ద్వారా: ఉమ్మే కుల్సుం
జూలై 4 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత క్రికెట్ జట్టుతో అక్టోబర్ 30, 2007 నాడు వారి ప్రపంచ కప్ విజయం తరువాత ఫొటో దిగారు.
క్లెయిమ్ ఏమిటి ?
జూన్ 29, 2024, బార్బొడాస్ లోని కింసింగ్టన్ ఓవల్ లో జరిగిన ఐసిసి టి20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2024 లో భారత దేశం సౌత్ ఆఫ్రికాను ఏడు రన్నుల తేడాతో ఓడించి విజయం సాధించింది.
ఈ విజయం అనంతరం, సామాజిక మాధ్యమాలలో ఒక పోస్టు వైరల్ అయింది. ఈ పోస్టులో 2007లో ప్రపంచ కప్పు విజయం తరువాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బదులుగా అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారతీయ క్రికెట్ జట్టుతో ఫొటో దిగారు అని ఉంది.
ఈ పోస్టులో గాంధీతో 2007 భారతీయ జట్టు మరియు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుడా ఉన్నారు.
ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూసర్, హిందీలో ఒక శీర్షికను రాసి, “భారతీయ క్రికెట్ జట్టు అప్పట్లో 2007లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో, రాజీవ్ శుక్ల బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రపంచ కప్ గెలిచింది.
ఇక్కడ ఫొటోషూట్ ను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాకుండా సోనియా గాంధీతో చేసారు. కానీ ఏ పాత్రికేయుడు కుడా దీనిని ప్రశ్నించలేదు అప్పట్లో. చుడండి కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని ఏ విధంగా వాడుకుని, ప్రధాని కార్యాలయాన్ని చిన్నబుచ్చిందో ."
ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆన్లైన్ లో క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ, మన్మోహన్ సింగ్ 2007 క్రికెట్ జట్టుతో ఫొటో దిగలేదు అనేది అవాస్తవం.
వాస్తవం ఏమిటి?
మా పరిశోధనలో అక్టోబర్ 30, 2007 నాటి ఫొటోలు ప్రధాని కార్యాలయం అధికారిక వెబ్సైట్ లో లభించాయి. ఈ ఫొటోలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరన్ కౌర్ మరియు ఇతర అధికారిక వ్యక్తులుతో భారతీయ క్రికెట్ జట్టు దిగిన ఫొటో లభించింది. ఆ ఫొటో శీర్షికగా, “అక్టోబర్ 30, 2007లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ టీంతో న్యూ ఢిల్లీ లో” అని ఉంది. మరో ఫొటోలో సింగ్ తన భార్య మరియు జట్టు కెప్టెన్ ధోని తో ఉన్న ఫొటో కుడా లభించింది.
2007 లో మన్మోహన్ సింగ్ ప్రపంచ కప్ విజేత జట్టుగా తో దిగిన ఫోటో (సౌజన్యం : పి ఎం ఓ)
ది టైమ్స్ అఫ్ ఇండియా కుడా అక్టోబర్ 30, 2007 నాడు మన్మోహన్ సింగ్ భారత జట్టుతో దిగిన ఫొటోని ప్రచురించింది. ఈ ఫొటోలలో మొత్తం జట్టుతో దిగిన ఒక గ్రూప్ ఫొటో మరియు వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ తో కరచాలనం చేస్తున్న మరో ఫొటో కుడా ఉంది, మరో ఫొటోలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరియు పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తో ఉంది.
గెట్టి ఇమేజెస్ ప్రకారం, వైరల్ అవుతున్న ఫొటో కుడా అక్టోబర్ 30, 2007 నాడు తీసినదే. ఆధారాల ప్రకారం, సోనియా గాంధీ, అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఆల్పైన్స్ (యు పి ఏ) చైర్ పర్సన్ మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా సింగ్ తో అదే రోజు ఫొటో తీశారు.
తీర్పు
అక్టోబర్ 30, 2007 నాడు, ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర అధికారులతో కలిసి టి 20 ప్రపంచ కప్ విజేతలతో ఫొటో దిగారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)