ద్వారా: తాహిల్ అలీ
జూన్ 12 2024
ఆ పాట కంగనా రనౌత్ గురించే అయినప్పటికీ, అది ఈమధ్య కాలంది కాదు. కంగనాపైన జరిగిన దాడికి దీనికి సంబంధం లేదు.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఇందులో ఇద్దరు వ్యక్తులు నటి మరియు రాజకీయవేత్త అయిన కంగనా రనౌత్ ని విమర్శిస్తూ పాట పాడారు అని ఉంది. దీనిని షేర్ చేసి, పంజాబ్ కి చెందిన ప్రజలు, చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో కంగనాపై చేయిజేసుకున్న సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ని సమర్ధిస్తున్నారని రాసుకొచ్చారు. కౌర్ ఇంతకుమునుపు, కంగనా రైతుల గురించి 2020 లో చేసిన వ్యాఖ్యలకు కోపంతో అలా చేసినట్టు తెలిపారు.
రనౌత్ ఈమధ్య కాలం లో జరిగిన భారతీయ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఆ వీడియోని షేర్ చేసి ఒక ఎక్స్ యూజర్ హిందీ లో ఇలా రాసారు, “కంగనా రనౌత్ చెంపదెబ్బ ఘటన: పంజాబ్ వాసులు మరియు రైతులు సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ని సమర్ధిస్తున్నారు. పాటలు కుడా రాస్తున్నారు. హర్యానా ఎన్నికలలో కంగనా బీజేపీకి ఇబ్బంది లాగే ఉంది.” ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 1,15,000 వ్యూస్ ఉన్నాయి, అలాంటి మరిన్ని ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టులు (సౌజ్యన్యం : ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వీడియో 2020 నాటిది. రైతుల నిరసనల నేపధ్యం లో ఇద్దరు అక్క చెల్లెల్లు ఈ పాటను పాడారు.
మేము ఏమి కనుగొన్నము?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, వైరల్ అవుతున్న వీడియోకి మరింత నిడివి గల వీడియో మాకు యూట్యూబ్ లో ‘RAMNEEK-SIMRITA’ అనే ఛానల్ లో లభించింది. దీనిని డిసెంబర్ 6, 2020 నాడు అప్లోడ్ చేశారు. ఆర్కైవ్ ఇక్కడ.
వార్తా కథనాల ప్రకారం, పంజాబ్ లోని మొహాలీ అనే ప్రాంతంలో ఉండే ఇద్దరు అక్క చెల్లెల్లు పాడారు. రైతుల నిరసన నేపధ్యంలో ఇంకెన్నో పాటలు కుడా సమకూర్చారు.
ఈ వీడియో శీర్షికలో ఈ పాటను నటి కంగనా రనౌత్ మరియు పాయల్ రోహత్గి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా విడుదల చేశారు అని తెలియజేసారు. యూట్యూబ్ వీడియోలో గాయకులు తాము రామ్నీక్ మరియు సిమ్రీతా అని తెలిపారు. పైగా ఈ పాటలో కొన్ని లైన్లు, రనౌత్ మరియు రోహత్గి రైతులపై చేసిన వ్యాఖ్యల గురించి రాసారు అని తెలిపారు.
కానీ వైరల్ అవుతున్న వీడియోలో వారు ఈ సందర్భాన్ని వివరించే భాగాన్ని తీసివేశారు. యూట్యూబ్ వీడియోలో పాటకి సంబంధించిన పంజాబీ లిరిక్స్ కుడా జతపరిచారు.
ఒరిజినల్ వీడియో, వైరల్ వీడియో స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వారి ఇంస్టాగ్రామ్ పేజీలో అలాంటి వీడియో పంజాబ్ లిరిక్స్ తో సహా అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).
లాజికల్లీ ఫ్యాక్ట్స్ వారిని స్పందన కోసం సంప్రదించింది. స్పందన రాగానే ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము.
రనౌత్ మరియు రోహత్గి ఏమన్నారు?
ప్రస్తుతం డిలీట్ చేయబడిన ఒక ఎక్స్ పోస్టులో రనౌత్ ఒక పెద్ద వయసు ఉన్న మహిళ ఫొటోని షేర్ చేసి, ఇలా రైతు ఉద్యమంలో కుర్చున్నందుకు ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇస్తున్నారు అని తెలిపారు. రనౌత్ వ్యాఖ్యలను అనేక మంది విమర్శించారు.
రామ్నీకి సిమ్రీతా పోస్ట్ చేసిన మ్యూజిక్ వీడియో లో కుడా ఆ పెద్ద వయసు మహిళ గురించి, వంద రూపాయలు తీసుకోవటం గురించి పాడారు, దీనిని మనం 0:52 - 1:00 వద్ద వినవచ్చు.
రోహత్గి కుడా రైతుల నిరసనలకి వ్యతిరేకంగా అనేక వీడియోలు తమ యూట్యూబ్ లో 2020-2021 మధ్య షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).
తీర్పు
వైరల్ వీడియోని తప్పుగా కంగనా రనౌత్ పై దాడి ఘటన తరువాత పాటగా షేర్ చేస్తున్నారు. కానీ ఈ పాటని 2020 లో రైతుల నిరసన సమయంలో ఇద్దరు అక్క చెల్లెల్లు కంగనా మరియు రోహత్గి చేసిన వ్యాఖ్యలకు జవాబుగా పాడారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)