హోమ్ తిరుమలలో వయోవృద్దులకు దర్శన వెసులుబాటు గురించి వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది

తిరుమలలో వయోవృద్దులకు దర్శన వెసులుబాటు గురించి వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది

ద్వారా: రాజేశ్వరి పరస

అక్టోబర్ 21 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో చంద్రబాబు నాయుడు వయోవృద్దులకై ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారంటూ వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో చంద్రబాబు నాయుడు వయోవృద్దులకై ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారంటూ వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ప్రస్తుతం వయోవృద్ధులకు మధ్యాహ్నం మూడు గంటలకు సోమవారం నుండి శనివారం వరకు మాత్రమే తిరుమల లో దర్శనం కల్పిస్తారు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల దేవస్థానం లో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు అంటూ పోస్ట్ వైరల్ అయింది. ఒక ఎక్స్ పోస్ట్ లో “తిరుపతి లో చంద్రబాబు నాయుడు మొదటి సంస్కరణ. 65 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులకు తిరుమల దేవస్థానం శుభవార్త. వయో వృద్ధులకు ఇకనుంచి రెండు విభాగాలలో ఉచిత దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఒకటి ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు. ఈ వెసులుబాటును ఉపయోగించుట కొరకు, భక్తులు తమ ఆధార్ కార్డును మరియు ఏదైనా ఒక ఫొటో గుర్తింపు కార్డును తెచ్చుకోవలెను.”

ఇదే క్లెయిమ్ వాట్స్ అప్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో కుడా వైరల్ అవుతుంది. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : వాట్స్ అప్/ ఎక్స్/ స్క్రీన్ షాట్) 


కానీ, వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది, ఎందుకంటే ప్రస్తుతం తిరుమల లో వయోవృద్ధులు కేవలం రోజుకి ఒక సారి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కుడా ఇదే విషయాన్నీ నిర్ధారించారు.

వాస్తవం ఏమిటి?

ఈ విషయం గురించి టీటీడీ అధికారిక వెబ్సైటును మేము పరిశీలించాము. దీని ప్రకారం, వయో వృద్దులకు, గతం లో కోవిడ్ కు ముందు రెండు స్లాట్ల్ ద్వారా అనుమతించేవారు, కానీ ఏప్రిల్ 2022 తరువాత ఇది మార్పు చెందింది. దేవాలయ వెబ్సైటు కు సంభందించిన ఆర్కైవ్ పేజీలను మేము గమనించాము, వీటి ద్వారా డిసెంబర్ 2014 నాడు రెండు స్లాట్లు ఉన్నట్టు అందులో రాసి ఉంది. మరియు మార్చ్ 2015 నాటి ఆర్కైవ్ లో కుడా అదే విధంగా ఉంది. పైగా, 2014 నాటి ముందు వయో వృద్దులకు ఉచిత దర్శన సౌలభ్యం ఉంది, ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ.

కానీ ప్రస్తుతం దేవస్థానం వెబ్సైటు ప్రకారం, సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్దులకు దర్శన సౌలభ్యం ఉంది. ఇందుకోసం, భక్తులు తమ ఆధార్ కార్డును చూపించాలి, ఇందులో కేవలం రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు.

టీటీడీ వెబ్సైటు ప్రకారం వయో వృద్దులకు పరిమతమైన స్లాట్స్ (సౌజన్యం : tirumala.org)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో, పేరు తెలుపడానికి నిరాకరించిన ఒక టీటీడీ ప్రతినిధి మాట్లాడుతూ, అలాంటి కొత్త సౌలభ్యాలు ఏమి టీటీడీ లో మొదలవ్వలేదు అని తెలిపారు. వయో వృద్దులకు ప్రస్తుతం మూడు గంటకు ఒక్క స్లాట్ మాత్రమే ఉంది అని తెలిపారు. ఈ విధమైన దర్శనానికి కచ్చితంగా ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి.

ఈ విషయమై టీటీడీ కుడా తమ వెబ్సైటు లో జూన్ 2024 నాడు ఒక స్పష్టత ఇచ్చింది, అప్పట్లో కుడా ఇదే విధమైన క్లెయిమ్ వైరల్ అయింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ స్పష్టత లో తప్పుడు వదంతులు నమ్మవద్దని, వయో వృద్ధుల కోసం కేవలం ఒక స్లాట్ మాత్రమే ఉందని, ఈ వెసులుబాటు ను ఉపయోగించుదానికి రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తారని ఉంది. ఇందుకోసం, భక్తులు ప్రతి నెల 23 వ తారీకున ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేస్కోవాలని తెలిపింది. 

తీర్పు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నట్టుగా, చంద్రబాబు నాయుడు తిరుమల లో వయో వృద్ధుల కోసం కొత్త నిభందనలు ఏమి తీసుకురాలేదు. ప్రస్తుతం కేవలం రోజుకి ఒక్క స్లాట్ ద్వారా మాత్రమే వారికి దర్శన వెసులుబాటు ఉంటుంది. వయో వృద్దులకు ఉచిత దర్శన వెసులుబాటు గత పది సంవత్సరాల ముందు నుండి అందుబాటులో ఉంది.

(అనువాదం : రాజేశ్వరి పరసా) 


ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.