హోమ్ పాత వీడియోని బహ్రైచ్ లో జరిగిన అల్లర్లకు జతకడుతూ షేర్ చేస్తున్నారు

పాత వీడియోని బహ్రైచ్ లో జరిగిన అల్లర్లకు జతకడుతూ షేర్ చేస్తున్నారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్

అక్టోబర్ 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇది బహ్రైచ్ అల్లర్లకు సంభందించిన వీడియో అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఇది బహ్రైచ్ అల్లర్లకు సంభందించిన వీడియో అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న వీడియో బహ్రైచ్ లో అల్లర్లకు మునుపే, సెప్టెంబర్ 25, 2024 నాడు జరిగిన సంఘటనకు సంభందించినది.

క్లెయిమ్ ఏమిటి?

ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రైచ్ లో అక్టోబర్ 13 నాడు రామ్ గోపాల్ మిశ్రా మరణాంతరం అల్లర్లు చెలరేగాయి. ఈ నేపధ్యం లో కూలబడిన ఇల్లులు ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేస్తూ, మిశ్రా హత్య అనంతరం, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘బుల్లడోజర్ జస్టిస్’ ఇది అంటూ రాసుకొచ్చారు.

ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “చాలా బాగుంది, బహ్రైచ్‌లో రామ్ గోపాల్ మిశ్రా హంతకుల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. మీరు ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్‌ లాగానే..” అంటూ రాసుకొచ్చారు.

పైగా, ఈ వీడియోని విశ్వా హిందూ పరిషద్ నేత సాధ్వి ప్రాచి తన ఫేస్బుక్ అకౌంట్ లో కూడా షేర్ చేశారు. ఆ పోస్టుకు హిందీ లో శీర్షిక గా, “గోపాల్ హత్య ఎవరు చేశారో, కళ్ళు తెరిచి చుడండి, ఇది బాబా (ఆదిత్యనాథ్) చేసిన న్యాయం. బహ్రైచ్ వాజిర్గంజ్ గాజా లాగా మారింది. ఏ ఏ వీధుల్లో నుంచి రాళ్లు రువ్వరో ప్రతి చోటికి బుల్డోజర్లు చేరుకుంటాయి. గోపాల్ ని చంపిన వారి ఇల్లు కూల్చబడ్డాయి.” అంటూ రాసుకొచ్చారు.

ఇదే విధమైన వ్యాఖ్యలతో మరిన్ని పోస్టులు షేర్ చేయబడ్డాయి, వాటి ఆర్కైవ్ లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్స్)

భారత దేశం లో ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో శిక్షగా తమ ఇళ్లను కూల్చడం ప్రారంభించారు, దీని వలన ‘బుల్ డోజర్ జస్టిస్’ అనే పదం వాడుకలోకి వచ్చింది.

కానీ వైరల్ అవుతున్న వీడియో మాత్రం, బహ్రైచ్ లో అల్లర్లకు మునుపు సెప్టెంబర్ 2024 నుండి ఆన్లైన్ లో ఉంది.

మేము ఏ విధంగా కనుగొన్నాము? 

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు సెప్టెంబర్ 2024 నుండి అనేక యూట్యూబ్ వీడియోలు లభించాయి, వాటిలో కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న మాదిరి వీడియోనే ఉంది (ఆర్కైవ్ ఇక్కడ)

సెప్టెంబర్ 26 నాడు అప్లోడ్ చేసిన అలాంటి ఒక వీడియోలో, వాజిర్గంజ్ బజార్ బహ్రైచ్ లో తీసినట్టు ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). ఆ వీడియోకి శీర్షికగా హిందీ లో, “వాజిర్గంజ్ దుఃఖం లో మునిగిపోయింది” అని ఉంది.

యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వైరల్ వీడియో (సౌజన్యం : యూట్యూబ్)

ఆ యూట్యూబ్ వీడియోలో ‘@altaf.studio’ అనే పదాన్ని మేము వాటర్ మార్క్ గా ఉండటం గమనించాము, దీని ద్వారా, ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని మేము కనిపెట్టాము (ఆర్కైవ్ ఇక్కడ). ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోని సెప్టెంబర్ 26, 2024 నాడు షేర్ చేసారు, దీనికి శీర్షిక గా, “వాజిర్గంజ్ | అప్నా వాజిర్గంజ్/ బహ్రైచ్” అని రాసారు. ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో 0:24 టైం స్టాంప్ వద్ద వైరల్ వీడియో మనకు కనిపిస్తుంది.”

