ద్వారా: మొహమ్మద్ సల్మాన్
ఏప్రిల్ 30 2024
వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియోలో కేవలం ముస్లింల గురించి మాత్రమే అమిత్ షా మాట్లాడారు.
క్లెయిమ్ ఏమిటి?
2024 సాధారణ ఎన్నికల నేపధ్యంలో భారత హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకి చెందిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అమిత్ షా హిందీలో మాట్లాడుతూ, “భారతీయ జనతా పార్టీ కనుక అధికారం లోకి వస్తే, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి రిజర్వేషన్లను రద్దు చేస్తుంది,” అని అంటునట్టు ఉంది.
ఈ వీడియో కారణంగా బిజేపీ ప్రభుత్వం ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది అని సామాజిక మాధ్యమాలలో విమర్శలు మొదలయ్యాయి. ఈ క్లైమ్ ని తెలంగాణ మరియు ఝార్ఖండ్ లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధిచిన వ్యక్తులు కుడా షేర్ చేసారు.
ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో హిందీలో పోస్ట్ చేస్తూ, “బీజేపీ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అని అమిత్ షా అన్నారు. ఈ విషయం పై సి, ఎస్ టి, ఓ బి సిలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి,” అని రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్ట్ లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లి ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఇది ఎడిట్ చేసిన వీడియో. ఒరిజినల్ వీడియోలో షా ముస్లిం మతస్థులకి ఎవరికైతే రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ ఉందో వారికి ఆపి వేస్తాం అని తెలిపారు.
వాస్తవం ఎమిటి?
వీడియోలో ఎడమ పక్కన కింద V6 న్యూస్ అనే ఒక తెలుగు చానల్ లోగో చూసాము. ఆ వీడియో (ఆర్కైవ్) లింక్ ను ఆ చానల్ తమ యూట్యూబ్ లో ఏప్రిల్ 23, 2024 నాడు ‘ముస్లిం రిజర్వేషన్ల పైన కేంద్ర హోమ్ శాఖా మంత్రి వ్యాఖ్యలు’ అనే శీర్షిక తో రాసి ఉంది.
ఈ వీడియోలో 2:38 టైం స్టాంప్ వద్ద, షా హిందీలో మాట్లాడుతూ, “భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వం ఏర్పరిస్తే, రాజ్యాంగ విరుద్దంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తాము. ఈ హక్కు కేవలం ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి లకు మాత్రమే ఉంది. వాళ్ళే దీని నుండి లబ్ది పొందుతారు, ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తాము,” అని అన్నారు.
దీని ద్వారా వైరల్ వీడియో ఎడిట్ చేయబడినది అని అర్ధయింది. వైరల్ వీడియోలో ముస్లిం అన్న పదాన్ని తీసేసి ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి లను చేర్చారు.
ఈ వీడియోని షా యూట్యూబ్ ఛానల్ లో కుడా ఏప్రిల్ 23, 2024 నాడు షేర్ చేసారు. ఈ వీడియోలో (ఆర్కైవ్) తెలంగాణ లోని చేవెళ్ల లో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించారు. ఇందులో 14:58 టైం స్టాంప్ వద్ద, వైరల్ వీడియో లో ఉన్న వ్యాఖ్యలను మనం ఇక్కడ వినవచ్చు.
షా ఏప్రిల్ 25 నాడు తెలంగాణ లోని సిద్దిపేట లో ఇచ్చిన ప్రసంగం లో కుడా ముస్లిం రిజర్వేషన్ల గురించి ఇదే విధంగా మాట్లాడారు. అలాంటి 9:30 నిమిషాల వీడియో ఇక్కడ చూడవచ్చు.
పైగా ఈ విధంగా, అమిత్ షా ఎడిటెడ్ వీడియో షేర్ చేసినందుకు గాను, హోమ్ మినిస్ట్రీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేసింది.
భారత్ దేశం లో ముస్లిం రిజర్వేషన్
హిందుస్థాన్ టైమ్స్ ఏప్రిల్ 25, 2024 కథనం ప్రకారం, తెలంగాణలోని ముస్లింలకు మిగతా ఓ బి సి లతో సహా విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది.
అయితే, ముందు నుంచి ఉన్న ఓ బి సి కోటా ని తగ్గించి ఇది ఇవ్వటం లేదు, ఓ బి సి లలో బి సి- ఈ అనే మరో కోటా ఏర్పరిచి, ఇలా ఇస్తున్నారు. ఈ రిజర్వేషన్ ని న్యాయస్థానాలలో అనేక సార్లు సవాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన కేసు సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉంది.
తీర్పు
తెలంగాణ లోని చేవెళ్లలో అమిత్ షా ఇచ్చిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి, అందులో ఉన్న ముస్లిం పదాన్ని తీసేసి ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి అని చేర్చి షేర్ చేసారు. ఒరిజినల్ వీడియోలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చే రిజర్వేషన్లను తీసి వేస్తాం అని అన్నారు. కనుక మేము ఇది అబద్దం అని నిర్ధారించాము.
(హిందీ నుండి ఆంగ్లం అనువాదం- అజ్రా అలీ)
(తెలుగు అనువాదం- రాజేశ్వరి పరస)