హోమ్ బంగ్లాదేశ్ లో కుటుంభ వివాదాల వలన జరిగిన హత్యకి మతరంగు పులిమి షేర్ చేసారు

బంగ్లాదేశ్ లో కుటుంభ వివాదాల వలన జరిగిన హత్యకి మతరంగు పులిమి షేర్ చేసారు

ద్వారా: ప్రభాను దాస్

అక్టోబర్ 10 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో బంగ్లాదేశ్ లో హిందూ వ్యక్తి హత్య అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో బంగ్లాదేశ్ లో హిందూ వ్యక్తి హత్య అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వీడియోలో వ్యక్తి పేరు హనీఫ్ మియా ఇతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, కుటుంబ వివాదాలలో ఇతనిని హతమార్చారు.

క్లెయిమ్ ఏమిటి?

ఒక మృత దేహం చుట్టూ కొంత మంది వ్యక్తులు గుమ్మి గూడిన వీడియోని ఎక్స్ లో షేర్ చేసి, మరో హిందూ వ్యక్తిని బంగ్లాదేశ్ లో హతమార్చారు అంటూ రాసుకొచ్చారు. ఈ సంఘటన, నార్సింగ్డి లోని కొరియా పారా వద్ద ఈద్గాహ్ గేటు దగ్గర చోటు చేసుకుంది అని రాసుకొచ్చారు. 

పైగా, ఈ సంఘటన దృష్యా మరి కొందరు యూజర్లు బంగ్లాదేశీ హిందువులకు రక్షణ లోటయింది అంటూ, యునైటెడ్ నాషనల్స్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ను కుడా జోడించారు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజయానం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మా పరిశోధన ప్రకారం వైరల్ వీడియో లో ఉన్నది హనీఫ్ మియా అనే వ్యక్తి, కుటుంబ వివాదాల వలన ఇతని హత్య చేసారు. 

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, బంగ్లాదేశీ వార్తా ఛానల్ సొరెజోమిన్ బర్టా లో అక్టోబర్ 1, 2024 నాడు అప్లోడ్ చేయబడిన వీడియో ఒకటి లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). 

ఈ వీడియోని వేరే కోణం నుండి తీసినప్పటికి వైరల్ వీడియో మాదిరి వీడియోనే ఇక్కడా కనిపిస్తుంది. ఈ కథనం ప్రకారం బాధితుడిని హనీఫ్ మియా గా గుర్తించారు. పైగా మియా పై హత్య కేసుతో సహా పలు కేసులు ఉన్నట్టుగా బంగ్లాదేశ్ పోలీసులు తెలిపినట్టుగా కథనం లో ఉంది. 

పోలీసులు మరియు బంధువులు ఇచ్చిన తీర్మానం ప్రకారం, ఈ గొడవ కుటుంభం వివాదాల వలన చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం హనీఫ్ మియా తన మామయ్య హబు మియా హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం హనీఫ్ మియా హత్య కేసులో నిందితులుగా హాబు మియా తనయిలు నయీమ్ మరియు నదీమ్ పేర్లు జతచేర్చారు. 

వైరల్ వీడియో లోనూ మరియు ఛానల్ వీడియో లోను రెండింటిలో కూడా ఆకు పచ్చ రంగు గేటును మనం చూడవచ్చు.

వైరల్ వీడియో మరియు వార్తా కథనం లో ఉన్న గేటు పోలిక (సౌజన్యం : ఎక్స్/ సొరెజోమిన్ బర్టా)

వైరల్ వీడియో మరియు సొరెజోమిన్ బర్టా కథనానికి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ సొరెజోమిన్ బర్టా)


పైగా కీవర్డ్ సెర్చ్ చేసి వెతుకగా, బంగ్లాదేశ్ టీవీ ఛానల్ అయిన ఇండిపెండెంట్ టీవీ లో ప్రచురితమైన ఒక చిన్న వీడియో లభించింది. ఇందులో కుడా ఇవే వివరాలు లభించాయి (ఆర్కైవ్ ఇక్కడ).

బంగ్లాదేశ్ బులెటిన్, బిడి న్యూస్ 24 మరియు సఙ్గబాద్ పోరిక్రమ అనే బంగ్లాదేశ్ వార్తా సంస్థలు ఈ సంఘటన గురించి ప్రచురించాయి. అన్ని కథనాల ప్రకారము, ఈ హత్య ప్రతీకార చర్య గా జరిగింది అని తెలిపాయి. కథనాల ప్రకారం, హనీఫ్ మియా తన మావయ్య హబు మియా హత్యలో పాలు పంచుకున్నాడు అనే నెపం తో హనీఫ్ హత్య జరిగింది అని పేర్కొన్నాయి. ఈ విషయంలో విచారణ కొనసాగుతుంది, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. 

తీర్పు

వైరల్ అవుతున్న వీడియోలో హిందూ వ్యక్తికి సంభందించినది కాదు. బంగ్లాదేశ్ లోని హానిఫ్ మియా అనే ఒక ముస్లిం వ్యక్తి హత్యకు సంభందించినది, కుటుంభ వ్యవహారాలు ఈ హత్యకు కారణం.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.