హోమ్ టర్కీ కి సంబంధించిన పాత వీడియోని కేరళలో జరిగిన ఘటనలాగా షేర్ చేశారు

టర్కీ కి సంబంధించిన పాత వీడియోని కేరళలో జరిగిన ఘటనలాగా షేర్ చేశారు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

నవంబర్ 12 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కేరళ లోని ఒక పాల పరిశ్రమ లో ఒక ముస్లిం వ్యక్తి పాల టబ్ లో స్నానం చేస్తున్నట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో కేరళ లోని ఒక పాల పరిశ్రమ లో ఒక ముస్లిం వ్యక్తి పాల టబ్ లో స్నానం చేస్తున్నట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న వీడియో టర్కీ లోని కోన్యా అనే ప్రదేశం లో 2020 లో జరిగిన ఘటన, ఈ విషయంలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఒక వ్యక్తి టబ్ లో పడుకుని అందులో పాల వలె కనిపించే పదార్థాన్ని తలపైన పోసుకుంటూ ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది కేరళ లోని ఒక పాల పరిశ్రమ జరిగిన ఘటన మత రంగు పులిమి షేర్ చేస్తున్నారు.

ఒక ఎక్స్ యూసర్ ఈ వీడియోని షేర్ చేసి, “కేరళలో ఒక పాల ఫ్యాక్టరీని చూడండి ఒక ముస్లిం వ్యక్తి పాల తొట్టెలో స్నానం చేస్తుంటే అదే పాలను ప్యాక్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇంత దారుణమా !! ఎందుకు ఈ **గాల్లు ఇతరులపై ద్వేషం,” అంటూ రాసుకొచ్చారు. 

ఇతరులు కూడా అదే విధమైన వ్యాఖ్యలతో ఈ వీడియోను షేర్ చేసారు, అలంటి పోస్టుల ఆర్కైవ్ లింకులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్)

భారతదేశానికి సంభందించినది కానీ కాదు. ఇది టర్కీ దేశం లో 2020 లో జరిగిన ఘటనకు సంభందించినది. 

మేము వాస్తవాన్ని ఎలా కనుగొన్నాము? 

వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకు సంభందిచిన అనేక పోస్టులు మాకు లభించాయి. నవంబర్ 6, 2020 లో ప్రచురితమైన హుర్రియత్ డైలీ న్యూస్ కథనం ప్రకారం, టర్కీ దేశం లోని కోన్యా లో ఒక పాల పరిశ్రమ లోని పాల టబ్ లో స్నానం చేసినందుకు గాను, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది. ఈ కథనం లో కూడా వైరల్ అవుతున్న వీడియోను మనం చూడవచ్చు.

వైరల్ వీడియో మరియు హుర్రియత్ డైలీ కథనం (సౌజన్యం : ఎక్స్/ హుర్రియత్ డైలీ) 


మరో టర్కిష్ న్యూస్ ఛానల్ TRT Haber ప్రకారం, పాల పరిశ్రమ లో పని చేసే, ఎంరే సయార్ అనే ఒక వ్యక్తి మరియు ఉగుర్ తుర్గుట్ అనే మరో ఒక ఉద్యోగి తో కలిసి, టిక్ టాక్ లో ‘పాల’ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను చేసి, నవంబర్ 6, 2020 నాడు షేర్ చేసారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. ఆ పాల పరిశ్రమకు ఫైన్ వేసి లైన్స్ ని రద్దు చేయటం జరిగింది.

మరో టర్కిష్ కథనం ప్రకారం, వారిద్దరిని ఆరు రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ తరువాత బెయిల్ పైన విడుదల చేసారు. ఆ తరువాత, ఈ కేసుకు సంబంధించిన న్యాయవాది ఆ టబ్ లో ఉన్నది పాలు కాదు అని, పాల పొడి మరియు వేడి నీళ్లు అని తెలియజేసారు. ఆ తరువాత కోర్టు సయార్ మరియు ఉగుర్ ను 2021 లో ముద్దాయిలు గా పేర్కొంది,  దీని తరువాత సయార్ మరో కేసు నమోదు చేసి 120,000 లీరాస్ ను పరిహారం గా కోరారు. సయార్ ఆ కేసు గెలిచినప్పటికీ 1,150 లీరాస్ మాత్రమే పరిహారం చెల్లించవలసిందిగా కోరింది. సయార్ దాదాపుగా 70 మంది పైన పరువు నష్టం దావా కేసు నమోదు చేసారు. 

తీర్పు


మా పరిశోధన పరికరం, వైరల్ అవుతున్న వీడియో కోన్యా లోని టర్కీ కి చెందినది, ఇది 2020 లో జరిగిన ఘటనకు సంభందించినది, కేరళ కు సంబంధం లేదు. 

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.