హోమ్ రాంపూర్ రైల్వేట్రాక్ వద్ద జరిగిన సంఘటనకు మతరంగు పులిమి షేర్ చేసారు

రాంపూర్ రైల్వేట్రాక్ వద్ద జరిగిన సంఘటనకు మతరంగు పులిమి షేర్ చేసారు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

సెప్టెంబర్ 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కావాలనే ముస్లింలు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్డు పెట్టినట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ ముస్లింలు కావాలనే రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్డు పెట్టినట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో రాంపూర్ జి ఆర్ పి స్టేషన్ హౌస్ అధికారి మాట్లాడుతూ, ఈ ఘటనలో నిందితులు హిందూ మతానికి చెందిన వారే అని తెలిపారు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది, ఇందులో రైల్వే ట్రాక్ పై ఒక ఇనుప రాడ్డు ఉండటం మనం చూడవచ్చు. ఈ ఫొటోని షేర్ చేసి, కావాలనే ఇలా కొందరు ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు రైలును పట్టాలు తప్పించాలని ఈ విధంగా చేసినట్టు రాసుకొచ్చారు. ఈ ఫొటోని #railjihad అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ అనే ఊర్లో జరిగినట్టుగా షేర్ చేసారు. 

తరచు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసే ఒక ఎక్స్ యూజర్, ‘sonofbharat7’ ఈ ఫొటోని షేర్ చేసి హిందీలో ఈ విధంగా శీర్షిక పెట్టారు, “వేలాది మంది హిందువులు దాదాపుగా చనిపోబోయారు. . రాంపూర్ లోని ముస్లిం కాలనీలో ఉన్న టెర్రరిస్టులు రైల్వే ట్రాక్ పై ఒక ఇనుప రాడ్డు పెట్టి రైలును పట్టాలు తప్పిద్దామని చూసారు, కానీ డెహ్రాడూన్ ఎక్ష్ప్రెస్స్ లోని లోకో పైలట్ ఈ విషయాన్నీ గమనించి, ఎమర్జెన్సీ బ్రేక్ నొక్కి వేలాది మంది హిందువుల ప్రాణాలు కాపాడారు.” (తెలుగు అనువాదం). 

ఈ పోస్టుకు దాదాపుగా 167,000 వ్యూస్ మరియు 2,900 రీపోస్టులు, 5,000 లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు. మరిన్ని పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ విషంలో అరెస్ట్ అయిన నిందితుడు, ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కాదు అని, పోలీసులు నిర్ధారించారు.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఏ బి పి న్యూస్ సెప్టెంబర్ 22 నాడు ప్రచురించిన వార్త కథనం ఒకటి లభించింది. దీని ప్రకారం రాంపూర్ లోని గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జి ఆర్ పి) సందీప్ చౌహన్ మరియు విజేంద్ర అలియాస్ టింకు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వీరు రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఇనుప రాడ్డు దొంగతనం చేసి, రైలు సమీపించేసరికి అక్కడే వదిలి వెళ్లారు. ఈ విధంగా ట్రాక్ పై ఇనుప రాడ్డు పెట్టినందుకుగాను వారు అరెస్ట్ చేయబడ్డారు.

కథనం ప్రకారం, సెప్టెంబర్ 18 నాడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్ నుండి కత్గోడం కు నయిని జన్ శతాబ్ది ఎక్ష్ప్రెస్స్  వెళ్తుండగా, అందులోని లోకో పైలట్ ట్రాక్ పైన ఇనుప రాడ్డును గమనించారు, వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి రైలును ఆపారు. దీని అనంతరం, కేసు నమోదు చేసి పోలీసులు విచారణ మొదలుపెట్టారు.


అమర్ ఉజాలా కథనం ప్రకారం, ఈ సంఘటన సి సి టి వి వీడియోను చూసి నిందితులను గుర్తించినట్టు తెలుస్తుంది. వీరిపై ఇంతకు మునుపే 16 క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా కథనం పేర్కొంది. విచారణ అనంతరం, చౌహన్ మరియు విజేంద్ర అనే ఇద్దరు నిందితులను సెప్టెంబర్ 22 నాడు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

పైగా నిందితులు ముస్లింలు అంటూ ఏ విధమైన వార్త కథనాలు లేవు.

పోలీసులు ఏమన్నారు?

రాంపూర్ స్టేషన్ హౌస్ అధికారిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది, ఆయన మాతో మాట్లాడుతూ, ఈ విషయంలో నిందుతులు ముస్లిం మతానికి చెందిన వారు కాదు అని తెలిపారు. “సందీప్ మరియు విజేందర్ ఇద్దరు హిందువులే. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు, తరచు ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉంటారు. ఆ రోజు కుడా ఒక ఇనుప రాడ్డును దొంగిలించడానికి ప్రయత్నించగా, రాళ్లు అడ్డం వచ్చి ట్రాక్ మీద పడిపోయారు, ఈలోగా రైలు సమీపించడంతో ఆ రాడ్డును అక్కడే వదిలి పారిపోయారు,” అని తెలిపారు.

ఈ విషయమై సెక్షన్ 150 రైల్వే చట్టం కింద ఇద్దరి మీద కేసు రిజిస్టర్ అయింది అని కుడా తెలిపారు. ఈ చట్టం ప్రకారం దాదాపుగా పది సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు ఉంటుంది అని తెలిపారు. పైగా వీరిద్దరి పై దొంగతతనం కింద కేసు పెట్టి జైలుకి పంపినట్టు తెలిపారు. సందీప్ మరియు విజేందర్ అనే ఇద్దరు తరచు ఇలాంటి  చేస్తుంటారని, వీళ్ళపై అనేక కేసులు ఉన్నట్టుగా తెలియజేసారు.

పైగా, సెప్టెంబర్ 22, 2024 నాడు మొర్దాబాద్ జి ఆర్ పి ఎస్ పి తమ ఎక్స్ అకౌంట్ లో ఈ సంఘటనకు సంబంధించి వివరాలు తెలిపారు, నిందితుల పేర్లు సందీప్ విజేందర్ అని, వాళ్ళ ఫొటోలు కుడా షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ).

మొర్దాబాద్ జి ఆర్ పి ఎస్ పి ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్)

తీర్పు

మా పరిశోధన ప్రకారం, రైల్వే ట్రాక్ మీద ఇనుప రాడ్లు పెట్టిన నిందితులు ఇద్దరు హిందూ మతానికి చెందిన వారే. ఈ సంఘటనలో, ఆ రాడ్ ను దొంగతనం చేద్దామనుకుని, రైలు వచ్చిన వెంటనే అక్కడ వదిలి పారిపోవటం జరిగింది.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.