హోమ్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకులు హనుమాన్ చాలీసా చదువుతున్నట్టుగా ఎడిట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకులు హనుమాన్ చాలీసా చదువుతున్నట్టుగా ఎడిట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

నవంబర్ 27 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకులు హనుమాన్ చాలీసా చదువుతున్నట్టుగా ఎడిట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది ప్రపంచ కప్పు ఫైనల్ లో హనుమాన్ చాలీసా పఠించిన వీడియో అని క్లైమ్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/జీ న్యూస్/ఓప్ ఇండియా /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియో ఫైనల్ కంటే ముందే జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లోనిది, దానికి జొప్పించిన ఆడియోకి సంబంధం లేదు.

క్లెయిమ్ ఏమిటి? 

నవంబర్ 19, 2023 నాడు భారత్ ఆస్ట్రేలియామధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో అక్కడ ఉన్న 1,50,000 మంది వీక్షకులు హనుమాన్ చాలీసా పఠించారు అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. 

అనేక మంది హిందూ మితవాద యూజర్లు, ఆర్ఎస్ఎస్ అనుబంధ పాంచజన్య పత్రిక కుడా దీనిని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలే రాసుకొచ్చారు. ఈ కథనం రాసే సమయానికి, ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య పోస్ట్ కు ఎక్స్ లో 110,000 వ్యూస్ (ఆర్కైవ్ ఇక్కడ) ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజ్యన్యం: ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మీడియా సంస్థలైన జీ న్యూస్, ఆసియా నెట్ న్యూస్ హిందీ, ఓప్ ఇండియా (ఒక హిందూ మిత వాద వార్త వెబ్సైటు) మరియు సకల్ మీడియా కుడా ఈ వీడియో షేర్ చేసి కథనాన్ని ప్రచురించాయి. ఓప్ ఇండియా ఆ తరువాత కథనాన్ని అప్డేట్ చేసింది. కానీ పాత ఆర్టికల్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ  చూడవచ్చు.  ఇతర వార్త సంస్థల కథనాలు కూడా ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వార్త కథనాల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: జీ న్యూస్, ఓప్ ఇండియా, ఆసియానెట్ న్యూస్ హిందీ/లాజికల్లి ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


కానీ, ఆ వీడియోలో ఎటువంటి నిజం లేదు. ఆ వీడియోలోని ఒరిజినల్ ఆడియోని ఎడిట్ చేసి వేరే ఆడియో పెట్టారు. అసలయిన వీడియోలో దర్శన్ రావల్ అనే గాయకుడు “చోగడా”  అనే పాట పాడాడు. అందులో మనకు వినిపించే ఆడియో ఒకప్పుడు జైపూర్ లోని జనాలు హనుమాన్ చాలీసా పఠించిన సమయంలో తీసినది.

మేము ఏమి కనుగొన్నాము?

కీ వర్డ్స్ వాడి గూగుల్ సెర్చ్ చేయగా,  ఇదే వీడియోని యూట్యూబ్ షార్ట్స్ లో అక్టోబర్ 27 నాడు, 2023లో సదాశివ్ (sadashiv52815) అనే యూజర్ అప్లోడ్ చేశారు అని కనుగొన్నాము. 

వైరల్ క్లిప్ మాదిరిగానే అలాంటి వీడియోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కుడా అదే విధంగా హనుమాన్ చాలీసా  పఠించటం మనకు వినిపిస్తుంది. కానీ, ఈ వీడియోకి శీర్షికగా ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ హష్టాగ్స్ వాడారు. 

ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19నాడు జరిగింది. కానీ ఈ వైరల్ వీడియో అక్టోబర్ నుండే సామాజిక మాధ్యమాలలో ఉంది. దీనిబట్టి ఈ వీడియోకి ఫైనల్ మ్యాచ్ కి సంబంధం లేదు అని మనం నిర్దారించవచ్చు.

