హోమ్ చంద్రబాబు నాయుడు దోషి అని నిర్ధారిస్తూ ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించలేదు

చంద్రబాబు నాయుడు దోషి అని నిర్ధారిస్తూ ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించలేదు

ద్వారా: రోహిత్ గుత్తా

సెప్టెంబర్ 14 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చంద్రబాబు నాయుడు దోషి అని నిర్ధారిస్తూ ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించలేదు సౌజన్యం: ఫేస్బుక్, వాట్స్ ఆప్

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈనాడు దినపత్రిక మొదటి పేజీ ఎడిటెడ్ ఫొటో ఇది. వాస్తవంగా అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ రాసిన కథనం అది.

నేపధ్యం 

2014 నుండి 2019 మధ్య తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ నుండి నిధులు మళ్లించారు అనే ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టిడిపి) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 10వ తారీఖున ది హిందూ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం అరెస్టు తరువాత విజయవాడలో అవినీతి నిరోధక శాఖ కోర్టు ఆయనకి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 

క్లైమ్ ఏంటి?

ఈనాడు మొదటి పేజీ ఫొటో అంటూ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఈ కుంభకోణం విలువ 371 కోట్లని, అలాగే పోలీసుల ప్రశ్నలకి “తనకు ఏమీ తెలియదు” అని చంద్రబాబు జవాబు ఇస్తున్నారని ఉంది. అలాగే సిఐడి దగ్గర ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా ఈ ఫొటోలో ఉంది. 

ఒక ఫేస్బుక్ యూజర్ ఈ ఫొటో షేర్ చేసి ఇలా రాసుకొచ్చారు, “న్యూస్ బాగానే వేసాడు డ్రామోజీ...నిన్నటినుండి ఉచ్చ పోసుకుంటూనే ఉండుంటాడు... నెక్స్ట్ వీడేనని అర్థమైవుంటుంది...జగన్ అంటే భయం టన్నుల్లో ఉంది వీడికి”. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు

‘డ్రామోజీ’ అనే పదం ఈనాడు, ఈటీవీ అధినేత సి. రామోజీరావుని ఉద్దేశించి వాడే అవహేళనాత్మక పదం. జగన్ అంటే వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వై ఎస్ ఆర్ సి పి) అధ్యక్షులు. 

ఫేస్బుక్ వాట్స్ ఆప్ లలో వచ్చిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/వాట్స్ ఆప్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఈనాడు ఎక్కువుగా టిడిపి సానుకూల,  వై ఎస్ ఆర్ సి పి వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూ ఉంటుంది. టిడిపి సానుకూల పత్రిక కూడా కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉంది అని చెప్పింది అంటే చంద్రబాబు దోషి అని నిర్ధారణ అయిపోయింది అని ఈ పోస్ట్ పెట్టిన యూజర్ ఉద్దేశం. ఈ ఫొటోలో ఉన్న ముఖ్య శీర్షిక “స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్”. దాని కింద ఉన్న ముఖ్య విషయాల జాబితాలో “నైపుణ్య శిక్షణ పేరుతో నిధుల దోపిడీ”, “పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసిన సిఐడి”, “‘సీఐటీ’ అధికారుల ప్రశ్నలకు ఏమీ తెలియదన్నట్లుగా బాబు సమాధానం” ఇతరత్రా ఉన్నాయి.

అయితే ఈనాడు ఇటువంటి కథనం ఏదీ ప్రచురించలేదు. అలాగే చంద్రబాబు దోషి అని ప్రకటించనూ లేదు. ఇది ఎడిటెడ్ ఫొటో. 

మేము ఏమి కనుగొన్నాము?

ఈ ఫొటోని గమనిస్తే ఇందులో అనేక తప్పులు మాకు కనబడ్డాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఎస్ఐటి అంటారు. అయితే ఇందులో ‘సీఐటీ’ అని ఉంది. అలాగే చంద్రబాబుకి పోలీసులు రిమాండ్ విధించారు అని ఉంది. అయితే ఒక నిందితుడిని అరెస్ట్ చేశాక వాళ్ళకి రిమాండ్ విధించేది న్యాయస్థానం. ఈ కేసులో విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం చంద్రబాబుకి రిమాండ్ విధించింది. 

(సౌజన్యం:ఫేస్బుక్/వాట్స్ ఆప్)

అలాగే ఈ దినపత్రిక వివరాలు మేము చూశాము. అంటే సంపుటి, ధర, తారీఖు, పేజీలు లాంటివి. ఈ ఫొటోలో ఇది సెప్టెంబర్ 10 నాటి విజయవాడ ఎడిషన్ అని ఉంది. అలాగే ధర Rs. 6.50 అని, పేజీలు 16 అని ఉంది. అదే రోజు విజయవాడ ఎడిషన్ ఆన్లైన్ ఎడిషన్ మేము చూశాము. అందులో సెప్టెంబర్ 10 రోజున పత్రిక ధర Rs. 10 అని, పేజీలు 18+28 అంటే మొత్తం 46 పేజీలు అని ఉంది.

అలాగే అసలైన ఎడిషన్ లో చంద్రబాబు ఫొటో ఇంత పెద్దగా లేదు. ఒక కథనం మధ్య చిన్న ఫొటోగా ఉంది. అసలైన ఎడిషన్ లో మొదటి పేజీ రెండు భాగాలుగా ఉంది. చంద్రబాబు అరెస్ట్, అవడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో పాటు జి 20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వార్తలు కూడా మొదటి పేజీలో ఉన్నాయి. 

సెప్టెంబర్ 10, 2023 నాటి ఈనాడు పత్రిక మొదటి పేజీ ఫొటో (సౌజన్యం: స్క్రీన్ షాట్/ఈనాడు ఈపేపర్)

పైన స్క్రీన్ షాట్ లో చూసినట్టు అసలైన ఎడిషన్ లో మొదటి పేజీలో ఎడమ వేపు “జగన్ పైశాచికానందం” అనే శీర్షిక ఉంది.

అలాగే కుడి వైపు “అరాచక అరెస్టు” అనే శీర్షిక ఉంది. “దండెత్తిన వందల మంది పోలీసులు” అని ఊదారంగులో ఉపశీర్షిక ఉంది. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని ఈ కథనంలో ఉంది. కాన్వాయ్ చుట్టూ జనం ఉన్న ఫొటో ప్రధాన ఫొటో కాగా, ఇన్సెట్ లో చంద్రబాబు ఫొటో ఉంది. ఈనాడు 29 ఎడిషన్స్  ఇదే మొదటి పేజీ, ఇవే శీర్షికలతో, ఇవే ఫొటోలతో ప్రచురింపబడ్డాయి. ఇందులో చంద్రబాబు దోషి అని కాని లేదా సిఐడి దగ్గర ఆయనకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని కాని ఎక్కడా లేదు.

తీర్పు

ఈనాడు పత్రిక మొదటి పేజీని డిజిటల్ గా మార్ఫ్ చేసి చంద్రబాబు దోషి అంటూ ఈనాడు మొదటి పేజీ కథనం ప్రచురించింది అని ప్రచారం చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

 

అనువాదం- గుత్తా రోహిత్ 

 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.