ద్వారా: రాజేశ్వరి పరస
సెప్టెంబర్ 16 2024
వైరల్ అవుతున్న వీడియో బంగ్లాదేశ్ లోని బర్గుణా జిల్లాకి చెందిన ఒక మాజీ స్వతంత్ర సమరయోధుడుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో.
క్లెయిమ్ ఏమిటి?
ఒక మధ్య వయసు వ్యక్తి, మరో పెద్ద వయసున్న, కుర్తా ధరించిన వ్యక్తిని కొడుతున్న ఒక 24 సెకెన్ల వీడియోని సామాజిక మాధ్యమాలలో చేస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూసర్, ఒక పెద్ద వయసు వ్యక్తిని భారత్దేశం లో కొడుతున్నట్టు శీర్షిక పెట్టి షేర్ చేసారు. ఈ పోస్టుని డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే దీనికి దాదాపుగా 168,000 వ్యూస్, 2,300 రిపోస్ట్స్ మరియు 4,700 లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన ఆ పోస్టును ఇక్కడ చూడవచ్చు.
ఒక ఎక్స్ యూసర్ ఈ వీడియోని షేర్ చేసి హిందీలో ఈ విధంగా రాసుకొచ్చారు, “ఈ పిరికివాడు ఎవడో కానీ, చాలా నీచ్యుడు. ఎలా ఈ విధంగా ఒక పెద్ద వయసు ముస్లిం వ్యక్తిపై దాడి చేయగలుగుతున్నాడు. అతని అద్దాలు కుడా పగలుకొట్టాడు. అతనిలో ఉన్న దెయ్యం, గడ్డం, టోపీ చూడగానే బయటకి వచ్చినట్టుంది.” ఈ పోస్టును #AllEyesonIndianMuslims అనే హ్యాష్ట్యాగ్ తో కుడా షేర్ చేస్తున్నారు. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో బంగ్లాదేశ్ కి సంభందించినది, భారతదేశానికి సంభంధం లేదు.
వాస్తవం ఏమిటి?
వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని సెప్టెంబర్ 8, 2024 నాడు షేర్ చేసినట్టు అర్ధమయింది, వీటికి శీర్షికగా బర్గుణాలో ఒక స్వతంత్ర సమరయోధుడిపై దాడి అనే శీర్షికలతో షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ చూడవచ్చు.
ఇంకాస్త పరిశోధించగా, సెప్టెంబర్ 8, 2024 నాడు ప్రచురించిన మరొక ఢాకా పోస్ట్ కథనం లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ కథనంలో కుడా వైరల్ వీడియో మాదిరి వీడియోనే అప్లోడ్ చేసి ఉంది, దీని ప్రకారం, ఆ పెద్ద వయసు వ్యక్తి పేరు అబ్దుర్ రషీద్ మియా. దాడి చేసిన వ్యక్తి పేరు షావన్ మొల్ల, ఇతను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు ఫారూఖ్ మొల్ల కొడుకు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ సంఘటన డిప్యూటీ కమీషనర్ ఆఫీస్ వద్ద సెప్టెంబర్ 8 నాడు జరిగింది.
దాడి జరిగిన మరుసటి రోజు, రషీద్ బంగ్లాదేశ్ వార్త ఛానల్ అయిన జామున టీవీ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది (ఆర్కైవ్ ఇక్కడ). ఇక్కడ మాట్లాడుతూ, అతను డిప్యూటీ కమీషనర్ ఆఫీస్ మీదగా వెళ్తుంటే, అతనిని ‘నకిలీ స్వతంత్ర సమరయోధుడు’ అని హేళన చేయగా, గొడవ పెద్దదైంది అని తెలిపారు. ఢాకా ట్రిబ్యూన్ కథనం కుడా ఇదే సమాచారం పేర్కొంది.
డైలీ స్టార్ రాసిన మరో కథనం ప్రకారం, బాధితుడు ఫిర్యాదు చెయ్యటంతో దాడి చేసిన వ్యక్తి పై సెప్టెంబర్ 9, 2024 నాడు కేసు నమోదు అయ్యింది. ఈ ఫిర్యాదును బర్గుణా సర్దార్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసారు.
నకిలీ స్వతంత్ర సమరయోధుల వివాదం
బర్గుణా జిల్లా అధికారిక వెబ్సైటు ప్రకారం, అబ్దుర్ రషీద్ మియా అనే వ్యక్తి బర్గుణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘ్సద్ కి చెందిన మాజీ కమాండర్ మరియు ఛత్త్ర లీగ్ కి చెందిన జనరల్ సెక్రటరీ.
2022 లో ప్రచురితమైన డైలీ శోమోయేర్ ఆలో కథనం ప్రకారం కుడా ఈయనని స్వతంత్ర సమరయోధుడి గానే గుర్తించారు. రషీద్ కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు స్వతంత్ర సమరయోధుల జాబితాలో చేర్చడానికి డబ్బు తీసుకున్నట్టుగా అభివాదం ఉంది.
ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, రషీద్, శవన్ వద్ద నుండి డబ్బు తీసుకుని తన తండ్రి పేరును స్వతంత్ర సమరయోధుల జాబితా లో చేరుస్తానని మాట ఇచ్చినట్టుగా అభియోగం ఉంది. దీనికి సంబంధించిని వాగ్వాదం పెరగగా, చ్ఛత్ర లీగ్ వైస్ చైర్మన్ నూరుల్ ఇస్లాం మోని పై కుడా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టుగా పేర్కొంది.
తీర్పు :
బంగ్లాదేశ్ కి చెందిన వీడియోని తప్పుగా, భారతదేశం లో ఒక పెద్ద వయసు ముస్లిం వ్యక్తి పై దాడి అంటూ షేర్ చేసారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)