హోమ్ ఈ వీడియోలో ఉన్నది వై ఎస్ ఆర్ సి పి నాయకుడు విద్యుత్ శాఖ సిబ్బంది పై దాడి చేసిన దృశ్యాలు కావు

ఈ వీడియోలో ఉన్నది వై ఎస్ ఆర్ సి పి నాయకుడు విద్యుత్ శాఖ సిబ్బంది పై దాడి చేసిన దృశ్యాలు కావు

ద్వారా: రాజేశ్వరి పరస

జూలై 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఈ వీడియోలో ఉన్నది వై ఎస్ ఆర్ సి పి నాయకుడు విద్యుత్ శాఖ సిబ్బంది పై దాడి చేసిన దృశ్యాలు కావు వైఎసార్సీపి నాయకుడు పి కొండా రెడ్డి అనుచరులు విద్యుత్ శాఖ సిబ్బంది పై దాడి అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎఫ్ ఐ ఆర్ పరిశీలించగా ఈ ఘటన తెలంగాణ లో చోటుచేసుకుంది అని, ఆంధ్ర లో కాదు అని తెలిసింది.

క్లెయిమ్ ఏమిటి? 

యువ జన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై ఎస్ ఆర్ సి పి) కి చెందిన ‘కొండా రెడ్డి’ అనే వ్యక్తి తన అనుచరులతో విధ్యుత్ శాఖ సిబ్బంది పై దాడి చేస్తున్నారు అని ఒక 20 సెకెన్ల వీడియో వైరల్ అవుతుంది. ఈ దాడి చేయడానికి కారణం, గత నాలుగు నెలలుగా బిల్లులు కట్టకపోవటం అనే వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ఒక తెల్ల రంగు చొక్కా వేసుకుని ఉన్న వ్యక్తి మరో వ్యక్తిని కొడుతున్నట్టుగా. ఇతరులు ఆపుతున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). కథనం రాసే సమయానికి ఈ వీడియోకి ఎక్స్ లో 168,000 వ్యూస్ ఉన్నాయి, అలాంటి పోస్టుల ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


ఆన్లైన్ లో వైరల్  అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ మా పరిశోధన ప్రకారం, ఈ క్లెయిమ్ అబద్ధం. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ నగరం లో చోటు చేసుకుంది.

 మేము ఏమి కనుగొన్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ మరియు గూగుల్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని వివిధ సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా జులై 19 నాడు షేర్ చేశారు అని అర్ధమయింది. షేర్ చేస్తూ, ఈ ఘటన హైదరాబాద్ లోని మోతీ నగర్ లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది అని పేర్కొన్నారు. డెక్కన్ క్రానికల్, టైమ్స్ అఫ్ ఇండియా మరియు ప్రాంతీయ వార్త సంస్థ దిశ డైలీ  కుడా వైరల్ వీడియోలో నుండి స్క్రీన్ షాట్ లను తమ కథనంలో ప్రచురించాయి.

 

వైరల్ వీడియో మరియు డెక్కన్ క్రానికల్ కథనం లోని స్క్రీన్ షాట్ల మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ డెక్కన్ క్రానికల్)

టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, విద్యుత్ సిబ్బంది మీద టి మురళిధర్ అనే ఒక 20 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్థి మోతీ నగర్ లో దాడి చేశారు. బిల్ కట్టకపోవడంతో సిబ్బంది కనెక్షన్ తీసేయడంతో గొడవ మొదలయ్యి పెద్దదయింది.

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ఈ సంఘటన మోతీ నగర్ లో తమ పరిధి లోనే చోటు చేసుకుంది అని తెలిపారు. ముద్దాయి ఒక విద్యార్థి అని, డ్యూటీలో విద్యుత్ సిబ్బంది మీద దాడి చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటనకి ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధం లేదు అని తెలిపారు.”

ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున దాడి చేసిన వ్యక్తి రాజకీయ సంబంధాల గురించి వ్యాఖ్యానించడానికి సబ్ ఇన్స్పెక్టర్ నిరాకరించారు.

మేము ఈ కేసుకు సంబంధించి జులై 18, 2024 నాడు నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ కుడా చూశాము. దీని ప్రకారం, ఈ సంఘటన జులై 19, 2024 లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్ లోని మోతీ నగర్ లో చోటు చేసుకుంది. లైన్ ఇన్స్పెక్టర్ హెచ్ శ్రీకాంత్ మరియు మీటర్ రీడర్ పి సాయి గణేష్ పెండింగ్ బిల్స్ అయిన 6,858 రూపాయలను వసూలు చేయడానికి వెంకటస్వామి నివాసానికి వెళ్లారు. అక్కడ గొడవ జరుగగా వెంకటస్వామి కొడుకు సాయి గణేష్ మరియు శ్రీకాంత్ లపై దాడి చేశారు, ఇరువురికి గాయాలు అయ్యాయి.

అధికారిక పత్రాలలో ఎక్కడా కుడా వైఎసార్సీపి నాయకుడు కొండా రెడ్డి పేరు లేదు.

తీర్పు : 

హైదరాబాద్ లో ఒక విద్యార్థికి మరియు విద్యుత్ శాఖ ఉద్యోగులకు మధ్య జరిగిన గొడవని వైఎసార్సీపి నాయకుడు ఆంధ్ర లో విద్యుత్ శాఖ ఉద్యోగులను కొడుతున్నట్టుగా తప్పుగా షేర్ చేశారు.

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.