హోమ్ వైరల్ అవుతున్న ఫొటో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్ళినది కాదు

వైరల్ అవుతున్న ఫొటో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్ళినది కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

మే 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైరల్ అవుతున్న ఫొటో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్ళినది కాదు వైరల్ అవుతున్న ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న ఫోటో హైదరాబాద్ లోని మలక్ పేటలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ ఇంటింటి కి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయం లోనిది

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఏ ఐ ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫొటో షేర్ చేసి ఇది ఆయన ఎన్నికల ప్రచారంలో గుడికి వెళ్ళినపుడు తీసినది అని ఒక ఒక యూజర్ పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎం పి గా ఉన్న ఒవైసీకి ఈసారి భారతీయ జనతా పార్టీ కే మాధవి లత  పోటీ ఇవ్వనున్నారు. మే 13 న ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇంటింటికి తిరిగి ఒవైసి ప్రచారం చేస్తున్నారు 

వైరల్ ఫొటోలో ఒవైసీ ఒక పూల మాల వేసుకుని ఒక పూజారి పక్కన నిలబడి ఉన్నారు, దీనిని షేర్ చేస్తూ, ఇది బిజేపి వల్లనే సాధ్యం అయింది అని రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది. వైరల్ ఫొటో ఒవైసీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న సమయం లోనిది, గుడి వెళ్ళినప్పటిది కాదు.

వాస్తవం ఏమిటి?

వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, ఏ ఐ ఎం ఐ ఎం తమ అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో మే 2, 2024 నాడు షేర్ చేసిన ఫొటోలు లభించాయి. వైరల్ ఫొటోతో పాటు ఇంటింటి ప్రచారం లో భాగంగా తీసిన ఇతర ఫొటోలు కుడా ఇక్కడ చూడవచ్చు.

ఈ పోస్ట్ ప్రకారం, ఆ  ఫొటోలను  మలక్ పేట లోని మూసారాం బాగ్ మరియు ఇందిరా నగర్ లోని కాలనీ లలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మరియు మలక్ పేట ఎం ఎల్ ఏ బలాల అహ్మద్ ఇంటింటి ప్రచారం లో తీసినవి అని అర్ధమవుతుంది. 

ఏ ఐ ఎం ఐ ఎం పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/స్క్రీన్ షాట్)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ అసదుద్దీన్ ఒవైసీ ప్రజా సంబంధాల అధికారి, తౌసీఫ్ మొహమ్మద్ ని కుడా సంప్రదించింది, ఆయన మాతో మాట్లాడుతూ, ఈ ఫోటో మలక్ పేట లోని సరస్వతి నగర్ లో తీశారు అని తెలిపారు. ఇది అక్కడ మే 2, 2024 నాడు జరిగిన ఇంటింటి ప్రచారంలో తీసినది అని తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు కుడా ఈ సంఘటనకు చెందిన వీడియోని ప్రచురించాయి. ది ప్రింట్ (ఆర్కైవ్ ఇక్కడ) తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని ప్రచురించింది, ఇందులో పూజారి ఒవైసీ పక్కన నిలుచుని ఫొటో దిగటం, ఆయనకు దండ వెయ్యటం, మరియు కాషాయ రంగు శాలువా కప్పటం కుడా చూడవచ్చు. ఆ పూజారి, ఒవైసీ పక్కన ఉన్న మరో వ్యక్తిని కుడా సన్మానించారు.

తౌసీఫ్ మాతో మరో వీడియోని కూడా షేర్ చేసారు, ఇందులో కుడా ఇలాంటి విజువల్స్ యే ఉన్నాయి, కాకపోతే ఇవి మరో కోణం నుండి తీసినవి. ఈ వీడియో లో 57 సెకెన్ల నిడివి వద్ద, టోపీ పెట్టుకున్న మరో వ్యక్తి కుడా ఒవైసీని సన్మానించడం మనం చూడవచ్చు.

ప్రాంతీయ వార్తా పత్రిక సియాసత్ కుడా ఈ విషయం గురించి కథనం రాసింది, అందులో ఇది ఒవైసీ ఇంటింటి ప్రచారంలో జరిగింది అని ఉంది.

మరో తెలుగు న్యూస్ ఛానల్, ఆర్ టివి వారు చేసిన ఒక గ్రౌండ్ రిపోర్ట్ ని కుడా మేము చూసాము (ఆర్కైవ్ ఇక్కడ). ఆ ఛానల్ పాత్రికేయురాలు దేవిక ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళింది. ఈ వీడియో కథనంలో, పాత్రికేయురాలు ఆ వీధిలో వెళ్తూ, అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియోలో కుడా వైరల్ పోస్ట్లో మాదిరి గానే గోధుమ రంగు గేటు మనం చూడవచ్చు. ఈ వైరల్ పోస్ట్ లొకేషన్ మలక్ పేట లో ఉందని దీనితో నిర్ధారించవచ్చు. 

ఒవైసి కి సన్మానం జరిగింది గుడిలో కాదు వీధిలో అని ఈ పోలిక లో చూడవచ్చు (సౌజన్యం : ఎక్స్/ ఆర్ టివి తెలుగు/ స్క్రీన్ షాట్)

మేము పాత్రికేయురాలు దేవిక తో కూడా మాట్లాడి ఒవైసీకి పూజారి సన్మానం చేసింది మాజీ కార్పొరేటర్ ఇంటి వద్ద అని తెలుసుకున్నాము. ఆ పూజారి కుడా అక్కడే దగ్గర్లో ఉంటారని, ఇంటింటి ప్రచారం జరిగే సమయంలో అక్కడికి వచ్చారు అని తెలిపింది.

పైన చూపిన ఆధారాలోతో ఈ ఫొటోని ఒవైసీ ఇంటింటి ప్రచారంలో తీశారు అని అర్ధమయింది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ చూసిన అన్ని వీడియోలు ఈ ఘటన వీధిలో జరిగింది అని తెలియజేస్తున్నాయి.

తీర్పు : 

ఒక పూజారి అసదుద్దీన్ ఒవైసీ మెడలో దండ వేసిన ఘటన హైదరాబాద్ లోని మలక్ పేట లో ఇంటింటి ప్రచారంలో చోటు చేసుకుంది. గుడి వద్ద కాదు. కనుక మేము ఈ క్లెయిమ్ తప్పు దోవ పట్టించే విధంగా ఉందని నిర్ధారించాము.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.