హోమ్ తమ పార్టీ కనుక ఓడిపోతే కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగిపోతాయి అని బీజేపీ అధ్యక్షులు జె. పి. నడ్డా అనలేదు.

తమ పార్టీ కనుక ఓడిపోతే కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగిపోతాయి అని బీజేపీ అధ్యక్షులు జె. పి. నడ్డా అనలేదు.

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తమ పార్టీ కనుక ఓడిపోతే కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగిపోతాయి అని బీజేపీ  అధ్యక్షులు జె. పి. నడ్డా అనలేదు.

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

జె. పి. నడ్డా వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రాజెక్టులని ఆ పార్టీ ఆపేస్తుంది అని జ

నేపధ్యం

కర్ణాటక శాసనభ ఎన్నికలు మే 10, 2023 నాడు జరిగాయి. ఎన్నికల ప్రచారం మే 8 నాటికి ముగిసింది. ఈ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె. పి. నడ్డా మే 7 నాడు విజయనగరలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకి సంబంధించి జనతా దళ్ (సెక్యూలర్) ఒక ట్వీట్ చేసింది. “బిజెపి కనుక ఈ ఎన్నికలలో ఒడిపోతే కేంద్ర ప్రభుత్వ ప్రొజెక్టులు అన్నీ ఆగిపోతాయి అని జె. పి. నడ్డా అన్నారు. “కేంద్ర నిధులు ఆపేస్తామని అంటున్న నువ్వేమి నాయకుడివి మిస్టర్ నడ్డా?” అని ఆ ట్వీట్ లో రాశారు. 

ఈ ట్వీట్ కి 407 లైక్స్ , 17,500 వ్యూస్ ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు డి. కె. శివ కుమార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నటులు ప్రకాష్ రాజ్ కూడా ఇలాగే ట్వీట్ చేసి, జె. పి. నడ్డాని, బిజెపిని విమర్శించారు. అయితే ఇది తప్పుదారి పట్టించే ట్వీట్. 

వాస్తవం

ది హిందూ పత్రికలో వార్తా కథనం ప్రకారం జె. పి. నడ్డా మే 7 నాడు విజయనగర జిల్లాలో హరపనహళ్లిలో బిజెపి అభ్యర్ధి కరుణాకర్  రెడ్డికి మద్ధతుగా  రోడ్ షో నిర్వహించారు. నడ్డా రోడ్ షో లైవ్ ప్రసారపు వీడియో ని లాజికల్లీ ఫాక్ట్స్ సంపాదించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంటి కేంద్ర ప్రభుత్వ పధకాలన్నీటికీ బ్రేక్ పడుతుంది అని చెబుతూ అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించమని ప్రజలకి చెప్పటం మనం ఈ వీడియో లో 59:20 దగ్గర చూడవచ్చు. బిజెపి ప్రభుత్వం దళితులకి, ఆదివాసులకి, ఒక్కళిగలకి, లింగాయతులకి రిజర్వేషన్ పెంచింది అని, అలాగే ఎస్ సి కోటాని వర్గీకరించిందని, సిద్ధరామయ్య ప్రభుత్వం గెలిస్తే కనుక ఈ నిర్ణయాలని ఆ ప్రభుత్వం తిరగదోడుతుంది అని కూడా జె. పి. నడ్డా చెప్పాడు.   

“సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం పనులన్నీ ఆపేస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మీకు ఇళ్లు రావు. రోడ్డు మరమ్మతులు కూడా ఆగిపోతాయి. అలాగే కొత్త రోడ్లు నిర్మించటం కూడా ఉండదు,” అని జె. పిఊ. నడ్డా ఆ రోడ్ షో లో అన్నాడు. “ఎస్ సి, ఎస్ టి, ఒక్కళిగ, లింగాయతులకి పెంచిన రిజర్వేషన్ రద్దు చేస్తానని కూడా సిద్ధరామయ్య అంటున్నాడు. ఆయన అన్నీ తీసేసుకోవటమే తప్ప ఇవ్వటానికి కాదు.” అని జె. పి. నడ్డా రోడ్ షో లో చెప్పాడు. డెక్కన్ హెరాల్డ్ పత్రిక కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది. 

కర్ణాటకలో విపక్షం కనుక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగిపోతాయి అని జె. పి. నడ్డా అన్నది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టులని ఆపేస్తుంది అని ఆయన చెప్పింది. కర్ణాటక ఎన్నికలలో బిజెపి ఒడిపోతే కనుక బిజెపి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులని ఆపేస్తుంది అని జె. పి. నడ్డా అనలేదు. 

తీర్పు

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గురించి జె. పి. నడ్డా చేసిన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారు. కర్ణాటకలో బిజెపి ప్రాజెక్టులని ఆపేస్తుంది అని జె. పి. నడ్డా అనలేదు. కాబట్టి ఈ వార్త తప్పుదోవ పట్టించేటట్టు ఉంది అని మేము నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.