ఇంకాస్త పరిశోధిస్తే, అదే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని అక్టోబర్ 16 నాడు కుడా అప్లోడ్ చేశారు, కానీ ఇక్కడ మనకి హనుమాన్ చాలీసా వినపడదు. దాని బదులుగా దర్శన్ రావల్ పాడిన ‘చోగడా’ పాట వినిసిపిస్తుంది. ఈ వీడియోకి శీర్షికగా, “నరేంద్ర మోదీ స్టేడియం లో దర్శన్ రావల్”, అని రాసి, “ఇండియా మరియు పాకిస్థాన్” హాష్టాగ్లు ఉంచారు. 

ఇలాగే ఇంకెవరైనా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీడియోలు పెట్టారా అని మేము వెతుకగా, వేరే కోణం నుంచి తీసిన మరో వీడియో మాకు లభించింది. ఇది అన్షు కశ్యప్ బ్లాగ్ అనే ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకి శీర్షికగా, “నరేంద్ర మోదీ స్టేడియంలో దర్శన్ రావల్ లైవ్ వీడియో | ఇండియా మరియు పాకిస్థాన్ | ప్రపంచ కప్|”, అని ఉంది. ఈ వీడియోలో మూడు నిమిషాల వ్యవధిలో ‘చోగడా’ అనే పాట మనకి వినిపిస్తుంది, ఆయన మైదానంలో ఈ పాటను లైవ్ లో పాడటం కుడా మనం చూడవచ్చు.

ఈ వీడియోని మరియు వైరల్ వీడియోని పోల్చి చూస్తే మాకు కొన్ని పోలికలు కనపడ్డాయి. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ మరియు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో దర్శన్ రావల్ ప్రదర్శన (సౌజన్యం: ఎక్స్ /యూట్యూబ్ / స్క్రీన్ షాట్)

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ మరియు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో దర్శన్ రావల్ ప్రదర్శన (సౌజన్యం: ఎక్స్ /యూట్యూబ్ / స్క్రీన్ షాట్)

దర్శన్ రావల్ కుడా తన ప్రదర్శన వీడియోని  ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అక్టోబర్ 15 నాడు షేర్ చేశారు. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14, 2023 నాడు గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. 

హనుమాన్ చాలీసా ఆడియో మూలం

హనుమాన్ చాలీసా అని షేర్ చేసిన వీడియోలో కింద కుడి పక్కన, ఆడియో సోర్స్ లో “జైపూర్ లో హనుమాన్ చాలీసా పఠన” అని రాసి ఉంది. 

వీడియోలో ఆడియో సోర్స్ చూపిస్తున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్)

పైగా “జైపూర్ వాలే” అనే యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియోని జూన్ 3, 2023 నాడు అప్లోడ్ చేశారు. ఇందులో వందలాది మంది కూర్చుని గుడిలో హనుమాన్ చాలీసా పఠించటం మనం చూడవచ్చు. ఇదే వీడియోని జైపూర్ వాలే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కుడా ఇదే ఆడియోతో అప్లోడ్ చేశారు. 

ఈ సంఘటన గురించి వార్త కథనాల కోసం వెతుకగా మాకు జూన్ 4నాడు, 2023 నాడు పోస్ట్ చేసిన ఏబిపి న్యూస్ వారి ఒక ఫేస్బుక్ పోస్ట్ లభించింది. ఈ పోస్ట్ లో ఉన్న వార్తా కథన లో వేల మంది ఏ విధంగా జైపూర్ లో హనుమాన్ చాలీసా పఠించారో రాసి ఉంది. 

తీర్పు

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో హనుమాన్ చాలీసా పఠించారు అంటూ ఉన్న వీడియో ఎడిట్ చేయబడినది మరియు తప్పుదోవ పట్టించేటట్టుగా ఉంది. ఈ వీడియో ఒరిజినల్ గా అదే స్టేడియంలో అక్టోబర్ 14న జరిగిన ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ కు సంబందించిన వీడియో. దీనికి  క్రీడా కార్యక్రమానికి సంబంధం లేని ఆడియోని తీసి జత చేసి షేర్ చేస్తున్నారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

(అనువాదం- రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.