హోమ్ క్లిప్ చేసిన వీడియోని చూపి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి మైక్ విషయమై కార్యక్రమం వదిలి వెళ్లినట్టు షేర్ చేసారు

క్లిప్ చేసిన వీడియోని చూపి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి మైక్ విషయమై కార్యక్రమం వదిలి వెళ్లినట్టు షేర్ చేసారు

ద్వారా: రాజేశ్వరి పరస

జూలై 17 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
క్లిప్ చేసిన వీడియోని చూపి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి మైక్ విషయమై కార్యక్రమం వదిలి వెళ్లినట్టు షేర్ చేసారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ మైక్ పని చెయ్యక కార్యక్రమం వదిలి వెళ్ళిపోయినట్టు షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తప్పుదారి పట్టించేది

ఒరిజినల్ వీడియోలో ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి ప్రెస్ మీట్ లో మైక్ విషయం తరువాత కుడా పోడియం దగ్గర మాట్లాడారు.

క్లెయిమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఒక ఎనిమిది సెకెన్ల వీడియోలో మైక్ ను టెస్ట్ చేసి, మరల దాన్ని పక్కన పెట్టిన వీడియోని షేర్ చేసి, ఆయన మైక్ పని చెయ్యని కారణంగా ఆ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోయారు అనే శీర్షిక తో షేర్ చేశారు.

ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి “నాకు ఇంట్రెస్ట్ పోయింది..' మైక్ పనిచేయకపోవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్” అని షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆన్లైన్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఇది తప్పుదోవ పట్టించేవిధంగా ఉంది. పూర్తి వీడియో చూడగా పవన్ కళ్యాణ్ కార్యక్రమం వదిలి వెళ్లినట్టు లేదు, ఆయన పక్కనే ఉన్న పోడియం వద్దకు వెళ్లి మాట్లాడినట్టు ఉంది. 

వాస్తవం ఏమిటి?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వెనకాల ఉన్న బ్యానర్ లో “O/o Commissioner, PR & RD Dept., Tadepalli Dt: 12-07-2024” అని రాసి ఉండటం మేము గమనించాము. ఈ కీ వర్డ్స్ ఆధారంగా వెతికితే ఈ వీడియో ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు లో తాడేపల్లి లో పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జులై 12, 2024 నాడు జరిగిన కార్యక్రమం లోనిది అని అర్ధమయింది.”

ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమ్ వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) సమాచార మరియు పౌర సంబంధాల శాఖ జులై  12 నాడు తమ యూట్యూబ్ ఛానల్ లో “ Press Conference by Hon'ble Deputy Chief Minister, Sri. Konidala Pawan Kalyan” అనే శీర్షిక తో అప్లోడ్ చేసింది. కాకపోతే, ఇది వైరల్ వీడియోకి కాస్త భిన్నమైన కోణం లో ఉంది. ఈ వీడియోలో 20:33 టైం స్టాంప్ వద్ద పవన్ కళ్యాణ్ చేతిలో ఒక మైక్ ని పట్టుకుని తమ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడటం మనం చూడవచ్చు, కానీ 20:43 వద్ద చూసినట్లతే అది పని చేయకపోవటం తో పవన్ కళ్యాణ్ ఆ మైక్ ని తట్టటం కుడా మనం చూడవచ్చు, మరల 21:00 వద్ద మరో వ్యక్తి మరొక మైక్ పవన్ కళ్యాణ్ కి అందించినా కుడా అది పని చేయకపోవటం తో ఆయన లేచి పోడియం వద్దకు వెళ్ళటం మనం చూడవచ్చు. కానీ ఆయన కార్యక్రమం వదిలి వెళ్ళలేదు. 21:13 వద్ద ఆయన నవ్వటం కుడా చూడవచ్చు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పారిశుధ్యం గురించి మరియు పొడి-తడి చెత్త వనరుల నిర్వహణ గురించి మాట్లాడారు.

మరో కోణం నుండి తీసిన ఇదే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ స్థాపించిన జన సేన పార్టీ కుడా యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ). ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను, ఇందులో 31:05 నుండి 31:13 వద్ద చూడవచ్చు.

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్  మైక్ పని చేయకపోవటం తో పోడియం వద్దకు వెళ్లి ప్రసంగించారు, కానీ ఆ విషయాన్ని తీసేసి ఆయన మీటింగ్ నుండి వెళ్ళిపోయినట్టు షేర్ చేశారు.

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.