హోమ్ ‘చెత్త పన్ను’ గురించి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి పవన్ కళ్యాణ్ ను విమర్శించారా? లేదు. అది ఎడిటెడ్ వీడియో

‘చెత్త పన్ను’ గురించి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి పవన్ కళ్యాణ్ ను విమర్శించారా? లేదు. అది ఎడిటెడ్ వీడియో

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
‘చెత్త పన్ను’ గురించి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి పవన్ కళ్యాణ్ ను విమర్శించారా? లేదు. అది ఎడిటెడ్ వీడియో తెలుగుదేశం నాయకులు అయ్యన్న పాత్రుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది 2021 నాటి వీడియో. ఇందులో అయ్యన్న పాత్రుడు నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెత్త పన్ను విధించినందుకు విమర్శిస్తున్నారు.

క్లైమ్ ఏంటి?

తెలుగు దేశం పార్టీ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు అని క్లైమ్ చేస్తూ ఒక 17-సెకన్ల వీడియోని షేర్ చేస్తున్నారు.

“అందుకే వీళ్ళు చెత్త నా కొడుకులు అంటాను నేను. ఈ పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ కూడా చెత్త నా కొడుకులు అంటాను నేను. ఎందుకు చెత్త నా కొడుకులు అంటే చెత్త మీద పన్ను వేస్తున్నారు అండి. చెత్త మీద పన్ను వేసేవాళ్ళని చెత్త నా కొడుకులు అనకపోతే ఏమంటాం మనం,” అని అయ్యన్న పాత్రుడు అనటం మనం వినవచ్చు.

ఈ వీడియోలో ఈనాడు పత్రిక కథనం కూడా ఒకటి ఉంది. అందులో పిఠాపురం పట్టణంలో చెత్త పన్ను వసూలు చేసే అవకాశం ఉంది అని ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యులు.

అయ్యన్న పాత్రుడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నరు అని క్లైమ్ చేస్తూ ఈ వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది 2021 నాటి వీడియో అయ్యన్న పాత్రుడు నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

అయ్యన్న పాత్రుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించారా అని చూస్తే అటువంటి వార్తలేమీ కనపడలేదు. అప్పుడు ఈ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికాము. అప్పుడు మహా న్యూస్ (ఆర్కైవ్ ఇక్కడ ) వారు సెప్టెంబర్ 18, 2021 నాడు తమ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో మాకు లభించింది.

“చెత్త నా కొడుకులు- వైసిపి మంత్రులు: Ayyannapatrudu Sensational Comments on YCP Sarkar,” అనే శీర్షికతో వారు ఈ వీడియోని అప్లోడ్ చేశారు. ఇందులో అయ్యన్న పాత్రుడు “ప్రస్తుత ముఖ్యమంత్రి”, మంత్రులను విమర్శిస్తున్నారు. వైరల్ క్లిప్ ఇందులో 0:38 నుండి 0:54 టైమ్ స్టాంప్ మధ్య చూడవచ్చు.

మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని సామాజిక మాధ్యమాలలో కూడా  సెప్టెంబర్ 16, 2021 నాడు షేర్ (ఆర్కైవ్ ఇక్కడ) చేశారు. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

 జూలై 15, 2021 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) ప్రాజెక్ట్ లో భాగంగా, నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెత్త సేకరణ పన్ను విధించింది. ఏప్రిల్ 19, 2024 నాడు ది హిందూ లో వచ్చిన కథనం ప్రకారం ప్రతి ఇంటికి నెలకి 30 నుండి 120 రూపాయల మధ్య, వ్యాపార సంస్థలకి నెలకి 200 నుండి 15000 మధ్య ప్రతి నెల చెత్త పన్ను సేకరించారు.

అలాగే డిసెంబర్ 14, 2023 నాడు ఈనాడు లో వచ్చిన ఒక కథనం ప్రకారం, నాటి ప్రభుత్వం ఈ విధంగా సంవత్సరానికి 165 కోట్ల రూపాయల చెత్త పన్ను సేకరించింది.

తెలుగు దేశం, జన సేన, భారతీయ జనతా పారతే కూటమి ఎన్నికల ప్రచారం లో చెత్త పన్ను తొలగిస్తాము అని హామీ ఇచ్చింది. ఎన్నికలలో గెలిచాక, జూన్ నెలలో రద్దు చేసింది.

తీర్పు

చెత్త పన్ను విధించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అయ్యన్న పాత్రుడు విమర్శిస్తున్న వీడియోని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నట్టుగా తప్పుగా క్లైమ్ చేశారు.

(అనువాదం - గుత్తా రోహిత్) 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.