హోమ్ ఎడిట్ చేసిన వీడియోని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చూస్తున్నట్టుగా షేర్ చేసారు

ఎడిట్ చేసిన వీడియోని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చూస్తున్నట్టుగా షేర్ చేసారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

జూన్ 14 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన వీడియోని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చూస్తున్నట్టుగా షేర్ చేసారు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చూస్తున్నారని క్లెయిమ్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం:ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారాన్ని కార్ లోని మినీ టివి లో చూస్తున్నట్టుగా షేర్ చేశారు. కానీ నిజానికి ఆ స్క్రీన్ ఖాళీగా ఉంది.

క్లెయిమ్ ఏమిటి?

కాంగ్రెస్ లీడర్ మరియు పార్లమెంట్ సభ్యలు రాహుల్ గాంధీ ప్రయాణం లో ఉన్న కారులో కూర్చుని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్త్రమాన్ని చూస్తున్నట్టుగా ఒక 16 సెకన్ల నిడివి గల వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.

జూన్ 9 వ తారీఖున, మోదీ మూడవసారి ప్రధాని గా దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. వందలాది అతిధుల మధ్య, మరియు ఇతర దేశాల నుంచి వచ్చిన నాయకుల మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు.

వైరల్ వీడియోని షేర్ చేస్తూ, రాహుల్ గాంధీ కార్ లో ప్రమాణ స్వీకారం చూస్తునట్టుగా షేర్ చేసారు. అలాంటి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టుకు 37,000 లైక్స్ ఉన్నాయి. ఎక్స్ లో ‘రాహుల్ గాంధీ లాంటి బలమైన ప్రతిపక్షం మరియు మోదీ 3.0’ అనే శీర్షికలతో షేర్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇంస్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇలాంటి వీడియోలే యూట్యూబ్ లో (ఆర్కైవ్ ఇక్కడ) కుడా రాహుల్ గాంధీ మోదీ ప్రమాణ స్వీకారం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు (హిందీలో) అనే శీర్షికతో అప్లోడ్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో అని కనుగొన్న్నాము.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఒరిజినల్ వీడియోని రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ (ఆర్కైవ్ ఇక్కడ ) అకౌంట్లో ఏప్రిల్ 17, 2024 నాడు, ఇండియా గురించి ఆలోచిస్తూ, ఇండియాని వెతుకున్నాను అనే హిందీ శీర్షికతో  పోస్ట్ చేసారు అని తెలిసింది. ఈ వీడియోలో కార్ లో ఉన్న మినీ టివిలో వీడియో ఏమి ప్లే అవ్వట్లేదు. ఈ పోస్టు ఏప్రిల్ 19 నాటి మొదటి విడత ఎన్నికలకు ముందే పోస్ట్ చేశారు.


వైరల్ వీడియో స్క్రీన్ షాట్ మరియు రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియో స్క్రీన్ షాట్ మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ఇన్ స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వైరల్ వీడియో మరియు ఒరిజినల్ వీడియోని పోల్చి చూస్తే కొన్ని లొసుగులు మాకు కనిపించాయి. రాహుల్ గాంధీ ముందు ఉన్న స్క్రీన్ లో మోదీ బూడిద రంగు కోటు వేసుకుని ఉన్నారు. కానీ 2024 ప్రమాణ స్వీకారం (ఆర్కైవ్ ఇక్కడ) లో మోదీ తెల్ల రంగు కుర్తా చుడిదార్ వేసుకున్నారు, దానిపై నీలం రంగు కోటు వేసుకున్నారు.

దుస్తులలో ఉన్న తేడాని గమనిస్తే, ఇది 2024 లోనిది కాదని 2019 లో మోదీ ప్రమాణ స్వీకారం సమయం లోనిది అని అర్దమవుతుంది (ఆర్కైవ్ ఇక్కడ)

ఈ వీడియో కి మూలం ఏమిటి?

వైరల్ వీడియోలో @amarprasadreddy అనే వాటర్ మార్క్ ఉంది. అమర్ ప్రసాద్ రెడ్డి అనే ఈయన ఒక బీజేపీ కార్యకర్త. ఆయన ఈ వైరల్ వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) తన ఎక్స్ అకౌంట్ లో మధ్యాహ్నం 1:39 న జూన్ 9 నాడు, ‘ఈ రోజు సాయంత్రం సన్నివేశాలు’ (ఆంగ్లం నుండి అనువాదం) అనే శీర్షిక తో షేర్ చేశారు. 

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/యూట్యూబ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

పైగా, అలాంటి పోస్టులనే (ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ) రెడ్డి ఎక్స్ ఫీడ్ లో చూసాము. వాటిని ప్రతిపక్షాన్ని హేళన చేస్తున్నట్టుగా వ్యంగ్యంగా షేర్ చేసారు. ఎడిట్ చేసిన వీడియో మొదటిగా వ్యంగ్యంగా షేర్ చేసిణా కుడా,  ఆ తరువాత సామాజిక మాధ్యమాలలో అసందర్భంగా షేర్ అవ్వటం జరిగింది.

తీర్పు :

రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చూస్తున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో డిజిటల్ గా ఎడిట్ చేసినది. ఒరిజినల్ వీడియోలో రాహుల్ గాంధీ ఎదురుగా ఉన్న స్క్రీన్ ఖాళీగా ఉంది.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.