హోమ్ టీ 20 ప్రపంచ కప్పులో ఆఫ్ఘాన్ క్రికెటర్లు ‘వందే మాతరం’ అని నినాదాలు ఇవ్వలేదు

టీ 20 ప్రపంచ కప్పులో ఆఫ్ఘాన్ క్రికెటర్లు ‘వందే మాతరం’ అని నినాదాలు ఇవ్వలేదు

ద్వారా: ఇషిత గోయల్ జె

జూన్ 27 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
టీ 20 ప్రపంచ కప్పులో ఆఫ్ఘాన్ క్రికెటర్లు ‘వందే మాతరం’ అని నినాదాలు ఇవ్వలేదు ఆఫ్ఘాన్ క్రికెటర్లు 'వందే మాతరం' అనే నినాదాలు ఇచ్చారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆఫ్ఘాన్ క్రికెటర్లు ‘వందే మాతరం’ అని అంటున్నట్టుగా వీడియోని ఎడిట్ చేశారు. 2023 నాటి ఒరిజినల్ వీడియోలో క్రికెటర్లు ‘అల్లాహూ అక్బర్’ అని అంటున్నారు.

క్లైమ్ ఏంటి?

ప్రస్తుతం జరుగుతున్న పురుషుల టీ 20 ప్రపంచ కప్పు నేపధ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ‘వందే మాతరం’ అని నినాదాలు ఇస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. సూపర్ ఎయిట్ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా మీద గెలిచిన తరువాత వారు ఇలా సంబరాలు చేసుకుంటున్నారు అని క్లైమ్ చేశారు. ‘వందే మాతరం’ అనేది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత దేశంలో జరిగిన స్వతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్య నినాదం.

ఈ వైరల్ వీడియోలో, ఇండియా 24 రన్ ల తేడాతో గెలిచింది అనే ఇండియా - ఆస్ట్రేలియా స్కోర్ బోర్డ్ ఉంది. “ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ని ఓడించి సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. ఇండియా గెలుపు తరువాత ఆఫ్గనిస్థాన్ క్రీడాకారులు ‘వందే మాతరం’ అని నినాదాలు ఇస్తూ ఇండియా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు,” అని ఎక్స్ లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి హిందీలో రాసుకొచ్చారు. “ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారులు ఇండియా ‘వందే ప్లేయర్స్ మాతరం’ గెలుపు మీద శుభాకాంక్షలు తెలియచేసారు,” అని ఒక యూట్యూబ్ శీర్షికలో ఉంది. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, 2023 నాటి వీడియో ఒకటి మాకు లభించింది. ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ తన అధికారిక, వేరిఫైడ్ ఇన్స్టాగ్రామ్  అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో ఈ వీడియోని అక్టోబర్ 23, 2023 నాడు పోస్ట్ చేశారు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ టీం కి తను శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో “నారా- ఈ - తక్బీర్, అల్లా- హూ- అక్బర్” అని నినాదాలు మనం స్పష్టంగా వినవచ్చు. నబీ ఇదే వీడియోని తన ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ ) లో కూడా పోస్ట్ చేశారు. “శుభాకాంక్షలు! మనం టీం గెలిచింది. పాకిస్థాన్ మీద గెలిచి ఎప్పటినుండో వేచి చూస్తున్న విజయాన్ని మనం సాధించాము. ఇది నైపుణ్యానలకి, టీం వర్క్ కి నిజమైన పరీక్ష. అందరూ తమ పూర్తి టాలెంట్ ని, అంకితభావాన్ని చూపించారు. మనం గొప్ప టీం, ప్రజల గొప్పదనాన్ని మనం కలిసి సంబరాలు చేసుకుందాం,” అనేది ఈ పోస్ట్ శీర్షిక. 

హిందీ న్యూస్ చానల్ ఆజ్ తక్ దీని గురించి అక్టోబర్ 24, 2023 నాడు ఒక కథనం ప్రచురించింది. అందులో కూడా ఇవే వివరాలు ఉన్నాయి. ఆఫ్ఘాన్  టీం పాకిస్థాన్ మీద వన్డే క్రికెట్ లో తొలిసారిగా గెలిచింది అని, ఆకబతవబర్ 23, 2023 నాడు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ని ఓడించింది అని ఈ కథనంలో ఉంది. గెలిచిన సంబరాలలో ఆఫ్ఘాన్ క్రికెటర్ గులాబ్దీన్ నాయబ్ అల్లా- హూ- అక్బర్ అనే నినాదాలు ఇచ్చారు. 

ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ లో ఆఫ్ఘాన్ టీం బంగ్లాదేశ్ ని సొప్పర్ ఎయిట్ మ్యాచ్ లో ఓడించి సెమీ-ఫైనల్స్ కి చేరుకుంది. అయితే, జూన్ 26, 2024 నాడు జరిగిన సెమీ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతులో ఓడిపోయింది. అదే సమయంలో, ఇండియా ఆస్ట్రేలియా మీద సూపర్ ఎయిట్ లో ఆస్ట్రేలియా మీద గెలిచి, జూన్ 27, 2024 నాడు ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్స్ లో తలపడనుంది.

తీర్పు

ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియా మీద ఇండియా గెలిచాక, ఆఫ్ఘాన్ టీం ఈ విజయాన్ని ‘వందే మాతరం’ అనే నినాదం తో సెలబ్రేట్ చేసుకుంది అని క్లైమ్ చేస్తూ ఈ వైరల్ వీడియోని షేర్ చేస్తున్నారు. అయితే, 2023 నాటి ఒరిజినల్ వీడియోలో ‘అల్లా-హూ-అక్బర్’ అనే నినాదాలని మనం స్పష్టంగా వినవచ్చు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.