హోమ్ 2019 నాటి వీడియోని 2024 ఎన్నికల ఫలితాలకి సంబంధించి బీబీసీ ఆంచనాగా షేర్ చేశారు

2019 నాటి వీడియోని 2024 ఎన్నికల ఫలితాలకి సంబంధించి బీబీసీ ఆంచనాగా షేర్ చేశారు

ద్వారా: సోహం శా

మే 31 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2019 నాటి వీడియోని 2024 ఎన్నికల ఫలితాలకి సంబంధించి బీబీసీ ఆంచనాగా షేర్ చేశారు 2024 ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో గెలవనుందని బీబీసీ వార్తా సంస్థ ఆంచనా వేసిందని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ వైరల్ క్లిప్ 2019 నాటిది. ఇందులో బీబీసీ యాంకర్ నాటి ఎన్నికల ఫలితాలని ప్రకటిస్తున్నారు.

క్లైమ్ ఏంటి?

బీబీసీ వార్తా సంస్థకి చెందిన ఒక వీడియో క్లిప్ ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలకి కలిపి 347 సీట్లు వస్తాయని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకి కలిపి 87 సీట్లు వస్తాయని బీబీసీ అంచనా వేసిందని క్లైమ్ చేస్తున్నారు.

“తాజా సమాచారం ప్రకారం, బీజేపీ, దాని మిత్రపక్షాలు భారీ ఆధిక్యంలో ఉన్నాయి. 347 సీట్లు, స్పష్టమైన మెజారిటీ. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 87 సీట్లతో వెనుకబడి ఉన్నాయి,” అని యాంకర్ ఈ వీడియోలో చెప్పడం మనం వినవచ్చు. ఈ వీడియోని షేర్ చేసి, ఇది బీబీసీ వారి ఒపీనియన్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ అయ్యుండొచ్చు అని క్లైమ్ చేస్తున్నారు.

చివరి దఫా ఎన్నికలు జూన్ 1 నాడు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4 నాడు వెలువడనున్నాయి.

“ఇప్పుడు, చివరికీ బీబీసీ కూడా మోదీకి 347 సీట్లు అని చెబుతున్నది. కనీసం జూన్ 4 వరకైనా వారిని (విపక్షాలని ఉద్దేశించి) ఆశల పల్లకీలో ఉంచవలసింది,” అంటూ ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి శీర్షికగా పెట్టారు.

ఈ వీడియో మీద “నువ్వు నాశనమైపోగాక బీబీసీ. మీ లాంటి చెంచాల కలల్లో కూడా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని అవ్వనివ్వము” అని రాసి ఉంది.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది 2019 ఎన్నికల ఫలితాలని ప్రకటిస్తున్న వీడియో అని మేము తెలుసుకున్నాము.

వాస్తవం ఏమిటి?

గూగుల్ సెర్చ్ ద్వారా మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) బీబీసీ మే 23, 2019 నాడు పోస్ట్ చేసిందని తెలుసుకున్నాము. “2019 భారత దేశ ఎన్నికల ఫలితాలు: నరేంద్ర మోదీ భారీ విజయం - బీబీసీ న్యూస్” అనే శీర్షిక ఈ వీడియోకి పెట్టారు. వైరల్ క్లిప్ ఇందులో 0:03 టైమ్ స్టాంప్ దగ్గర చూడవచ్చు. 

ఈ వీడియోలో యాంకర్ నాటి లోక్ సభ ఎన్నికల లైవ్ ఫలితాలని ప్రకటిస్తున్నారు. 2019 లో ఓట్ల లెక్కింపు మే 23 నాడు జరిగింది. ఇలా ప్రకటిస్తూ, బీజేపీ, దాని మిత్రపక్షాలు 347 సీట్లు గెలుచుకున్నాయి అని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 87 సీట్లు గెలుచుకున్నాయి అని తెలిపారు.

2019 ఎన్నికలలో, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ 353 సీట్లు గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ 91 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ సొంతంగా 52 సీట్లు గెలుచుకుంది. 

దీని బట్టి, ఈ వీడియో 2019 ఎన్నికల ఫలితాలని ప్రకటిస్తున్న వీడియో అని, 2024 ఎన్నికల ఒపీనియన్ లేదా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినది కాదు అని స్పష్టం అవుతున్నది. అంతే కాక, ఎన్నికల సంఘం ఏప్రిల్ 6 నుండి జూన్ 1 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదలని నిషేధించింది కూడా.

తీర్పు

బీబీసీ 2019 నాటి ఎన్నికల ఫలితాలని ప్రకటిస్తున్న వీడియో ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకి, ఈ వీడియోకి సంబంధం లేదు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం - గుత్తా రోహిత్) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.