హోమ్ వెస్ట్ బెంగాల్ వరదలో గుడి మునిగిన ఫొటోని తప్పుగా బంగ్లాదేశ్ అంటూ షేర్ చేసారు

వెస్ట్ బెంగాల్ వరదలో గుడి మునిగిన ఫొటోని తప్పుగా బంగ్లాదేశ్ అంటూ షేర్ చేసారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

ఆగస్టు 30 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బంగ్లాదేశ్ లో గుడి మునిగిపోయింది అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ బంగ్లాదేశ్ లో గుడి మునిగిపోయింది అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఇది వెస్ట్ బెంగాల్ లోని సుందర్బన్స్ లో సాగర్ దీవి లో ఉన్న కపిల ముని దేవాలయం.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో కొంత మంది యూజర్లు, కాషాయ రంగు కాస్త మునిగి ఉన్న దేవాలయం ఫొటోని షేర్ చేస్తూ ఇది బంగ్లాదేశ్ లోనిది అని రాసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో అధిక వర్షాల వలన నదులు ఉప్పొంగి వరదలు సంభవించాయి. 

బంగ్లాదేశ్ లో వరదలు సంభవించడానికి భారతదేశం లో త్రిపుర డంబుర్ డ్యామ్ ని తెరవటమే కారణం అని ఉఉహాగానాలు వస్తున్న నేపధ్యం లో ఈ క్లెయిమ్ వైరల్ అవుతుంది. కానీ, అది రుజువు చేయటానికి ఎటువంటి ఆధారాలు లేవు, విదేశాంగ శాఖ కుడా త్రిపుర లో ఉన్న డ్యామ్ 120 కిలోమీటర్ల దూరం లో ఉందని, బంగ్లాదేశ్ లోని వరదలు అధిక వర్షాల మూలంగానే వచ్చాయని పేర్కొంది. ఈ నేపధ్యంలో, కొంత మునిగి ఉన్న దేవాలయం ఫొటోని షేర్ చేసి, ఎక్స్ లో ఒక యూజర్ ఈ శీర్షిక తో షేర్ చేసారు, “భారత దేశం తమ డ్యామ్ లను తెరిచింది, వరదలు తీసుకొచ్చింది. ప్రస్తుతం, బంగ్లాదేశ్ లో ఉన్న గుడి నీట మునిగింది.”

ఆర్కైవ్ చేసిన అలంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఎక్స్ పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ వైరల్ అవుతున్న ఫొటో వెస్ట్ బెంగాల్ లోని సుందర్బన్స్ లో సాగర్ దీవి లో ఉన్న కపిల ముని దేవాలయం.

మేము ఏమి కనుగొన్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో ది హిందూ పత్రికలో ఆగష్టు 24, 2019 నాడు ప్రచురించబడిన ఫొటోగా కనుగొన్నము. ది హిందూ కథనం ప్రకారం, సాగర్ దీవి లో ఉన్న కపిల ముని దేవాలయం, అలల ఉద్రిక్తత వలన కోతకు గురి అవుతుంది. ఈ కథనం లో సముద్రానికి 400 మీటర్ల దూరం లో ఉన్న ఈ దేవాలయాన్ని, ముంపుకు గురికాకుండా సంరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పై ఉంది. 


ఎక్స్ పోస్ట్ మరియు ది హిందూ ప్రచురించిన కపిల ముని దేవాలయం ఫొటో (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


మాకు కొన్ని యూట్యూబ్ వీడియోలు కుడా లభించాయి (వాటి ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ), కపిల ముని ఆశ్రమ దేవాలయానికి సంబందించిన వీడియోలు లభించాయి, ఇవి కనీసం ఐదేళ్లు కిందటివి, కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో మాదిరిగానే ఉంది. పైగా, ఆలమి మరియు గెట్టి వంటి వెబ్సైట్లలో  దేవాలయానికి సంభందించిన స్టాక్ ఫొటోలు కుడా లభించాయి.

గూగుల్ మ్యాప్స్ ద్వారా, మేము వైరల్ అవుతున్న ఫొటో వెస్ట్ బెంగాల్ లోని కపిల ముని దేవాలయానికి చెందినదే అని నిర్దారించాము. 

ప్రస్తుతం కపిల్ ముని దేవాలయం వరదకు గురి అయిందా? 

వెస్ట్ బెంగాల్ లో గంగా నది బంగాళా కాతం లో కలిసే చోట ఈ కపిల్ ముని దేవాలయం ఉంది. ఆగష్టు 2024 వరకు, గుడి చుట్టుపక్కన ప్రాంతాలు కోతకు గురి అయినప్పటికీ దేవాలయం మాత్రం ఇంకా వరద వలన ముంపుకు గురి కాలేదు. జులై 2024 నాడు, ప్రచురించబడిన టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈమధ్యన అధిక తాకిడి ఉన్న అలల వలన జరుగుతున్నా కోతకు సంబంధించి విచారణ చేపట్టడానికి సాగర్ దీవికి నిపుణులు వెళ్లినట్టుగా పేర్కొంది.

తీర్పు

వెస్ట్ బెంగాల్ కి సాగర్ దీవిలో ఉన్న కపిల ముని దేవాలయం ఫొటోని తప్పుగా, బంగ్లాదేశ్ లోని హిందూ దేవాలయం గా షేర్ చేస్తున్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.