ద్వారా: రాహుల్ అధికారి
డిసెంబర్ 4 2023
ఈ వీడియో మే 2023 లో బాంగ్లాదేశ్- మయాన్మార్ సరిహద్దుల్లో మోచా తుఫాన్ వచ్చిన సమయం లోనిది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమయిన మిచౌంగ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి డిసెంబర్ 5నాడు నెల్లూరు మరియు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఈ తుఫాన్ ప్రభావం వాళ్ళ, తమిళనాడు, దక్షిణాంధ్ర మరియు దక్షిణ ఒడిశాలో కుడా భారీ వర్ష సూచనలు ఉన్నాయి.
క్లెయిమ్ ఏమిటి?
ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో, మిచౌంగ్ తుఫాన్ వలన కలిగిన నష్టం అంటూ, ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ 0:20 సెకెన్ల నిడివి గల వీడియోలో భారీగా గాలులు మరియు వర్షపు నీటితో వీధులు నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. చాలా మంది ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేస్తూ, ఇది మిచౌంగ్ తుఫాన్ అని రాసుకొచ్చారు. అలాంటి ఒక పోస్ట్ ఈ శీర్షిక తో షేర్ చేయబడింది, “ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం తరువాత, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తుఫాన్ హెచ్చరిక. ప్రకృతి మనల్ని శిక్షిస్తున్నట్టు ఉంది.” ఈ పోస్ట్ కు 83,000కు పైగా వ్యూస్ మరియు 173 లైక్స్ వచ్చాయి. అలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఎక్స్ లో వైరల్ పోస్ట్ల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయినప్పటికీ ఇది నిజం కాదు, ఎందుకంటే, ఇది మే 2023కి సంబంధించిన మోచా తుఫాన్ వీడియో
మేము ఏమి కనుగొన్నాము?
ఈ వైరల్ వీడియోని రెండు భాగాలుగా చూస్తే, మొదటి 4 సెకన్లు మునిగిపోయిన వీధులు కనిపిస్తాయి, మిగిలిన 17 సెకన్లు ఒక మేడ వద్ద భారీ వర్షం మరియి వెనకాల ఈదురు గాలులకి ఊగిసలాడే చెట్లు మనం చూడవచ్చు. ఈ వైరల్ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇది మే 2023 నాటిది అని మాకు అర్ధమయింది. ‘ఆంధ్ర ప్రదేశ్ వెథర్మాన్’ అనే ఒక యూజర్, ఈ వైరల్ వీడియో లోని మొదటి కొంత భాగాన్ని, మే 14, 2023 నాడు షేర్ చేస్తూ, మోచా తుఫాన్ తీరం దాటింది అని రాసుకొచ్చారు. “మయాన్మార్ లో మోచా తుఫాన్ భీబత్సమ్, వారం క్రితం ఊహించినట్టుగానే, ఈరోజు తీరం దాటింది,” అని ఉంది.
ఇంకాస్త నిడివి గల వీడియోని వియాన్ వార్త సంస్థ కుడా వారి ఫేస్బుక్ అకౌంట్ లో మే 14 నాడు షేర్ చేసింది. ఈ పోస్ట్ కు శీర్షికగా, “చుడండి, మోచా తుఫాన్ బాంగ్లాదేశ్ మయాన్మార్ సరిహద్దుల్లో ఆదివారం నాడు తీరం దాటింది. చెట్లని నాశనం చేస్తూ, ఎడతెరిపి లేని వానను కురిపిస్తుంది.”
వైరల్ వీడియో కి మరియు వియాన్ పోస్ట్ చేసిన వీడియో కి పోలిక (సౌజన్యం: ఎక్స్/ ఫేస్బుక్. లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఇంకాస్త శోధించగా, రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ కుడా ఈ వైరల్ వీడియోని తమ యూట్యూబ్ లో షార్ట్స్ గా మే 15, 2023 నాడు అప్లోడ్ చేసింది అని తెలుసుకున్నాము. ఈ వీడియోకి శీర్షికగా, మోచా తుఫాన్ మయాన్మార్ని కుదిపేసింది, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, పైగా వేలకొద్దీ భవనాలు అస్తవ్యస్తం అయ్యాయి అని రాస్తూ, అక్కడి ప్రభుత్వం నడపబడే వార్త సంస్థను పేర్కొంది. లాజికల్లి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలను పోల్చి చూస్తూ, అవి ఒకే లాగే ఉన్నాయని అర్ధమయింది.
వైరల్ వీడియొకి మరియు రాయిటర్స్ షేర్ చేసిన వీడియో కి పోలిక (సౌజన్యం: ఎక్స్/ యూట్యూబ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
తుఫాన్ మోచా బీభత్సము:
మోచా తుఫాన్, బాంగ్లాదేశ్ మయన్మార్ తీర ప్రాంతంలో మే 14నాడు 2023న తీరం దాటింది. మే 19 నాడు ప్రచురించబడిన బి బి సి కథనం ప్రకారం, కనీసం 145 మంది ప్రాణాలు కోల్పోయార. రోహింగ్యా వర్గం వారు అత్యంత ఎక్కువగా ఇబ్బందిపడ్డారు, చనిపోయిన వారిలో 117 మంది వారే. ఈ తుఫాను వలన మొత్తం మీద, 800,000 మంది దాగా ఇబ్బంది పడ్డారు. గడిచిన వంద ఏళ్లలో ఇది తీవ్ర తుఫాను గా పేర్కొన్నారు. నాసా వారు పేర్కొంటూ, ఈ తుఫాను 5వ క్యాటగిరి కి సంబంధించినదని, ఇందులూ గాలులు షుమారుగా గంటకు 175 మైళ్ళ వేగంతో వీచాయి అని తెలిపింది.
తీర్పు:
వైరల్ వీడియోలో ఉన్నది, మిచౌంగ్ తుఫాన్ వలన కలిగిన విద్వాంసం కాదు. ఇది మే 2023 నాడు బాంగ్లాదేశ్ మరియి మయాన్మార్ సరిహద్దుల్లో మోచా తుఫాన్ వల్ల కలిగిన విద్వాంసం. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.