హోమ్ హిజాబ్ వేసుకోనందుకు అమెరికన్ మహిళను హేళన చేసినట్టు వైరల్ అవుతున్న వీడియోలో నిజం లేదు

హిజాబ్ వేసుకోనందుకు అమెరికన్ మహిళను హేళన చేసినట్టు వైరల్ అవుతున్న వీడియోలో నిజం లేదు

ద్వారా: ప్రభాను దాస్

అక్టోబర్ 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అమెరికన్ మహిళను హేళన చేసారు అంటూ వైరల్ అయిన పోస్టుల స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాలలో అమెరికన్ మహిళను హేళన చేసారు అంటూ వైరల్ అయిన పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వీడియోలో కనిపిస్తున్నది, బంగ్లాదేశీ నటి మిష్టి సుభాష్, ఈవిడ మాజీ ప్రధాని షేక్ హసీనా పుట్టిన రోజు జరిగిపినందుకు గాను అక్కడ వ్యక్తులు తనను హేళన చేసారు

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో యూజర్లు, ఒక 20 సెకెన్ల వీడియోను షేర్ చేసి ఇందులో కనిపిస్తున్నది ఒక అమెరికన్ మహిళ అని, తనను కొంతమంది వ్యక్తులు హిజాబ్ ధరించనందుకు హేళన చేస్తున్నారు అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఆ మహిళ ఒక చేతిలో కేక్ పట్టుకుని, మరో చేతిలో ఫోన్ పట్టుకుని ఎవరికో కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉండగా, కొంత మంది కుర్రవాళ్ళు వెనుక నుండి హేళన చేయటం మనకు కనిపిస్తుంది. అలాంటి పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ ఈ వీడియోలో ఆమెను బుర్కా వేసుకోనందుకు హేళన చేయటం లేదు. వీడియోలో కనపడిన వ్యక్తి బంగ్లాదేశీ నటి మిష్టి సుభాష్, ఈమె మాజీ ప్రధాని షేక్ హసీనా పుట్టిన రోజు జరిపినందుకు హేళన చేసారు.

వాస్తవం ఏమిటి? 

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, లోకమత్ టైమ్స్ ప్రచురించిన కథనం ఒకటి లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ కథనం ప్రకారం, హసీనా మద్దతుదారి అయిన మిష్టి సుభాష్. హసీన పుట్టిన రోజు జరిపినందుకు గాను, అక్కడి ప్రజల నుండి వేధింపులకు గురయ్యారు.

వైరల్ వీడియో మాదిరిగా ఉన్న మరిన్ని వీడియోలను మేము ఫేస్బుక్ (ఆర్కైవ్), యూట్యూబ్ (ఆర్కైవ్) లలో కొంత మంది యూజర్లు షేర్ చేసినట్టు గుర్తించాము. వీటిని ఇతర కోణం నుండి తీసినప్పటికి, ఇందులో కూడా అదే మహిళను, వెనుక కొంతమంది అబ్బాయిలను మనం చూడవచ్చు.

లోకమాత్ టైమ్స్ కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : లోకమాత్ టైమ్స్)

పైగా కీ వర్డ్ సెర్చ్ చేయగా, బంగ్లాలో ఈ విషయం గురించి అనేక వార్తా కథనాలు మాకు లభించాయి. వీటిలో ఏబిపి లైవ్ హిందీ కథనం, మరియు బాంగ్లా కథానాలైన ది డైలీ ఇంక్విలాబ్ది రిపోర్ట్ డా లభించాయి. వీటిలో కుడా ఆ మహిళను సుభాష్ గా గుర్తించారు.

పైగా బంగ్లాదేశీ వార్తా సంస్థలు అయిన ప్రోతిడైనర్ బాంగ్లాదేశ్, ఎస్ఏటివి, మరియు ఛానల్ సత్కహో    చెందిన కొన్ని వీడియో కథనాలను కుడా మేము చూసాము (ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). వీటిలో ఆ మహిళ కేక్ ను ఒక చేతిలో పట్టుకుని తాను హసీనా పుట్టినరోజు జరపాలి అని అనుకుంటుంది అని బహిరంగంగా చెప్పటం కుడా మనం చూడవచ్చు. కానీ వెంటనే అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆమెను హేళన చేస్తూ, కేక్ ను పాడు చెయ్యటం జరిగింది. సుభాష్ ఈ సంఘటనను ఖండిస్తూ, ఆమె, హేళన చేసే వ్యక్తులను తరమడం చూడవచ్చు.

ఈ కథనాల ప్రకారం, వైరల్ వీడియోను సెప్టెంబర్ 29, 2024 నాడు సుభాష్ ఢాకా యూనివర్సిటీ లోని టీచర్ స్టూడెంట్ సెంటర్ వద్ద హసీనా పుట్టిన రోజు జరపడానికి వెళ్లారు. పైగా, సుభాష్, హసీనా అసలైన పుట్టిన రోజును అంతకు ముందు రోజు, అంటే సెప్టెంబర్ 28, 2024 నాడే గోప్యాంగ జరిపినట్టు కుడా తెలిపారు. కానీ ఆ రోజున టీచర్ స్టూడెంట్ సెంటర్ విద్యార్థులు హసీనాను అవమానించే (ఆర్కైవ్ ఇక్కడ) విధంగా తన పుట్టినరోజును జరిపినందుకు బదులుగా సుభాష్ అక్కడ ఆవిధంగా చేసినట్టు తెలిపారు.

తీర్పు

అమెరికన్ మహిళను బుర్కా  వేసుకోనందుకు హేళన చేస్తున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం లేదు. వీడియోలో కనిపించిన మహిళ, బంగ్లాదేశీ నటి, మిష్టి సుభాష్. బహిరంగంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పుట్టిన రోజును సెప్టెంబర్ 29, 2024 నాడు జరిపినపుడు, తీసిన వీడియో ఇది.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.