ద్వారా: రాహుల్ అధికారి
నవంబర్ 13 2024
ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేసి, తప్పుగా అది నిజ జీవితం లో జరిగిన సంఘటన లాగా షేర్ చేస్తున్నారు.
(పాఠకుల గమనిక : ఈ కథనం లో లైంగిక వేధింపుల గురించిన వివరణ ఉంటుంది, గమనించగలరు)
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఇందులో ఒక హిందూ సాధువు ఒక మహిళను వేదిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ వైరల్ విడియోలోనే, వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఆ సాధువును ప్రశ్నించగా, తాను ఆ మహిళ కడుపు నొప్పి సమస్య కు పరిష్కారం ఇస్తున్నట్టుగా తెలియజేస్తాడు.
ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “సాధువులు రోగాలను నయం చేయడానికి కొత్త మార్గం కనుక్కున్నారు. ఒక సంఘీ మనస్తత్వం ఉన్న హిందూ సాధువు ఈ విధంగా దొరికిపోయాడు,” అంటూ రాసుకొచ్చారు. అలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ క్లెయిమ్ తప్పు. ఎందుకంటే, వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్ వీడియో, దీనిని తప్పుగా ఒక హిందూ సాధువు ఒక మహిళను వేధిస్తున్నారు అంటూ షేర్ చేసారు.
మేము ఏ విధంగా కనుగొన్నాము?
వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అశ్వని పాండే అనే యూట్యూబ్ ఛానల్ లో మరింత నిడివి గల వీడియో లభించింది. అసలు వీడియో మొత్తం 13 నిమిషాలు ఉంది. ఇందులో 16 సెకెన్ల నిడివి వద్ద, ఇది కల్పిత ఘటన అని వివరణతో పాటు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే తీసినట్టు పేర్కొన్నారు (ఆర్కైవ్ ఇక్కడ).
ఈ వీడియోలో ఒక కాషాయం రంగు దుస్తులు వేసుకున్న వ్యక్తి ఒక బాబా అని చెప్పుకుంటూ తనవద్దకు కడుపు నొప్పి తో వచ్చిన మహిళను వేదిస్తున్నట్టు కనిపిస్తుంది. మరో ఇద్దరు వ్యక్తులు ఆ బాబా ను పట్టుకుని చితక బాదగా, ఇందులో అతను తన కాషాయ దుస్తులు తీసేసి లోపల ప్యాంటు షర్ట్ వేసుకున్నట్టు కూడా మనం చూడవచ్చు. అనంతరం, అతనిని పోలీసులకు పట్టించడానికి లాక్కుని వెళ్లారు. వైరల్ అవుతున్న వీడియోను మనం ఒరిజినల్ వీడియోలో 0:51 సెకెన్ల నుండి 2:19 సెకెన్ల మధ్య చూడవచ్చు.
ఆ యూట్యూబ్ ఛానల్ ను పరిశీలించగా, అనేక స్క్రిప్టెడ్ వీడియోలు ఇక్కడ ఉన్నట్టు అర్థమైంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళా మరియు పురుషుడు ఇతర వీడియోలలో కూడా వివిధ పాత్రలలో కనిపిస్తారు. ఒక వీడియోలో ఈ ఇద్దరు, డాక్టర్ మరియు విద్యార్థి పాత్రలలో ఉన్నారు. (ఆర్కైవ్ ఇక్కడ).
మేము ఈ వీడియో మేకర్స్ ను కూడా ఈ వీడియో గురించి సంప్రదించాము, వారి స్పందన వచ్చిన వెంటనే ఇక్కడ పొందుపరుస్తాము.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ గతం లో ఇలాంటి అనేక స్క్రిప్టెడ్ వీడియోలకు సంబంధించిన క్లెయిమ్స్ ను ఫ్యాక్ట్ చెక్ చేసింది. వాటిని ఇక్కడ చదవగలరు.
తీర్పు
ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేసి, ఇందులో ఒక హిందూ సాధువు మహిళను వేధిస్తున్నారు అంటూ షేర్ చేసారు. ఈ వీడియోను కేవలం వినోదం కోసం మాత్రమే చిత్రీకరించినట్టు పేర్కొన్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)
Read this fact check in English here