హోమ్ వైరల్ అవుతున్న ఫొటోలో రాహుల్ మరియు సోనియా గాంధీ వెనుక ఉంది ఏసు క్రీస్తు కాదు

వైరల్ అవుతున్న ఫొటోలో రాహుల్ మరియు సోనియా గాంధీ వెనుక ఉంది ఏసు క్రీస్తు కాదు

ద్వారా: అంకిత కులకర్ణి

మే 28 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైరల్ అవుతున్న ఫొటోలో రాహుల్ మరియు సోనియా గాంధీ వెనుక ఉంది ఏసు క్రీస్తు కాదు రాహుల్ గాంధీ వెనుక ఏసు క్రీస్తు ఉన్నాడు అని వైరల్ అయిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ పెయింటింగ్ పేరు మడోన్నా ఓరిఫ్లమ్మ, నికోలస్ రోరిచ్ అనే రష్యన్ కళాకారుడు వేసినది.

క్లెయిమ్ ఏమిటి? 

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ ఆరవ విడత ఎన్నికలలో ఓటు వేసి తరువాత తమ వేలును చూపిస్తున్న ఫొటో వైరల్ అయింది, ఈ ఫొటోలో వెనుక ఉన్నది ఏసు క్రీస్తు ఫ్రేమ్ అని అన్న క్లెయిమ్ తో షేర్ చేసారు. ఆ ఫ్రేమ్ లో ఒక వ్యక్తి ఒక తెల్ల రంగు బ్యానర్ పైన ఒక వృత్తాకారంలో మూడు ఎరుపు రంగు చుక్కలు ఉన్నట్టు ఉంది.

‘Mr Sinha’ అనే అకౌంట్ పేరుతో సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన అలాంటి ఒక పోస్టులో (ఆర్కైవ్ ఇక్కడ) జనేయుధారి బ్రాహ్మణ అయిన రాహుల్ గాంధీ గది లో ఏసు క్రీస్తు ఫొటో ఉంది కానీ హిందూ దేవతల ఫొటో లేదు అని రాసి షేర్ చేసారు. ఈ సోషల్ మీడియా హేండిల్ తరుచుగా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ పోస్టుకు, ఈ కథనం రాసే సమయానికి 1200000 కు పైగా వ్యూస్ ఉన్నాయి. అనేక మంది యూజర్లు కుడా ఇలాంటి క్లెయిమ్ తోనే షేర్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ పరిశోధన ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది మడోన్నా ఓరిఫ్లమ్మ పెయింటింగ్. ఇది ఒక రష్యన్ కళాకారుడు, నికోలస్ రోరిచ్ వేసినది. 

వాస్తవం ఏమిటి?

ఫొటోలో ఉన్న పెయింటింగ్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు గెట్టి ఫొటోస్ లో ఉన్న ఒక పెయింటింగ్ ఫొటో లభించింది. దీనికి శీర్షిక గా, ఇది మడోన్నా ఓరిఫ్లమ్మ, 1932 అని, ఇది న్యూ యార్క్ లోని నికోలస్ రోరిచ్ మ్యూజియం లోనిది అని ఉంది.

వైరల్ ఫోటోకి మరియు ఒరిజినల్ పెయింటింగ్ ఫోటోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/గెట్టి)

ఆ కళాకారుడి పేరు మీద ఉన్న వెబ్సైటులో వెతుకగా, ఈ పెయింటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఆ వెబ్సైటు లో పెయింటింగ్ లో బ్యానర్ పైన వృత్తాకారంలో ఉన్న మూడు చుక్కల గురించి వివరణ కుడా ఉంది. రోరిచ్ వేసిన ఈ పెయింటింగ్ లో ఉన్న ఆ మూడు చుక్కలని “బ్యానర్ అఫ్ పీస్” అంటారు అని ఉంది, ఇది సంప్రదాయాల ఏకత్వానికి గుర్తు అని ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, సృజనాత్మకత కళలను, విశ్వవిద్యాలయాలను, లైబ్రరీలను, ఆసుపత్రులను, ఇలా అన్నింటిని పొందుపరచడానికి గుర్తుగా చేశారు.

రోరిచ్ ఈ పెయింటింగ్ లో ఉన్న వృత్తాన్ని, సంప్రదాయం మొత్తంగా పరిగణించారు, అందులో ఉన్న మూడు చుక్కలని కళ, విజ్ఞానం మరియు మతం కింద పరిగణించారు. ఆ వెబ్సైటు ప్రకారం, ఈ పెయింటింగ్ 1960 నుండి లోన్ మీద ఉంది అని కుడా ఉంది.

నికోలస్ రోరిచ్ మ్యూజియం తమ ఫేస్బుక్ పేజీ (ఆర్కైవ్ ఇక్కడ) ఈ పెయింటింగ్ ని షేర్ చేస్తూ,  ఆ పెయింటింగ్ లో ఎప్పుడైనా ఆ మూడు చుక్కలకి అర్ధం ఏమిటో తెలుసా అని అడుగుతూ షేర్ చేసారు. మడోన్నా ఓరిఫ్లమ్మ (1932) పెయింటింగ్ రో రిచ్ ప్యాక్ట్ మరియు పీస్ బ్యానర్ ను సూచిస్తుంది.

న్యూ యార్క్ లోని  నికోలస్ రోరిచ్ మ్యూజియం షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్)

తీర్పు : 

వైరల్ ఫొటోలో ఉన్న పెయింటింగ్, మడోన్నా ఓరిఫ్లమ్మ, దీనిని తప్పుగా ఏసు క్రీస్తు ఫొటోగా షేర్ చేశారు. కనుక మేము దీనిని అబద్ధం అని పేర్కొన్నాము

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.