హోమ్ తెలుగు సినిమాలో సన్నివేశాన్ని పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నాయకుడు మహిళని ‘అపహరించిన’ ఫొటోగా క్లైమ్ చేశారు

తెలుగు సినిమాలో సన్నివేశాన్ని పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నాయకుడు మహిళని ‘అపహరించిన’ ఫొటోగా క్లైమ్ చేశారు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

ఫిబ్రవరి 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలుగు సినిమాలో సన్నివేశాన్ని పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నాయకుడు మహిళని ‘అపహరించిన’ ఫొటోగా క్లైమ్ చేశారు వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ పోస్ట్ లో వాడిన ఫొటో ఎస్. ఎస్, రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాలోనిది.

(గమనిక- ఈ కథనంలో లైంగిక దాడికి సంబంధించిన వివరణ ఉంది. పాఠకులు గమనించగలరు.)

నేపధ్యం

పశ్చిమ బెంగాల్ లో ఉత్తర 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్ ఖాలీ గ్రామమ గత నెల రోజులుగా రాజకీయ గొడవలకి కేంద్ర బిందువయ్యింది. ఫిబ్రవరి 15, 2024 నాడు డెక్కన్ హెరాల్డ్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ నాయకుల మీద లైంగిక వేధింపులు, ఇతర ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్త వివాదానికి దారి తీసింది. కలకత్తా హై కోర్టు ఈ కేసులని సుమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించమని ఆదేశించింది. కాంగ్రెస్, బిజేపీ లాంటి విపక్ష పార్టీలు చర్యలు తీసుకోమని డిమాండ్ చేశాయి.

క్లైమ్ ఏంటి?

ఈ నేపధ్యంలో, ఒక మగ వ్యక్తి తన పక్కగా ఒక మహిళతో నుంచుని విజయ సాంకేతాన్ని చూపిస్తున్న ఒక ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఇందులో ఉన్న మగ వ్యక్తి సందేశ్ ఖాలీ కి చెందిన తృణమూల్ నాయకుడని, తను ఒక హిందూ మహిళని అపహరించాడని క్లైమ్ చేశారు.

ఈ ఫొటో, క్లైమ్ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ ఫొటో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా లోనిది.

వాస్తవం ఏమిటి?

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా యూట్యూబ్ లో నవంబర్ 12, 2013 నాడు శ్రీ బాలాజీ మూవీస్ అనే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చానల్ వారు అప్లోడ్ చేసిన 3 నిమిషాల 24 సెకన్ల వీడియో ఒకటి మాకు దొరికింది. ఈ వీడియో వివరణ ఈ సన్నివేశం 2006లో విడుదల అయిన విక్రమార్కుడు సినిమాలోదే అనే విషయాన్ని స్పష్టం చేసింది. వైరల్ ఫొటోని మనం ఈ వీడియోలో 2:18 మార్క్ దగ్గర చూడవచ్చు. 

విక్రమార్కుడు సినిమాని హిందీలో ‘ప్రతిఘాట్ - ఏ రివెంజ్’ పేరుతో డబ్ చేశారు. ఈ డబ్బింగ్ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఈ సన్నివేశంలో మొహంతి అనే పోలీస్ ఇన్స్పెక్టర్ తప్పిపోయిన తన భార్యని వెతుకుతూ తన పిల్లలతో కలిసి స్థానిక శాసనసభ్యుడి ఇంటికి వస్తాడు. బాల్కనీలో తన భార్యని చూశాక కూడా శాసనసభ్యుని గూండాలకి భయపడి ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇదే సమయంలో తన భార్యని ఒక రెండు రోజులలో వదిలిపెడతానని శాసనసభ్యుని కొడుకు మున్నా చెబుతాడు. వైరల్ ఫొటోలో ఉన్న ‘విజయ సంకేతం’ ఈ సినిమా నేపధ్యంలో ‘రెండు రోజులు’ అనే దానికి సంకేతం. విక్రమార్కుడు సినిమాలో ఇన్స్పెక్టర్ భార్య పాత్రని మాధురి సేన్ పోషించగా, తృణమూల్ నాయకుడిగా చెప్పబడిన మున్నా పాత్రని అమిత్ తివారీ పోషించారు. 

అక్షయ కుమార్ ప్రధాన పాత్రలో 2012లో విడుదల అయిన ‘రౌడీ రాథోర్’ అనే హిందీ సినిమా ఈ విక్రమార్కుడు సినిమాకి రీమేక్.

సందేశ్ ఖాలీలో ఏమి జరుగుతుంది? 

ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం సందేశ్ ఖాలీలో వివాదం జనవరి 5 నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్ ఇంటికి సోదాలకి వచ్చినప్పుడు మొదలయ్యింది. షాజహాన్ అనుచరులు అధికారుల మీద దాడి చేయగా, షాజహాన్ అధికారుల నుండి తప్పించుకున్నారు. 

ఆ తరువాత షాజహాన్ తమని సంవత్సరాలు తరబడి లైంగిక వేధింపులకి, హింసకి గురిచేశాడని, తనని అరెస్ట్ చేయాలని సందేశ్ ఖాలీలో మహిళలు నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలలో భాగంగా షాజహాన్ అనుచరులైన షిబ ప్రసాద్ హజ్రా, ఉత్తమ సర్దార్ ఆస్థుల మీద దాడి చేశారు. షాజహాన్ ని తృణమూల ప్రభుత్వం కాపాడుతున్నదని బిజేపి ఆరోపించింది. దీనికి జవాబుగా బిజేపి సందేశ్ ఖాలీలో నిరసనలు రెచ్చగొడుతున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

తీర్పు

విక్రమార్కుడు సినిమాలోని ఒక సన్నివేశాన్ని షేర్ చేసి, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నాయకూడు మహిళని అపహరించిన ఫొటో అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(హిందీ నుండి అనువాదం- అజ్రా అలీ)  

(తెలుగు అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.