హోమ్ 8500 రూపాయల ఎన్నికల హామీ గురించి కాంగ్రెస్ ఎంపీ మీద మహిళలు దాడి చేస్తున్న వీడియో కాదిది

8500 రూపాయల ఎన్నికల హామీ గురించి కాంగ్రెస్ ఎంపీ మీద మహిళలు దాడి చేస్తున్న వీడియో కాదిది

ద్వారా: రజిని కె జి

జూన్ 24 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
8500 రూపాయల ఎన్నికల హామీ గురించి కాంగ్రెస్ ఎంపీ మీద మహిళలు దాడి చేస్తున్న వీడియో కాదిది ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు నెలకి 8500 రూపాయలు డిమాండ్ చేస్తూ హర్యానాలో స్థానిక మహిళలు కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారీ కార్యాలయం మీద దాడి చేశారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

హర్యానా లోని ఫతెహ్ బాద్ లో కుమారి సెల్జా పత్రికా సమావేశానికి ప్రవేశం కోసం కాంగ్రెస్ మద్దతుదారులు తలుపు విరగ్గొట్టిన వీడియో ఇది.

క్లైమ్ ఏంటి?

కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మీడియా వారితో ఒక గదిలో మాట్లాడుతుండగా, గది బయట గొడవ జరుగుతున్న ఒక వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. మహిళలు సెల్జా కార్యాలయం తలుపులు విరగ్గొట్టి, ఆర్థకంగా వెనుకబడిన మహిళలకి నెలకి 8500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చేసిన హామీ నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తున్నారని క్లైమ్ చేస్తున్నారు.

ఈ వీడియోలో, సెల్జా జనాలతో మాట్లాడే ముందు బయట ఉన్న వారిని లోపలకి అనుమతించవద్దని తలుపు దగ్గర ఉన్న వ్యక్తికి చెప్పడం మనం చూడవచ్చు. అయితే, కొన్ని క్షణాల తరువాత తలుపుకున్న అద్దం పగిలిపోవటం కూడా మనం చూడవచ్చు. 

తప్పుడు సమాచారం షేర్ చేసే అలవాటు ఉన్నMr. Sinha అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో షేర్ చేసి, “రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 8500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా కార్యాలయంలోకి దూసుకొచ్చారు. తనని బందీగా తీసుకున్నంత పని చేశారు. ఈ హామే కాంగ్రెస్ నెత్తికి చుట్టుకుంటున్నది,” అని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఈ వీడియోలో హర్యానాలోని ఫతెహ్ బాద్ లో సెల్జా పత్రికా సమావేశం పెట్టినప్పుడు తమని కూడా లోపలకి అనుమతించమని కాంగ్రెస్ మద్దతుదారులు చేస్తున్నారు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వైరల్ వీడియో ఎడమ వైపు పై భాగాన “MY CITY NEWS” అనే లోగో ఉందని గమనించాము. ఇది హర్యానాకి చెందిన స్థానిక మీడియా సంస్థ. దీని ద్వారా, ఒరిజినల్ వీడియోని ఈ సంస్థ తమ ఫేస్బుక్ పేజ్ (ఆర్కైవ్ ఇక్కడ) లో జూన్ 13, 2024 నాడు పోస్ట్ చేసిందని తెలుసుకున్నాము.

సెల్జా, ఇతర కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతుండగా, కాంగ్రెస్ సభ్యులైన పరంవీర్ సింగ్, ఆయన అనుచరులు గది బయట నుంచుని ఉన్నారని ఈ వీడియో శీర్షికలో ఉంది. గదికి తాళం వేసి ఉందని, పరంవీర్ సింగ్, తన అనుచరులు బయట ఉన్నారని ఉంది. లోపలకి తాము కూడా వెళ్ళటానికి చేసిన ప్రయత్నంలో తలుపుకి ఉన్న గాజు పగిలింది అని ఈ వీడియో కథనంలో ఉంది. 

హర్యానా న్యూస్  (ఆర్కైవ్ ఇక్కడ) అనే మరొక స్థానిక వార్తా సంస్థ కూడా ఇదే వీడియోని, ఇదే తారీఖున తమ యూట్యూబ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో కూడా దాదాపుగా అవే వివరాలు ఉన్నాయి. ఇదే వీడియోని పంజాబ్ కేసరీ హర్యానా  (ఆర్కైవ్ ఇక్కడ) వారు కూడా తమ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. పత్రికా సమావేశానికి తమకి ప్రవేశం లేనందున పరంవీర్ సింగ్ అనుచరులు తలుపు విరగొట్టరని ఆరోపణలు ఉన్నాయని ఈ కథనంలో ఉంది. 

ట్రిబ్యూన్ ఇండియా కథనం ప్రకారం, కొంత మంది పాత్రికేయులు ఈ గది తలుపు మూసేయగా, పరంవీర్ సింగ్ బలవంతంగా కోపలకి వెళ్ళటానికి ప్రయత్నించారు. గదికి లోపల నుండి తాళం పెట్టారు అనే విషయాన్ని సెల్జా ఖండించారు. ఆ తరువాత పరంవీర్ సింగ్ సెల్జా పక్కన కూర్చున్నాక పత్రికా సమావేశం కొనసాగింది.

ఈటీవీ భారత్ కథనం ప్రకారం, ఈ ఘటన గురించి పూర్తి సమాచారం కోసం సెల్జా అంతర్గత విచారణకి ఆదేశించారు. మేము ఫతెహ్ బాద్ కి చెందిన న్యూస్ 18 విలేఖరి జస్పాల్ సింగ్ ను సంప్రదించాము. తను ఈ వివరాలు వాస్తవమే అని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల నుండి 8500 రూపాయలు డిమాండ్ చేయడానికి స్థానిక మహిళలు వచ్చారు అనే క్లైమ్ అబద్ధం అని తను స్పష్టం చేశారు. 

హర్యానాలోని తొహానాలో కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించమని హర్యానా కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపక్ బాబ్రియా కి తెలిపారని హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనంలోపేర్కొంది.

ఈ వీడియోలో ఉన్న కాంగ్రెస్ నాయకులని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. వారు జవాబిసత్తె కనుక ఇక్కడ పొందుపరుస్తాము.

తీర్పు

కాంగ్రెస్ మద్దతుదార్లు జూన్ 13 నాడు కాంగ్రెస్ ఎంపి కుమారి సెల్జా ఫతెహ్ బాద్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలోకి దూసుకువచ్చిన వీడియోని షేర్ చేసి మహిళలకి నెలకి 8500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన ఎన్నికల వాగ్ధానాన్ని అమలు చేయమని స్థానిక మహిళలు ఎంపీ కార్యాలయం మీద దాడి చేశారని క్లైమ్ చేశారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.