హోమ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కళాశాలలో విద్యార్ధులను కొడుతున్న వీడియో ఫిబ్రవరి లో జరిగిన ఘటన కి సంబంధించినది

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కళాశాలలో విద్యార్ధులను కొడుతున్న వీడియో ఫిబ్రవరి లో జరిగిన ఘటన కి సంబంధించినది

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కళాశాలలో విద్యార్ధులను కొడుతున్న వీడియో ఫిబ్రవరి లో జరిగిన ఘటన కి సంబంధించినది ఈ ర్యాగింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనం అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ వీడియో తాజాగా బయటకి వచ్చింది కానీ, ఘటన జరిగింది మాత్రం ఫిబ్రవరి 2024 లో అని పోలీసులు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు.

(గమనిక- ఈ కథనంలో హింసకి సంబంధించిన విజువల్స్, వివరణ ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏంటి?

కొంత మందిని కర్రలతో కొడుతున్న 5 నిమిషాల 44 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నీమధ్య జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ గెలుపొందాక రాష్ట్రం దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది నిదర్శనం అని చెబుతూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనకి సంబంధించిన వీడియో అని తెలిపారు. 

ఇదే వీడియోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) అకౌంట్ లో కూడా షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). ఈ పోస్ట్ లో స్పష్టమైన క్లైమ్ అంటూ నిర్ధిష్టంగా ఏమీ చేయలేదు కానీ, రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత ను ట్యాగ్ చేసి, రాష్ట్రం లో “పెరిగిపోతున్న ర్యాగింగ్ ఘటన”ల గురించి తనని ప్రశ్నించారు. ఈ పోస్ట్ ని #SaveAPFROMTDP అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు.

ఇతర యూజర్స్ ఇదే వీడియోని #TDPJSPGOVT అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మొన్నీ మధ్య జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ ఘటన జరిగింది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న ఫిబ్రవరి 2024 లో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఘటన గురించిన వార్తా కథనాల కోసం చూసినప్పుడు జూలై 25, 2024 నాడు ఈనాడు లో వచ్చిన వార్తా కథనం లభించింది. ఇందులో ఈ వీడియో స్క్రీన్ షాట్ ఉంది. ఈ కథనం ప్రకారం, ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట లోని శ్రీ సుబ్బరాయ నారాయణ (ఎస్ఎస్ఎన్) డిగ్రీ కళాశాల హాస్టల్ లో ఫిబ్రవరి 2, 2024 నాడు చోటుచేసుకుంది. అయితే వీడియో మాత్రం జూలై 24 నాడే బయటకి వచ్చింది. 

ఆంధ్రజ్యోతి కథనం లో కూడా ఈ వీడియో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఈ వీడియో జూలై 24 నాడు బయటకి వచ్చింది అని ఉంది. ఈ వీడియో బయటకి వచ్చాక ఆరుగురి మీద కేసు నమోదు చేశారు అని ఈ కథనం లో పేర్కొన్నారు. ఈటీవీ భారత్, డెక్కన్ క్రానికల్ లలో వచ్చిన కథనాలు ఈ వివరాలని ధృవపరుస్తున్నాయి. 

ఆంధ్రజ్యోతి కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఆంధ్రజ్యోతి)

ఈ ఘటన నరసరావుపేట మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. మేము వారిని సంప్రదించాము. ఈ ఘటన ఫిబ్రవరి 2, 2024 నాడు జరిగింది అని ఈ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి కృష్ణా రెడ్డి లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు. ర్యాగింగ్ పేరు మీద కళాశాలలోని మూడవ సంవత్సర డిగ్రీ విద్యార్ధులు రెండవ సంవత్సర విద్యార్ధులని కర్రలతో కొట్టారని ఆయన మాకు తెలిపారు. దాడి చేసిన వారు చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయారని, అయితే వారి మీద జూలై 24 నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అని, ఎఫ్ఐఆర్ సంఖ్య 91/2024 అని తెలిపారు. ఇప్పటికి ఒకరిని అరెస్ట్ చేశామని కూడా తెలిపారు.

ఈ ఘటన కి సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతి మాకు లభించింది. ఇందులో కూడా ఈ ఘటన ఫిబ్రవరి 2, 2024 నాడు జరిగింది అని ఉంది. 

ఎఫ్ఐఆర్ ప్రతి స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఆంధ్ర ప్రదేశ్ పోలీస్)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా ఈ ఘటన ఫిబ్రవరి 2024 లో చోటుచేసుకుంది అని, తాజాగా జరిగినది కాదు అని ఎక్స్ (ఆర్కైవ్ ఇక్కడ) లో పోస్ట్ చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వివరణ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/Factcheck.AP.Gov.in)

ఆంధ్ర ప్రదేశ్ లో మే 2019 నుండి ఏప్రిల్ 2024 వరకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా, కూటమి ప్రభుత్వం జూన్ 12, 2024 నాడు ప్రమాణ స్వీకారం చేసింది.

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కళాశాలలో విద్యార్ధులని కొడుతున్న వీడియో షేర్ చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని క్లైమ్ చేశారు. అయితే, ఈ ఘటన జరిగింది ఫిబ్రవరి 2024 లో. అప్పుడు అధికారంలో ఉన్నది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.