హోమ్ మాల్దీవుల అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణ చెప్పినట్టుగా ఒక ఫేక్ స్క్రీన్ షాట్ సర్కులేట్ అవుతున్నది

మాల్దీవుల అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణ చెప్పినట్టుగా ఒక ఫేక్ స్క్రీన్ షాట్ సర్కులేట్ అవుతున్నది

ద్వారా: రాహుల్ అధికారి

జనవరి 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
మాల్దీవుల అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణ చెప్పినట్టుగా ఒక ఫేక్ స్క్రీన్ షాట్ సర్కులేట్ అవుతున్నది వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ ( సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

భారత దేశం-మాల్దీవుల మధ్య దౌత్య పరమయిన ఇబ్బందులున్న తరుణంలో అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు భారతీయులకు క్షమాపణ చెప్పినట స్క్రీన్ షాట్ సర్కులేట్ అవుతున్నది.

క్లెయిమ్ ఏమిటి?

భారత దేశం మాల్దీవుల మధ్య దౌత్య సంబంధమయిన ఇబ్బందులు కొనసాగుతున్న వేళ, మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మొయిజు భారతీయులకు క్షమాపణ తెలిపారు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. (ప్రస్తుతం తొలగించబండింది)

జనవరి 7 నాడు పోస్ట్ చేసిన ఈ స్క్రీన్ షాట్ లో, “మా మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన బాధ్యతారహితమయిన వ్యాఖ్యలకు నేను భారతీయులందరికి చేతులు జోడించి క్షమాపణ చెప్పుకుంటున్నాను. భారతీయ స్నేహితులను ఆహ్వానించడానికి, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నాము,” అని ఈ స్క్రీన్ షాట్ లో ఉంది. ఈ స్క్రీన్ షాట్ లో ప్రస్తుతం ఆ పోస్ట్ ని తొలగించారు అని కుడా రాసి ఉంది.

ఈ మధ్య కాలంలో మాల్దీవుల మంత్రులయిన మరియం శివునా, మల్ష షరీఫ్ మరియు అబ్దుల్లా మహజూమ్ మజీద్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, ప్రధాని లక్షద్వీప్ కి విచ్చేసిన తరుణంలో ఆయన పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం నడుస్తూ ఉండగా, ఈ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది.

సామాజిక మాధ్యమాలలో తరుచుగా వివాదాస్పదకరమయిన మరియు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ఒక యూజర్, రిషి బాగ్రీ, ఈ స్క్రీన్ షాట్ ని జనవరి 8, 2023 నాడు షేర్ చేసి, మాల్దీవుల అధ్యక్షులు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నారు అని రాసుకొచ్చాడు. మేము ఈ కధనం రాసే సమయానికి, ఈ పోస్టును దాదాపుగా 2,13,000 మంది పైగా చూసారు. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ ( సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఫేక్ స్క్రీన్ షాట్. మాల్దీవుల అధ్యక్షులు తన సామాజిక మాధ్యమాల ద్వారా అలాంటి క్షమాపణ ఏమి చెప్పలేదు. 

మేము ఏమి కనుగొన్నాము? 

ఈ ఫేక్ స్క్రీన్ షాట్ లో మొయిజు అసలయిన ఎక్స్ అకౌంట్ లో ఉన్నట్టుగానే అదే పేరు, ప్రొఫైల్ ఫోటో ని వాడారు. మేము అప్పుడు మొయిజు ఎక్స్ అకౌంట్ వెతికాము. ఆయన అకౌంట్ లో జనవరి 5 తరువాత ఎటువంటి పోస్ట్ కుడా చేయలేదు.

అలాగే సోషల్ బ్లేడ్ అనే ఒక పరిశోధన సాధనం ఉపయోగించి మొయిజు  అకౌంట్ నుండి ఏమైనా పోస్టులు ఆరోజున తొలగించారా అని చూశాము. కానీ అలాంటిది ఏమి లేదు. గణాంకాల ప్రకారం మొయిజు పోస్ట్లు ఏవీ డిసెంబర్ 24 నుండి తొలగించబడలేదు

కింద జత చేసిన స్క్రీన్ షాట్ లో (+) మరియు (-) ముద్రలు ఫాలోవర్స్, ఫాలోయింగ్, పోస్టులు ఏమైనా తగ్గాయా పెరిగాయా అనే దానిని సూచిస్తుంది.

సౌజన్యం : సోషల్ బ్లేడ్ 

మొయిజు ఎక్స్ ప్రొఫైల్ ని వే బ్యాక్ మెషిన్ వెబ్సైటు లో కూడా వెతికాము కానీ అలాంటి పోస్ట్లు ఏమి లభించలేదు.

మాల్దీవుల అధ్యక్షులు క్షమాపణ తెలిపారా?

ఇరు దేశాల మధ్య ఈ దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తినప్పటినుంచి, మాల్దీవులలో ఉన్న భారత హై కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. 

జనవరి 7 నాడు మాల్దీవుల విదేశాంగ మంత్రి తమ అధికారిక ప్రకటనలో, ఆ మంత్రుల ఉద్దేశాలు వారి వ్యక్తిగతం అని, అది తమ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. పైగా, ఈ వివాదానికి ఆద్యులైన మంత్రులందరినీ అధ్యక్షులు  సస్పెండ్ చేశారని మొయిజు  ప్రతినిధి అధికారికంగా తెలిపారు మాల్దీవుల విదేశాంగ మంత్రి కుడా ఈ వ్యాఖ్యలు ‘ఆమోదయోగ్యం’ కాదని పేర్కొన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యల తరువాత మాల్దీవులకు వెళ్ళటం బహిష్కరించాలి అని సామాజిక మధ్యమ వేదికలలో ప్రచారం జరిగింది. ఈ తరుణంలో భారతీయ ప్రముఖులు కుడా తమ సామజిక మాధ్యమాలలో మాల్దీవులకు బదులుగా భారదేశం లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు విచ్చేయాలని కోరారు. మాల్దీవులకు సంబంధించిన ప్రముఖులు కుడా ఈ వ్యాఖ్యలని ఖండించినప్పటికీ, ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక క్షమాపణ రాలేదు. 

తీర్పు

వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్. దీనిని ఆన్లైన్ ఎడిటింగ్ పరికరాలు వాడి తయారు చేశారు. తమ మంత్రులు భారత ప్రధానిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాను మాల్దీవుల అధ్యక్షులు ఏ విధమైన క్షమాపణలను పోస్ట్ చేయడం కానీ మరల తొలగించటం కానీ జరగలేదు.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.