హోమ్ రాజకీయవేత్త-నటుడు విజయ్, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించలేదు

రాజకీయవేత్త-నటుడు విజయ్, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించలేదు

ద్వారా: వనితా గణేష్

నవంబర్ 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో విజయ్ తన పార్టీ సభ్యులను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగాన్ని షేర్ చేసి ఇందులో వైఎసార్సీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తున్నారు అంటూ రాసుకొచ్చిన పోస్టుల స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాలలో విజయ్ తన పార్టీ సభ్యులను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగాన్ని షేర్ చేసి ఇందులో వైఎసార్సీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తున్నారు అంటూ రాసుకొచ్చిన పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

పూర్తి వీడియోలో విజయ్ ఎక్కడా కూడా తన ప్రసంగం లో జగన్ మోహన్ రెడ్డి పేరు పలకలేదు.

క్లెయిమ్ ఏమిటి?

తమిళ్ నాడు కి చెందిన నటుడు మరియు రాజకీయవేత్త, జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (విజయ్) ప్రసంగానికి సంభందించిన క్లిప్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. దీనిని షేర్ చేసి, విజయ్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు అంటూ రాసుకొచ్చారు.

విజయ్ ఈ మధ్య కాలం లోనే తమిళ్ నాడు లో తన పార్టీ సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) కి సంభందించి రాష్ట్ర స్థాయిలోని మొదటి రాష్ట్ర స్థాయి ప్రసంగం చేయటం జరిగింది. దీనిని తెలుగు లో తప్పుడు అనువాదాన్ని జోడించి షేర్ చేశారు.

ఒక 30 సెకెన్ల వీడియోని షేర్ చేస్తూ, “జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నా మీద ఒక కేసు కూడా లేదు. అలాంటిది వాడే సీఎం అవ్వగా లేనిది నేను అవ్వలేనా ?? మీరే చెప్పండి.

జగన్మోహన్ రెడ్డి లాగా దొంగలను, రేపిస్టులను పార్టీలో పెట్టుకొని నేను ప్రోత్సహించను,” అంటూ రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


విజయ్ తన పార్టీ కి సంభందించిన మొదటి ప్రసంగం లో 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక గురించి తన ధ్యేయం గురించి ఇలా వివరించారు. ఎక్కడా కూడా తను జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించలేదు. 

మేము ఏ విధంగా కనుగొన్నాము?

వైరల్ అవుతున్న క్లిప్ లో పాలిమర్ న్యూస్ లోగో ను మేము గమనించాము. దీని ఆధారంగా, విజయ్ పూర్తి ప్రసంగాన్ని యూట్యూబ్ ఛానల్ లో కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ).  ఈ వీడియోకి శీర్షిక గా, “Thalapathy Vijay's Powerful Speech at TVK Maanadu 2024 | TVK Maanadu Crowds |  Vijay Conference” అని రాసి ఉంది. ఇందులో, విజయ్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దెశించి ప్రసంగించటం మనం చూడవచ్చు. ఈ ప్రసంగాన్ని, అక్టోబర్ 27 నాడు, పార్టీ మొదటి రాష్ట్ర  సమావేశం లో తమిళనాడు లోని విల్లుపురం జిల్లాలో చేయటం జరిగింది.

ఇందులో,  5:40 టైం స్టాంప్ మరియు 6:10 వద్ద వైరల్ వీడియోలో ప్రసంగాన్ని చూడవచ్చు. ఇక్కడ విజయ్ మాట్లాడుతూ, “నాకు తెలిసినంతవరకు, మనం అందరం ఒకటే, మీరందరు నా హృదయం లో ఉన్నారు, అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికి వందనాలు.”

పైగా, విజయ్ పూర్తి ప్రసంగాన్ని కూడా మేము చూసాము, దీనిని, అనేక ప్రాంతీయ ఛానళ్ళు లైవ్ ప్రసారం చేసాయి (ఆర్కైవ్) . వీటిని పరిశీలించగా, వైఎసార్సీపి అధినేతని ఉద్దేశించి ప్రస్తావన ఎక్కడా లేదు.

వార్తా కథనాల ప్రకారం, విజయ్ తన ప్రసంగంలో, తమిళనాడు లోని అధికార పార్టీ ద్రావిడ మున్నేత్ర కజగం (డి ఎం కే) ను విమర్శించినట్టు రాసుకొచ్చారు. రెడ్డిని విమర్శించినట్టుగా ఆ విధమైన ప్రస్తావన లేదు.

దీని బట్టి, విజయ్, రెడ్డి గురించి కానీ, వైఎసార్సీపి పార్టీ గురించి కానీ ఎక్కడా ప్రసంగించలేదు అని అర్ధమవుతుంది. 

తీర్పు

మా పరిశోధన ప్రకారం, నటుడు విజయ్ ప్రసంగానికి తప్పుడు అనువాదాన్ని జోడించి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా షేర్ చేస్తున్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.