హోమ్ వీడియోలో అఖిలేష్ యాదవ్ పాత్రికేయుల నుండి తప్పించుకోవడానికి కంచెపై నుండి దూకడం లేదు

వీడియోలో అఖిలేష్ యాదవ్ పాత్రికేయుల నుండి తప్పించుకోవడానికి కంచెపై నుండి దూకడం లేదు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

సెప్టెంబర్ 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ పాత్రికేయుల నుండి తప్పించుకోవడానికి కంచె పై నుండి దూకుతున్నాడు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ పాత్రికేయుల నుండి తప్పించుకోవడానికి కంచె పై నుండి దూకుతున్నాడు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఈ వీడియో అక్టోబర్ 2023 నాటిది, అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్బంగా పువ్వులు సమర్పించడానికి, అఖిలేష్ యాదవ్ ఒ గేటు దూకి వెళ్లారు.

క్లెయిమ్ ఏమిటి?

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక గేటు పై నుండి దూకి వెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. దీనిని షేర్ చేస్తూ, ఎస్ పి నాయకుడు నవాబ్ సింగ్ పైన వచ్చిన మైనర్ బాలిక అత్యాచారానికి సంభందించిన ప్రశ్ననలు తప్పించుకోవడానికి అలా పారిపోయాడు అనే ఆరోపణలతో ఈ క్లెయిమ్ షేర్ అవుతుంది.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి హిందీలో ఇలా రాసుకొచ్చాడు, “డి ఎన్ ఏ పరీక్షలో అత్యాచారాం చేసింది సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నవాబ్ సింగ్ అని రోజువు అవ్వగానే, పాత్రికేయులు అఖిలేష్ యాదవ్ ను చుట్టుముట్టారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా కంచె దుకి పారిపోయాడు.” (అనువాదం)  

ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇదే వీడియోని సాధ్వి ప్రాచి కుడా అఖిలేష్ యాదవ్ గురించి అసభ్య వ్యాఖ్యలతో రాసి షేర్ చేసారు, ఆ తరువాత పోస్టును తొలగించటం జరిగింది. ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.


వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)


కానీ మా పరిశోధన ప్రకారం ఈ వీడియో అక్టోబర్ 2023 నాటిది.

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ వీడియోకి సంబంధించి కీ వర్డ్ సెర్చ్ చేస్తే ఈ వీడియో అక్టోబర్ 2023 నాటిది అని అర్థమైంది. ఇందులో, అఖిలేష్ యాదవ్ లక్నో లోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ సెంటర్  గేటు దూకి అక్కడ జరుగుతున్న జయప్రకాశ్ నారాయణ్ జయంతి విగ్రహానికి పువ్వులు సమర్పిచడానికి వెళ్లారు. అక్టోబర్ 11, 2023 నాడు ప్రచురితమైన వార్త కథనాలు కుడా ఈ విధంగానే రాసుకొచ్చాయి. ఆ రోజున యాదవ్ ఆ ప్రదేశానికి వెళ్ళినపుడు, అక్కడ గేటు వేసి ఉండటం తో, ఆయన గోడ దూకి విగ్రహానికి నివాళులు అర్పించారు.   

ఏ బి పి న్యూస్ లో అక్టోబర్ 11, 2023 నాడు ప్రచురితమైన కథనం ప్రకారం, యాదవ్ అక్కడికి వెళ్ళినపుడు గేటుకు తాళం వేసి ఉంది. ఈ కథనంలో జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ సెంటర్ ను సరిగ్గా నిర్వహించట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని యాదవ్ విమర్శించినట్టు ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). సమాజ్ వాదీ పార్టీ ప్రతి సంవత్సరం వచ్చి నివాళులు అర్పిస్తోంది అని తెలిసిన కుడా ఎందుకు మూసి వేశారు అని అడిగినట్టుగా కూడా కథనం పేర్కొంది.

ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా, జాన్ సత్తా మరియు న్యూస్ 18 మరియు ఇతర సంస్థలు కుడా ఈ విషయాన్నీ గురించి ప్రచురించాయి, ఆ సమయంలో వీడియోలు మరియు ఫొటోలు కుడా తీశారు.

అక్టోబర్ 11, 2023 నాడు అఖిలేష్ యాదవ్ తన ఎక్స్ అకౌంట్ లో ఈ సంఘటనను గురించి రెండు ఫొటోలను కుడా పోస్ట్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ). ఒక ఫొటోలో ఆయన జయప్రకాశ్ నారాయణ్ విగ్రహానికి చేతులు జోడించి దణ్ణం పెట్టటం, మరొకటి ఆయన గేటు దూకుతున్న ఫొటో.




ఈ విషయం గురించి ఇంకాస్త పరిశోధించగా, లక్నో డెవలప్మెంట్ అథారిటీని అనుమతి అడిగినప్పటికీ, భద్రతా కారణాల చేత యాదవ్ ని మరియు అతని అనుచరులను లోపలకి వెళ్లనివ్వకుండా గేటు మూసివెయ్యడం జరిగింది అని తెలిసింది.

నవాబ్ సింగ్ కేసు ఏమిటి?

ఆగష్టు 11, 2024 నాడు నవాబ్ సింగ్ అనే ఎస్ పి నాయకుడిని ఉత్తర్ ప్రదేశ్ లో ఒక కళాశాలలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఆరోపణల విషయం లో అరెస్ట్ చేశారు. ఆగష్టు 17 నాడు నవాబ్ సింగ్ ను డి ఎన్ ఏ పరీక్ష చేయగా, అతని నమూనా ద్వారా అత్యాచారం చేసినట్టుగా నిర్ధారించబడింది అని కథనాలు పేర్కొన్నాయి. 

తీర్పు

మా పరిశోధన ప్రకారం, ఈ వీడియో అక్టోబర్ 2023 నాటిది, అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్బంగా పువ్వులు సమర్పించడానికి, అఖిలేష్ యాదవ్ ఒక గేటు దూకి వెళ్లారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.