్స్)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ డ్యూరోఫ్లెక్స్ ప్రతినిధిని సంప్రదించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని తను ఇది సీజీఐ ద్వారా చేసిన ప్రకటన అని, విరాట్ కోహ్లీ తమ జాతీయ అంబాసడర్ కాబట్టి తన సీజీఐ వీడియో చేశామని తెలిపారు. మే 15, 2023 నాడు డ్యూరోఫ్లెక్స్ విరాట్ కోహ్లీ ని తమ బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకుంది.

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లైవ్ ఫుటేజీ ని యూట్యూబ్ లో చూశాము. దీనిని ఎర్త్ కామ్ లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇందులో కూడా మాకు ఎక్కడా కోహ్లీ విగ్రహం కనపడలేదు. దీని బట్టి కూడా ఇది డిజిటల్ గా సృష్టించినదని అర్థం అవుతుంది.

అలాగే, డ్యూరోఫ్లెక్స్ ఇంతక ముందుపు కూడా సీజీఐ తో చేసిన ప్రకటనలను విడుదల చేసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

తీర్పు

డ్యూరోఫ్లెక్స్ సంస్థ తమ పరుపుల ప్రకటన కోసం సీజీఐ వాడి టైమ్స్ స్క్వేర్ దగ్గర విరాట కోహ్లీ విగ్రహం ఉన్నట్టు సృష్టించిన వీడియోని షేర్ చేసి, టైమ్స్ స్క్వేర్ దగ్గర నిజంగానే కోహ్లీ విగ్రహం పెట్టారు అని క్లైమ్ చేశారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.