హోమ్ పాలెస్తీనా కి చెందిన వ్యక్తి ఫొటోని హామాస్ టెర్రరిస్ట్ అంటూ షేర్ చేస్తున్నారు

పాలెస్తీనా కి చెందిన వ్యక్తి ఫొటోని హామాస్ టెర్రరిస్ట్ అంటూ షేర్ చేస్తున్నారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్

నవంబర్ 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక పాలెస్తీనా వ్యక్తిని హమాస్ టెర్రరిస్ట్ అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ సామజిక మాధ్యమాలలో ఒక పాలెస్తీనా వ్యక్తిని హమాస్ టెర్రరిస్ట్ అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఫొటోలో ఉన్నది దియా అల్ ఆదిని, ఒక పాలెస్తీనా యువకుడు, ఇతను గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ దాడి అనంతరం ఆగష్టు 2024 లో తన రెండు చేతులు కోల్పోయాడు.

(పాఠకుల గమనిక : ఈ కథనం లో ఇబ్బందికర సంఘటనకు చెందిన వివరణ ఉంటుంది, పాఠకులు గమనించగలరు.)

క్లెయిమ్ ఏమిటి?

ప్రస్తుతం గాజా పై ఇజ్రాయెల్ దాడి అనంతరం, సామాజిక మాధ్యమాలలో, తన రెండు చేతులు కోల్పోయిన యువకుడి ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. దీనిని షేర్ చేస్తూ, ఇతను మొహమ్మద్ మహరూఫ్ అనే ఒక ‘హామాస్ మిలిటెంట్’ అంటూ రాసుకొచ్చారు. 

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక ఎక్స్ యూజర్ ఈ ఫొటోని షేర్ చేసి ఇతను ఇజ్రాయెలీ పిల్లల్ని చంపిన యువకుడు మహరూఫ్ అంటూ, ఇతనిని ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకుంది అంటూ రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ మా పరిశోధన ప్రకారం, ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి హామాస్ కి చెందిన వ్యక్తి కాదు, ఇతను ఇజ్రాయెలీ దాడి లో గాయపడిన ఒక పాలెస్తీనా యువకుడు.

మేము ఏ విధంగా కనుగొన్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ ఫొటోని మేము అలామి అనే ఒక ఫొటో వెబ్సైటు లో కనుగొన్నాము. 

అక్కడ ఉన్న వివరాల ప్రకారం, ఒమర్ అష్టావి ఈ ఫొటోను ఏపిఏ ఇమేజెస్ కోసం ఆగష్టు 31, 2024 నాడు తీశారు, ఇందులో ఒక పాలెస్తీనా యువకుడు దియా అల్ ఆదిని అనే వ్యక్తి ఉన్నారు, ఇతనికి ఇజ్రాయెల్ చేసిన దాడి లో తన రెండు చేతులు కోల్పోయారు. అలామి లో ఇతనికి సంభందించి అనేక ఫొటోలను మేము కనుగొన్నాము.

ఆగష్టు 31, 2004 నాడు అలామి లో ప్రచురితమైన ఫొటో (సౌజన్యం : అలామి/స్క్రీన్ షాట్)


మరొక రాయిటర్స్ కథనం ప్రకారం, ఆ పాలెస్తీనా యువకుడు 15 సంవత్సరాల ఆదిని, ఇజ్రాయెల్ దాడి అనంతరం గాజా లో గాయపడిన వ్యక్తులలో చికిత్స పొంది కోలుకున్న వ్యక్తులలో తాను ఒకరు. ఈ కథనం లో ఆదిని కి చెందిన మరో మూడు ఫొటోలు కూడా ఉన్నాయి, ఇతను, ఆగష్టు 13 నాడు జరిగిన దాడి లో తన రెండు చేతులు కోల్పాయాడు. దాడి జరుగుతున్న సమయంలో తాను ఒక ఒక అమర్చిన కాఫీ హౌస్ లో ఉన్నారు. 

పాలెస్తీనా న్యూస్ ఏజెన్సీ వఫా కథనం ప్రకారం (ఆర్కైవ్ ఇక్కడ) ప్రచురించిన మరో వీడియో గమనిస్తే, ఆదిని వైరల్ ఫొటోలో కనిపిస్తున్న భవనం దగ్గరే నడుస్తూ మీడియా వారితో మాట్లాడుతున్నారు.



తీర్పు

వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది హామాస్ మిలిటెంట్ కాదు, ఇందులో కనిపిస్తున్నది దియా అల్ ఆదిని అనే ఒక పాలెస్తీనా యువకుడు, ఇతను ఇజ్రాయెల్ గాజా పై చేసిన దాడి అనంతరం తన రెండు చేతులు కోల్పోయాడు. 

(అనువాదం : రాజేశ్వరి పరసా)

Read this fact check in English here

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.