ఇన్స్టాగ్రామ్ వీడియో (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్ )

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇన్స్టాగ్రామ్ యూజర్ అల్తాఫ్ ను సంప్రదించింది, ఆయన మాతో మాట్లాడుతూ, ఈ వీడియోని సెప్టెంబర్ 26 నాడు వాజిర్గంజ్ లో ఇల్లు కూల్చే ఘటన అనంతరం చిత్రీకరించినట్టుగా తెలియజేసారు. కోర్టు ఆర్డర్ అనంతరం ఈ విధంగా కూల్చివేతలు చేపట్టినట్టు తెలియజేసారు.”

వైరల్ అవుతున్న వీడియోలో జరుగుతున్న కూల్చివేతలు బహ్రైచ్ జిల్లాలోని ఫాఖార్పూర్ లోని వాజిర్గంజ్ బజార్ వద్ద తీసినట్టుగా తెలుస్తుంది, పైగా మిశ్రా మరణాంతరం అల్లర్లు చెలరేగింది మహారాజ్‌గంజ్‌ వద్ద, ఈ రెండు వేరు వేరు ప్రదేశాలు.

పైగా, బహ్రైచ్ పోలీసులు కూడా ఈ విషయమై స్పష్టత ఇస్తూ, వైరల్ అవుతున్న వీడియో సెప్టెంబర్ 25, 2024 నాడు తీసినది అని, మహారాజ్‌గంజ్‌ లో జరిగిన అల్లర్లకు సంభంధం లేదు అని నిర్ధారించారు (ఆర్కైవ్ ఇక్కడ).

బహ్రైచ్ పోలీసుల పోస్ట్ (సౌజన్యం : ఎక్స్/ బహ్రైచ్ పోలీస్)

అనేక వార్తా కథనాలు కుడా, ఇదే విషయాన్నీ నిర్ధారించాయి. ది హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, జిల్లా కార్యాలయం 23 చట్ట విరుద్ధ కట్టడాలను బుల్లడోజర్లతో కూల్చివేసింది. ఈ కట్టడాలు అలాహాబాద్ హై కోర్టు తీర్పు అనంతరం, సరై జజ్ఞా గ్రామం లో ప్రభుత్వ స్థలము లో కట్టినందుకు గాను వీటిని కూల్చివేయటం జరిగింది.

బహ్రైచ్ అల్లర్లు 


ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, మహారాజ్‌గంజ్‌ లో 22 సంవత్సరాల మిశ్రా ను దుర్గ పూజ ఊరేగింపు లో హతమార్చిన అనంతరం, రెండు వర్గాలకు మధ్య అల్లర్లు చెలరేగాయి. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం, ఈ ఘటన లో 104 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. 

ఉత్తర్ ప్రదేశ్ లోని ది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొత్తంగా 23 మందికి నోటీసులు ఇవ్వటం జరిగింది, అందులో 20 మంది ముస్లిం మతానికి చెందిన వారు.


కానీ టైమ్స్ అఫ్ ఇండియా అక్టోబర్ 22 నాడు ప్రచురించిన కథనం ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బహ్రైచ్ అల్లర్ల నేపధ్యం లో ఏ భవనాన్ని కూల్చబోమని, సుప్రీమ్ కోర్టుకు ఒప్పందం ఇచ్చింది. పైగా, అలాహాబాద్ హై కోర్ట్ కూడా బహ్రైచ్ అల్లర్ల నేపధ్యం లో పి డబ్ల్యూ డి నోటీసులుకు జవాబు ఇచ్చేందుకు 15 రోజుల సమయాన్ని పొడిగించింది, కనుక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో, అల్లర్లకు సంభందించినది కాదు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ అంతకు మునుపు కూడా మిశ్రా మరణాంతరం వచ్చిన తప్పుడు సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసింది, వాటిని ఇక్కడ చదవండి. 

తీర్పు

రామ్ గోపాల్ మిశ్రా హత్య నేపధ్యం లో ‘బుల్లడోజర్ జస్టిస్’ అంటూ వైరల్ అవుతున్న వీడియో తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఈ సంఘటన సందర్బంగా అల్లర్లు చెలరేగినప్పటికీ, ప్రతుతం వైరల్ అవుతున్న వీడియో సెప్టెంబర్ 25 నాటిది, కోర్ట్ ఉత్తర్వుల అనంతరం, ఇల్లులు కూలగొట్టిన వీడియో.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.