హోమ్ 2020 నాటి ఫొటోలని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటోలుగా షేర్ చేశారు

2020 నాటి ఫొటోలని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటోలుగా షేర్ చేశారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

జూలై 31 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2020 నాటి ఫొటోలని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటోలుగా షేర్ చేశారు వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటోలు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

2020 లో కేరళ లోనే ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనకి సంబంధించిన ఫొటోలు ఇవి.

క్లైమ్ ఏంటి?

కేరళ లోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి కనీసం 130 మంది చనిపోయారు. ఈ నేపధ్యంలో అక్కడ సహాయక చర్యలకి సంబంధించినవి అంటూ కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ సహాయక చర్యల ఫొటో ఒక దానిని షేర్ చేసి, “కేరళ నుండి చాలా బాధాకరమైన వార్త. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిధిలాల కింద వంద కన్నా ఎక్కువ మంది ఇరుక్కుపోయారు. ఎనిమిది మంది చనిపోయారు. శివుడా, అక్కడ ప్రజలని కాపాడు,” అని హిందీ లో రాసుకొచ్చారు. ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా రెండు జేసీబీ లతో సహాయక చర్యలు చేపడుతున్న ఫొటో ఒకదానిని తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసి, “వయనాడ్ లో మెప్పడి దగ్గర కొండచరియలు విరిగిపడుతున్న వార్తాలు బాగా ఆందోళనకి గురి చేశాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకి మా ప్రగాడ సానుభూతి.  శిధిలాలలో ఐరుక్కున్న వారిని సురక్షితంగా రక్షించాలని ప్రార్ధిస్తున్నాము,” అని రాసుకొచ్చారు. ఇటువంటి మరొక పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

ఆన్లైన్ లో చేసిన క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇవి 2020 నాటి ఫొటోలని మేము కనుక్కున్నాము.  

మేము ఎలా తెలుసుకున్నాము?

మొదటి ఫొటో

జేసీబీ లతో సహాయాక చర్యలు చేపడుతున్న ఈ ఫొటో 2020 లో కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డప్పటిదని తెలుసుకున్నాము. ఈ ఫొటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, ఓఎన్ మనోరమ పత్రిక లో అక్టోబర్ 30, 2020 నాడు వచ్చిన కథనం ఒకటి మాకు లభించింది. ఇందులో ఈ ఫొటో పీటిఐ ఏజెన్సీ వారు అందచేసింది అని ఉంది. ఆగస్ట్ 7, 2020 నాడు తీసిన ఫొటో అని ఉంది. ఇడుక్కి లో భారీ వర్షాల తరువాత కొండచరియలు విరిగిపడ్డప్పటి ఫొటో అని ఉంది. 

ఇతర ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ఈ ఫొటో ని అప్పుడు ప్రచురించాయి.

వైరల్ ఫొటో, 2020 నాటి ఫొటో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/ఓఎన్ మనోరమ)

రెండవ ఫొటో

నారింజ రంగు సూట్లు వేసుకుని సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్న అధికారులు ఉన్న ఈ ఫొటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే  బిజినెస్ స్టాండర్డ్ పత్రిక లో ఆగస్ట్ 9, 2020 నాటి కథనం లభించింది. అందులో ఈ ఫొటో ఉంది. NDRF Personnel Carry Out A Rescue Operation For Survivors After A Landslide Following Heavy Rainfall At Pettimudi In Idukki District,” అనేది ఈ కథనం శీర్షిక. 

వైరల్ ఇమేజ్, 2020 నాటి ఇమేజ్ మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/బిజినెస్ స్టాండర్డ్)

ఆగస్ట్ 9, 2020 నాటి లైవ్ మింట్ పత్రిక లోని కథనంలో ఇదే ఫొటో ఉంది. పిటిఐ ఏజెన్సీ వారు అందచేసిన ఫొటో అని ఉంది.

2020 లో ఇడుక్కి లో కొండచరియలు విరిగిపడిన ఘటన 

ఆగస్ట్ 2020 లో ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆగస్ట్ 7, 2020 నాడు రాజమాల ప్రాంతంలో పెట్టిముడి అనే ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన లో తేయాకు తోటల కార్మికుల నివాస ప్రాంతం శిధిలమయ్యింది. ఈ ఘటన లో కనీసం 49 మంది చనిపోగా, అనేక మంది ఆచూకీ తెలియరాలేదు.

తీర్పు

ఈ ఫొటోలు ఇడుక్కి కి చెందిన 2020 నాటి ఫొటోలు. తాజా వయనాడ్ ఘటన ఫొటోలు కాదు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.