హోమ్ గర్బా వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ కాదు

గర్బా వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

నవంబర్ 16 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
గర్బా వీడియోలో నృత్యం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ కాదు సామాజిక మాధ్యమాలలో వచ్చిన క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వీడియో లో కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉండే వికాస్ మొహంటే అనే వ్యక్తి, ఈయన తరచూ మోదీ లాగా ప్రదర్శనలు ఇస్తుంటారు.

క్లెయిమ్ ఏమిటి?

భారత ప్రధానిని పోలి ఉండే ఒక వ్యక్తి నృత్యం చేస్తున్న వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక వ్యక్తి షేర్ చేస్తూ, “నవరాత్రి గర్బా కార్యక్రమంలో ప్రధాని మోదీ నృత్యం చేస్తున్నారు”,  అనే శీర్షికతో షేర్ చేశారు. 

నవంబర్ 8నాడు షేర్ చేసిన ఈ వీడియోకి ఈ కథనం రాసే సమయానికి 38,000 వ్యూస్ వచ్చాయి. ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. ఇతరులు షేర్ చేసిన అలాంటి పోస్టుల ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

అయితే వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని కాదు. తన లాగా ఉండే మరో వ్యక్తి.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్స్ (ఎక్స్/స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

పైన పేర్కొన్న పోస్ట్ వైరల్ అవుతున్న తరుణంలో కొంతమంది యూజర్ లు నృత్యం చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ కాదు అతని లాగ ఉండే వికాస్ మొహంటే అని ఎక్స్ లో  కామెంట్లు పెట్టారు. మేము వికాస్ మొహంటే  ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసాము. అయన అకౌంట్ లో తాను ఒక నటుడునాని,, వ్యాపారవేత్తనని, అలాగే సోషల్ వర్కర్ కూడా అని పేర్కొన్నారు. ఆ అకౌంట్ చూస్తే ఆయన చాలా సార్లు నరేంద్ర మోదీ లాగా వస్త్రధారణ చేసి జనాల మధ్యలో ప్రదర్శనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. 

వికాస్ మొహంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని కొన్ని పోస్ట్లు(సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/స్క్రీన్ షాట్)

ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్యక్రమం వీడియోని వికాస్ మొహంటే నవంబర్ 8 నాడు లండన్ దీపావళి మేళాకి ముఖ్య అతిధిగా వెళ్ళిననప్పటిది అని తను రాశారు. ఈ వీడియోలో కుడా వికాస్ మొహంటే  ఆ కార్యక్రమమానికి తన అంగ రక్షకులలాగా నటిస్తున్న వారితో కలిసి లోపలికి వచ్చారు. వైరల్ వీడియోలోని వస్త్రధారణతోనే తను మనకి ఇక్కడ కనిపిస్తారు.

వికాస్ మొహంటే తనయుడు ప్రణయ్ మొహంటే లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ ఆ వైరల్ వీడియోలో ఉన్నది తన తండ్రేనని నిర్ధారించారు. 

వైరల్ వీడియో, ఒరిజినల్ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/ఇన్స్టాగ్రామ్/స్క్రీన్ షాట్స్)

వికాస్ మొహంటే మేనేజర్ అతుల్ పారీఖ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ఆ వైరల్ వీడియో నవంబర్ 4 మరియు 5 తారీఖులలో లండన్ లో జరిగిన దీపావళి వేడుకలకి వికాస్ మొహంటే  ముఖ్య అతిధిగా వెళ్లిన సందర్భంలోనిదని తెలిపారు.

తీర్పు:

వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కాదు, ఆయనని పోలి ఉండే వికాస్ మొహంటే అనే వ్యక్తి. ఈయన తరచుగా నరేంద్ర మోదీలాగా  వస్త్రధారణ చేసి ప్రజల మధ్యలో ప్రదర్శనలు ఇస్తుంటారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్దారించాము. 

(అనువాదం- రాజేశ్వరి పరస)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.