హోమ్ బీజేపీ నాయకురాలు ఏప్రిల్ లో భారతీయ ముస్లింల గురించి అన్న వ్యాఖ్యలను ఎన్నికలలో ఓటమి తరువాత అన్నట్టుగా షేర్ చేసారు

బీజేపీ నాయకురాలు ఏప్రిల్ లో భారతీయ ముస్లింల గురించి అన్న వ్యాఖ్యలను ఎన్నికలలో ఓటమి తరువాత అన్నట్టుగా షేర్ చేసారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

జూన్ 20 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బీజేపీ నాయకురాలు ఏప్రిల్ లో భారతీయ ముస్లింల గురించి అన్న వ్యాఖ్యలను ఎన్నికలలో ఓటమి తరువాత అన్నట్టుగా షేర్ చేసారు మాధవీ లత భారతీయ ముస్లింలు టెర్రరిస్టులు అవ్వలేరు అని ఎన్నికలలో ఓటమి తరువాత చేసిన వ్యాఖ్యలు అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ వీడియోలో మాధవీ లత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2024 లో ఈ విధంగా వ్యాఖ్యానించారు.

క్లెయిమ్ ఏమిటి ?

భారతీయ జనతా పార్టీ నాయకురాలు కొంపెల్ల మాధవీ లత వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇందులో, ‘భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు’ అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ అన్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ, హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఏ ఐ ఎం ఐ ఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ పై ఓడిపోయిన వెంటనే ఆమె ఇలా అన్నారు అంటూ షేర్ చేస్తున్నారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ, “ఎన్నికలలో ఓడిపోయిన వెంటనే నేను తెలివిగల వ్యక్తిని అయ్యాను” అంటూ వ్యంగ్యమైన శీర్షిక తో షేర్ చేసారు. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 24,000 వేల వ్యూస్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన అలాంటి ఎక్స్ పోస్టును ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియో ఫేస్బుక్ మరియి యూట్యూబ్ లలో కుడా వైరల్ అయ్యింది. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్ట్ లను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆన్లైన్ లో పోస్ట్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియోని తప్పుదోవ పట్టించేవిధంగా షేర్ చేస్తున్నారు, ఎందుకంటే, ఇది ఎన్నికల ప్రచారం లో భాగంగా ఏప్రిల్ 2024 లో చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాల తరువాత కాదు.

మేము ఏమి కనుగొన్నము?

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, మాకు ఏప్రిల్ 24, 2024 నాడు యూట్యూబ్ లో ఇండియా టుడే సో సౌత్ పోస్ట్ చేసిన మరింత నిడివి ఉన్న వీడియో లభించింది (ఆర్కైవ్ ఇక్కడ).

ఈ వీడియోలో 2.27 టైం స్టాంప్ వద్ద ఒక వ్యక్తి  మాధవి లతను  ‘ముస్లింలు ఉగ్రవాదులు’ అనే వాదనను నమ్ముతారా అని అడిగిన ప్రశ్నకు, తను సమాధానం ఇస్తూ, “భారతీయ ముస్లింలు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేరు. కానీ పాపం పేద కుటుంబంలో పుట్టిన పిల్లలు మతం పేరుతో తప్పుదోవ పడుతున్నారు, వారి గురించి ఎం చెప్పగలం” అని అన్నారు.

ఇదే వీడియోని, హైదరాబాద్ ఫెస్టివల్స్ (ఆర్కైవ్ ఇక్కడ) అనే యూట్యూబ్ ఛానల్ కుడా ఏప్రిల్ 22,2024 నాడు ప్రచారం చేసింది. వైరల్ వీడియోలో ఉన్న సన్నివేశం ఇక్కడ 1:18 టైం స్టాంప్ వద్ద చూడవచ్చు.

ఏప్రిల్ 20, 2024 నాడు ది ప్రింట్ పబ్లిష్ చేసిన కథనం ప్రకారం, వైరల్ క్లిప్ లో ఉన్నట్టుగానే లత ఫోటోలు ఈ కథనం లో ఉన్నాయి. ఈ కథనం ప్రకారం, లా చదివే ఒక విద్యార్థి ఆమెను ఆ ప్రశ్న అడిగారు. దానికి ఆమె బదులుగా, “భారతీయ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాలేరు,” అని తెలిపారు. ఇందంతా ఆమె హైదరాబాద్ లో ఏప్రిల్ 13, 2024 నాడు పాదయాత్ర చేసిన సందర్భం లోనిది. కనుక ఇది ఎన్నికల ఫలితాలకు ముందుగానే జరిగింది.

ఇంతకు మునుపు లత ఒక ఊహ బాణాన్ని ఒక మసీదు వైపు సంధిస్తున్నట్టుగా ఉన్న వీడియో కుడా వైరల్ అయింది. దీనివలన వివాదం ఏర్పడింది, పైగా ఆమె కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తున్నట్టుగా ఆరోపణలు తలెత్తాయి. ఆ తరువాత బిజెపి లీడర్ ఎక్స్ లో స్పష్టత ఇస్తూ (ఆర్కైవ్ ఇక్కడ), ఆ వీడియో తనను తప్పుగా చూపించడానికి కావాలనే ఎడిట్ చేసారని పేర్కొంది, ఒకవేళ ఎవరి మనోభావాలైన దెబ్బతింటే అందుకు క్షమించాలని కోరింది. ఈ సంఘటన తరువాత ఆమెపై ఒక ఎఫ్ ఐ ఆర్ కుడా నమోదు అయ్యింది.

తీర్పు 

ఎన్నికల ప్రచారంలో తీసిన మాధవీ లత వీడియోని ఎన్నికలలో ఆమె ఓడిపోయిన తరువాత చేసిన వ్యాఖ్యలు గా షేర్ చేస్తున్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.